అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!
| చిన్నప్పుడు ఒంటె, మొసలి, సముద్రపు గుర్రం మాంసం కూడా తిన్నానని శ్రుతిహాసన్ ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన తండ్రి కమల్ హాసన్ ఇంట్లో ఎప్పుడూ విభిన్నమైన వంటకాలు చేయించేవారని, చిన్న ఆక్టోపస్ వంటకాలంటే తనకు ఇష్టమని తెలిపింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆయన వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఇప్పుడు తన సొంత టాలెంట్ తో ఎదిగి, పాన్ ఇండియా హీరోయిన్గా దూసుకుపోతోంది శృతిహాసన్. అలాంటి ఈమె ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు తన పాటలతో ప్రేక్షకులను అలరిస్తోంది.. మంచి గాత్రం కలిగిన శృతిహాసన్ తన గొంతుకతో ఎన్నో పాటలకు ప్రాణం పోసింది కూడా.. అలాంటి ఈమె తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా సాత్విక వీరవల్లి తొలి పరిచయంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆకాశంలో ఒక తార. ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. నవంబర్ 20వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ నేపథ్యంలో శృతిహాసన్ గత ఇంటర్వ్యూలలో పాల్గొన్న విషయాలు ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ మాట్లాడుతూ... తాను అన్ని రకాల మాంసాహారాలు తింటాను అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. శృతిహాసన్ మాట్లాడుతూ.." నేను చిన్నప్పుడే ఒంటె, మొసలి, సముద్రపు గుర్రం వంటి అన్ని రకాల మాంసాహారాలు తిన్నాను. నాకు చిన్న చిన్న ఆక్టోపస్ లు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మా ఇంట్లో మా నాన్నగారు ఎప్పుడూ కూడా అసాధారణమైన , విలక్షణమైన వంటకాలనే మాకు రుచి చూపించేవారు. ముఖ్యంగా చిన్నచిన్న కీటకాలతో అద్భుతమైన వంటలు వండేవారు.
ఒకరోజు నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఫ్రిడ్జ్ తెరవగా . అక్కడ సముద్రపు గుర్రంతో తయారుచేసిన డిష్ ను పెట్టారు. అయితే అదేంటని అడగగా సముద్రపు గుర్రం మాంసం అని చెప్పారు. నిజంగా నాకు అప్పటి వరకు కూడా సముద్రపు గుర్రాలు ఉంటాయని నిజంగా నాకు తెలియదు అంటూ శృతిహాసన్ తెలిపింది. మొత్తానికైతే తాను అన్ని రకాల జంతువుల మాంసాహారాలను తిన్నాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది శృతిహాసన్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
శృతిహాసన్ కెరియర్ విషయానికి వస్తే.. సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం అనే చిత్రంలో నటిస్తోంది. 2027 నవంబర్ 12న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే సలార్ సినిమా వచ్చి మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. అలాగే విజయ్ సేతుపతి హీరోగా మైస్కిన్ దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ట్రైన్ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్టులు ఈమె చేతిలో ఉన్నాయి.