టైగర్ అంటే కాంతకు ఇష్టమేనా?
| ‘జైలర్ 2’లో రజనీకాంత్, విద్యాబాలన్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టైగర్ ముత్తువేల్ పాండియన్‌పై కాంత చూపించే ప్రత్యేకమైన ఆసక్తి, ఆమె హావభావాలు పలు సందేహాలకు తావిచ్చాయి. వ్యాపార శత్రుత్వం కారణంగా మనసులోని భావాలను బయటపెట్టలేకపోయిన కాంత కథకు ‘జైలర్ 3’లో ఎలాంటి మలుపు వస్తుందో చూడాలి.
భారీ అంచనాల మధ్య విడుదలై `జైలర్ 2` బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా 800 కోట్ల మార్క్ ను దాటేసింది. ఇక 1000 కోట్ల క్లబ్ లో చేరడమే ఆలస్యం. మరి ఆ ఫీట్ సాధిస్తుందా? లేదా? అన్నది చూడాలి. ఆ సంగతి పక్కన బెడితే? సినిమాలో టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ మాస్ యాక్టింగ్ ఒకెత్తైతే.. పవర్ ఫుల్ పాత్రలో అదరగొట్టిన కాంత పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ అభినయం సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇద్దరు దిగ్గజ నటుల మధ్య నడిచే సీన్లు స్క్రీన్ పై ప్రత్యేకమైన మ్యాజిక్‌ను క్రియేట్ చేసాయి.
సినిమా ప్రయాణంలో భాగంగా టైగర్ ముత్తువేల్ పాండియన్ అడగ్గానే కాంత ఎలాంటి తర్జనభర్జన పడకుండా ఫోన్ నెంబర్ ఇచ్చేయడం థియేటర్లలో ఆడియన్స్‌కు మంచి కిక్ ఇచ్చింది. సాధారణంగా ఎవరికైనా నెంబర్ ఇవ్వడానికి వెనుకాడే పాత్ర అది. కానీ టైగర్ అడగగానే ఓ రకమైన కోర చూపుతో నెంబర్ షేర్ చేయడం.. పక్కనే సోదరుడు సూర్య ఉన్నా? ఏమాత్రం పట్టించుకోకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. తెరపై వారి మధ్య సాగే చూపులు బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకుల్లో చాలా సందేహాలకు తావిచ్చింది.
అసలు మ్యాటర్ అక్కడే మొదలవుతుంది. టైగర్ పంపిన మెసేజ్‌లకు కాంత వెంటనే రిప్లై ఇవ్వకపోవడం.. ఆ తర్వాత ఎదురుపడినప్పుడు కొంటెగా విభిన్నంగా చూసే హావభావాలు అభిమానులను అలరించాయి. సీరియస్ బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా? టైగర్ ముందు మాత్రం ఆమెలో అల్లరి అమ్మాయి బయటపడుతుంటుంది. పైకి గంభీరంగా.. అహంకారంగా ప్రవర్తించే కాంత.. మనసులో మాత్రం టైగర్ పట్ల ప్రత్యేకమైన ఆకర్షణను పెంచుకున్నట్లు సన్నివేశాల్లో కనిపిస్తుంది.
అయితే కాంత మనసులో నిజంగా ఇష్టం ఉన్నా? ఆమె బయట పడలేకపోవడానికి అసలు కారణం వారి మధ్య ఉన్న వ్యాపార శత్రుత్వం. ఇద్దరూ వేర్వేరు రాజ్యాలకు అధిపతులుగా ఉండటం.. పైగా శత్రువులు ఎదురుపడే వ్యాపార రంగంలో ఉండటం వల్ల కాంత భావాలను బాహాటంగా వ్యక్తం చేయలేకపోయింది. టైగర్ సూపర్ గా ఉన్నావ్ అని పొగిడినా? ఏదో చెప్పాలని ఉన్నా? కాంత మాట పెదవి దాటలేదు. అందుకు కల్పక్ ఫ్యామిలీ నేపథ్యం.
పక్కనే సోదరుడు ఉన్నాడు? అనే భయం కావొచ్చు. ఆ రకంగా టైగర్-కాంత పాత్రల మధ్య ఎమోషన్ అద్బుతంగా పండింది. క్లైమాక్స్ లో ప్రధాన పాత్రలన్నీ చనిపోయినా? కాంత పాత్ర సజీవంగానే ఉంటుంది. బ్లాస్ట్ అనంతరం గాయాలతో కనిపిస్తుంది. మరి తండ్రిని చంపిన కారణంగా కాంత టైగర్ పై కక్ష గడుతుందా? టైగర్ పై ఇష్టంతో ఆ కక్షనే ప్రేమగా మలుచుకుంటుందా? లేక ఇదంతా వారిద్దరు ఆడుతోన్న మైండ్ గేమా? అన్నది `జైలర్ 3` లో చూస్తాం.