• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  Box Office >  రామాయణ చైనీస్ వర్షన్ రెడీ...

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

| రణబీర్ కపూర్, సాయి పల్లవి నటించిన ‘రామాయణ’ను చైనాతో పాటు దాదాపు 40 దేశాల భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏఐ సాయంతో లిప్‌సింక్ చేసి, చైనీస్ వెర్షన్‌ను 25 నిమిషాలు తక్కువ నిడివితో సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘దంగల్’ దర్శకుడు నితీష్ తివారీకి చైనాలో ఉన్న గుర్తింపుతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

By - Ramesh Palla
Update: 2026-11-16 19:05 GMT

రణబీర్‌ కపూర్‌, సాయి పల్లవి రాముడు-సీత పాత్రల్లో నటించిన 'రామాయణ' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈనెల చివరి వరకు సినిమా రూ.2000 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లీష్‌ వర్షన్‌ను విడుదల చేసిన మేకర్స్ త్వరలోనే చైనీస్‌తో పాటు దాదాపు 40 ప్రపంచ దేశాల భాషల్లో విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యాధునిక ఏఐ టెక్నాలజీ ఉపయోగించి లింప్ సింగ్‌ చేస్తున్నారట. ఏ భాషలో విడుదల చేస్తే ఆ భాషకు సంబంధించిన లిప్‌ సింక్‌ చేసి సరికొత్త వర్షన్‌లను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశానికి తగ్గట్లుగా వర్షన్‌లు ఎడిట్‌ చేయాలి అనేది కూడా మేకర్స్ ప్లాన్‌ అని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. దాంతో సినిమా హాలీవుడ్‌ సినిమాల రేంజ్‌ లో వేల కోట్ల వసూళ్లను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

నితీష్ తివారీ రామాయణతో...

రామాయణ దర్శకుడు నితీష్‌ తివారీకి చైనాలో మంచి ట్రాక్ రికార్డ్‌ ఉంది. పదేళ్ల క్రితం దంగల్ సినిమాతో నితీష్ తివారీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అందుకే రామాయణ సినిమాతో ఆయన మరోసారి చైనాలో సత్తా చాటుతాడనే నమ్మకంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. దంగల్ దర్శకుడి సినిమా అని ప్రచారం చేయడం ద్వారా చైనాలో కచ్చితంగా రామాయణకు మంచి బిజినెస్ జరగడం ఖాయం, అలాగే ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ రావడం ఖాయం. అదే జరిగితే కచ్చితంగా మొదటి వారం రోజులు భారీ వసూళ్లు నమోదు అవుతాయి. ఒకవేళ సినిమా సూపర్‌ హిట్ టాక్‌ దక్కించుకుంటే దంగల్ సాధించిన వసూళ్లకు ఏమాత్రం తగ్గకుండా, అంతకు మించి అన్నట్లుగా రాబట్టినా ఆశ్చర్యం లేదు. రామాయణ చైనీస్‌ వర్షన్‌ ను విభిన్నంగా ఉండేలా ఎడిట్‌ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇంగ్లీష్‌లో రామాయణ మూవీ...

నితేష్ తివారీ ఇప్పటికే ఇంగ్లీష్ వర్షన్‌ను ఇతర ఇండియన్‌ భాషల వర్షన్‌లతో పోల్చితే పూర్తి విభిన్నంగా డిజైన్‌ చేశాడు. ఇంగ్లీష్ వర్షన్‌ కోసం కొన్ని సీన్స్‌ షూట్‌ చేశారా అన్నట్లుగా ఆ వర్షన్‌ చూస్తే అనిపిస్తుందని సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది. చైనాలో విడుదల చేయడం కోసం కూడా చైనీస్ వర్షన్‌ ను ఏఐ టెక్నాలజీ ఉపయోగించి రెడీ చేసేందుకు గాను ఒక టీం వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చైనాలో విడుదల చేయబోతున్న వర్షన్‌ను ఇండియన్‌ లాంగ్వేజ్ వర్షన్‌లతో పోల్చితే దాదాపుగా 25 నిమిషాల నిడివి తక్కువ ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. మెయిన్‌ సోల్‌ మిస్‌ కాకుండా ట్రిమ్‌ చేస్తూ సినిమాను చైనా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఎడిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనాలో విడుదల చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది, అప్పటి వరకు నూరు శాతం పర్‌ఫెక్ట్‌ చైనీస్‌ వర్షన్‌ రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

రణబీర్‌ కపూర్‌, సాయి పల్లవి రామాయణ మూవీ...

రామాయణ కథను చైనా ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారా అనే ఆసక్తి నెలకొంది. దంగల్ సినిమాను ఎందుకు అంతగా హిట్ చేశారు అనేది ఏ ఒక్కరూ కనీసం అంచనా వేయలేక పోతున్నారు. దంగల్ తర్వాత ఇప్పటి వరకు మరే ఇండియన్ సినిమా, నాన్ ఇంగ్లీష్ మూవీ ఆ స్థాయిలో చైనాలో వసూళ్లు సాధించిన దాఖలాలు లేవు. ఆ రికార్డ్‌ ను రామాయణతో బ్రేక్ చేయాలని నితీష్ తివారీ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. చైనాకు ఆయనకు అవినాభావ సంబంధం ఉంది కనుక రామాయణ సినిమా అక్కడ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో రామాయణ హిట్‌ అయితే పార్ట్‌ 2 ను మరింత స్పెషల్‌గా చైనాలో విడుదల చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. రామాయణ చైనాలో హిట్‌ అయ్యి భారీ వసూళ్లు నమోదు చేస్తే వరల్డ్‌ వైడ్‌ బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ రూ.3000 కోట్లకు చేరే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆ రికార్డ్‌ ను అందుకోగల సత్తా రామాయణకు ఉందా అనేది వచ్చే ఏడాది చైనాలో విడుదలైన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Tags:    
  • ramayana 
  • ranbirkapoor 
  • saipallavi 

Similar News

'ధురంధర్ 2' డే 14 కలెక్షన్లను దాటేసిన రామాయణం!

2026-11-19 05:08 GMT

సంక్రాంతి 'కాకా' పై రూ.150 కోట్ల పందెం..!

2026-11-18 22:30 GMT

'అవెంజర్స్' బుకింగ్స్ చూస్తే మన నిర్మాతలకు ఓ ప్రశ్న!

2026-11-17 10:02 GMT

డిసెంబర్ బరి నుంచి తప్పుకున్న సింహం!

2026-11-17 05:39 GMT

డబ్బింగ్ సినిమాల జోరు.. తెలుగు చిన్న సినిమాలకు థియేటర్లలో కష్టాలు!

2026-11-17 04:00 GMT

తండ్రీకొడుకుల బాక్స్ ఆఫీస్ క్లాష్!

2026-11-16 22:30 GMT

ఈ వారం బాక్సాఫీస్ క్లాష్.. పరిస్థితి ఎలా ఉంది?

2026-11-16 10:25 GMT

నైజాం.. జాగ్రత్త పడకపోతే అంతే!

2026-11-16 04:30 GMT

రామాయ‌ణ‌: 10రోజుల్లో 1200 కోట్లు.. 2000 కోట్ల క్ల‌బ్ ఇంకెంత దూరం?

2026-11-15 09:42 GMT

కంటెంట్ యుద్ధం.. ఎవరిదో విజయం?

2026-11-15 00:30 GMT

తెలుగు రైట్స్‌లో టాప్ సినిమాలు.. 'వారణాసి' ఎంత తేవాలి?

2026-11-14 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS