• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్ గ్లోబ‌ల్...

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

| ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’లో భాగంగా జరిగిన ‘ఇండియా జాయ్’ వేదికపై సురేష్ బాబు, దిల్ రాజు, సి.కళ్యాణ్ తదితరులు సినీ పరిశ్రమ అంతర్జాతీయ విస్తరణపై చర్చించారు. సినిమా, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, ఏఐ రంగాల్లో పెట్టుబడులు పెంచి హైదరాబాద్‌ను గ్లోబల్ క్రియేటివ్ హబ్‌గా తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు.

By - Sivaji Kontham
Update: 2026-11-19 08:18 GMT

`ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026` వేదిక‌పై సినీప్ర‌ముఖుల సంద‌డి చ‌ర్చ‌గా మారింది. ఇక్క‌డ `ఇండియా జాయ్` వేదికగా తెలుగు సినీ పరిశ్రమ, క్రియేటివ్ రంగాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా కీలక చర్చ జరిగింది. ఒకప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్‌కు సినీ పరిశ్రమ ప్రయాణం మొదలైన తీరును.. గత దశాబ్దకాలంలో మౌలిక సదుపాయాల పరంగా నగరం సాధించిన పురోగతిని ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్థానికంగా తెలుగు సినీపరిశ్రమ పెట్టుబడులకు తోడు అంతర్జాతీయ పెట్టుబడులు.. విదేశీ ప్రొడక్షన్ సంస్థ‌లు హైదరాబాద్ వైపు వచ్చేలా చేయాలంటే ప్రభుత్వం నిలకడగా కృషి చేయాలని.. ఏటా క్రమబద్ధమైన వృద్ధి సాధించాలని అభిప్రాయపడ్డారు.

గతంలో జరిగిన ఎడిషన్లలో యానిమేషన్ వంటి అంశాలకే పరిమితమైన `ఇండియా జాయ్`ను ఈసారి మరింత విస్తృతంగా.. క్రియేటివ్ ఎకానమీ లేదా ఆరెంజ్ ఎకానమీ మొత్తం పరిధిలోకి తీసుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. సినిమా- యానిమేషన్- పోస్ట్ ప్రొడక్షన్- వీఎఫ్ఎక్స్- AI ఫిల్మ్ మేకింగ్-ఏవీజీసీ రంగాలు కలిసి పనిచేస్తే ఆర్థికాభివృద్ధికి బలమైన చోదకాలుగా మారతాయని వివరించారు. రానున్న‌ దశాబ్దాల్లో తెలంగాణ ఆర్థిక లక్ష్యాలకు ఈ సృజనాత్మక రంగాలు కీలకంగా నిలుస్తాయన్న ధీమా ఈ వేదికపై వ్యక్తమైంది. ప‌రిశ్ర‌మ అగ్ర నిర్మాత డి.సురేష్ బాబు, సి.క‌ళ్యాణ్‌, దిల్ రాజు వంటి ప్ర‌ముఖులు వేదిక‌పై సినీప‌రిశ్ర‌మ గ్లోబ‌ల్ రీచ్ గురించి ప్ర‌స్థావించ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ‌న్ కి త‌గ్గ‌ట్టు తామంతా స‌హ‌క‌రిస్తామ‌ని పేర్కొన్నారు.

సినిమాను కేవలం వినోద సాధనంగా కాకుండా ఒక కీలకమైన పరిశ్రమగా గుర్తించి.. ఈ రంగంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ.. సంస్కృతిని తీర్చిదిద్దడంలోనూ సినిమా పాత్రను గౌరవించడం సంతోషకరమని సినీపెద్ద‌లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సినీ వర్గాల నుంచి పూర్తి సహకారం అందిస్తామని.. సోషల్ మీడియాతో పాటు తమ నెట్‌వర్క్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తామని పెద్ద‌లు హామీ ఇచ్చారు.

మారుతున్న సాంకేతికతపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. సినిమాలు, వినోదంతో పాటు మనకంటూ సొంత AI టూల్స్ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని.. హైదరాబాద్ వేదికగా కూడా కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలు రావాలని సూచించారు. మంచి వాతావరణం.. మౌలిక సదుపాయాలు.. ఎకోసిస్టమ్ ఇప్పటికే ఉన్నందున.. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే కొత్త అవకాశాలు తలుపు తడతాయని అభిప్రాయపడ్డారు.

మొత్తానికి ``ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026-ఇండియా జాయ్`` వేదిక ద్వారా ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య సమన్వయం మరింత బలపడుతోంది. గతంలో హైదరాబాద్ వేదికగా జరిగిన స‌మావేశాల‌ను మించి ఈసారి వినోద రంగం గురించి ఎక్కువ చ‌ర్చ జ‌రుగుతోంది. కొత్త తరం ప్రతిభకు వేదిక కల్పించడం ద్వారా ఈ రంగాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనే ఆకాంక్ష ఈ చర్చలో స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా తెలుగు సినిమా అభివృద్ధికి గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించాల‌నే ఆలోచన ప్ర‌య‌త్నం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. అదే స‌మ‌యంలో అమ‌రావ‌తి- వైజాగ్ వంటి చోట్ల‌ మ‌రో కొత్త సినీప‌రిశ్ర‌మ కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కృషి జ‌ర‌గాల్సి ఉంద‌నే అభిప్రాయాలు సోష‌ల్ మీడియాలో నెటిజ‌నులు వ్య‌క్తం చేస్తున్నారు.

Tags:    
  • telanganaglobalsummit2026 
  • indiajoy 
  • tollywood 
  • hyderabad 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS