• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ నిర్ణయమే మృణాల్...

ఆ నిర్ణయమే మృణాల్ కెరియర్ను నిలబెట్టిందా?

| ‘సీతారామం’లో అఫ్రిన్ పాత్ర కోసం తొలుత మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించగా, దర్శకుడు హను రాఘవపూడి ఆమెకు సీత పాత్రను సూచించారు. ఆ నిర్ణయంతో మెయిన్ హీరోయిన్‌గా నటించిన మృణాల్‌కు పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. ఈ సినిమా సీక్వెల్ అవసరం లేదని, దాని ముగింపు అద్భుతంగా ఉందని ఆమె అభిప్రాయపడింది.

By - Madhu Reddy
Update: 2026-11-19 03:10 GMT

మృణాల్ ఠాకూర్.. మహారాష్ట్ర ధులే ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ.. తొలిసారి 2012లో ముజ్సే కుచ్ కెహెతి.. ఏ ఖామోషియాన్ అనే హిందీ సీరియల్ ద్వారా నటన రంగంలోకి అడుగు పెట్టింది. 2014లో వచ్చిన విట్టిదండు అనే మరాఠి సినిమాతో వెండితెరపై తళుక్కుమని మెరిసిన ఈమె.. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది మాత్రం తెలుగు సినిమా తోనే.. హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగులో చేసిన తొలి చిత్రం సీతారామం. ఈ సినిమాలో హీరోయిన్ గా సీతా మహాలక్ష్మి పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ చిన్నది.

అయితే ఈ సినిమా కోసం ఆమె తీసుకున్న నిర్ణయమే ఆమె కెరియర్ను నిలబెట్టింది అంటూ గతంలో ఈమె చేసిన కామెంట్లు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. విషయంలోకి వెళ్తే.. ఈ సినిమా మెయిన్ హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్, మరో హీరోయిన్గా రష్మిక మందన్న నటించి ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో సీతామహాలక్ష్మి పాత్ర కోసం మొదట మృణాల్ ను సంప్రదించలేదట.

ఇదే విషయంపై ఆమె ప్రస్తావిస్తూ.. సీతారామం సినిమాలో రష్మిక పోషించిన అఫ్రిన్ పాత్ర కోసం నన్ను సంప్రదించారు.

డైరెక్టర్ నాకు కథ చెబుతున్న సమయంలో అఫ్రిన్ పాత్ర గురించి చెప్పారు. కానీ కథ చెబుతున్న సమయంలోనే ఆయన తన మనసు మార్చుకొని సీత పాత్ర చేయాలని కోరాడు. ఆ పాత్ర కంటే సీత పాత్రకు నేను సరిగ్గా సరిపోతానని ఆయన చెప్పాడు. అలా నా వద్దకు సీతామహాలక్ష్మి పాత్ర వచ్చింది. ఇక నేను కూడా డైరెక్టర్ చెప్పినట్టే మెయిన్ పాత్రను అంగీకరించి నా కెరియర్ను మార్చుకున్నాను. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కావాలని అభిమానులు కోరుతున్నారు. కానీ అద్భుతమైన ఎండింగ్ సినిమాకు లభించింది. కాబట్టి ఈ సినిమాకు సీక్వెల్ అవసరం లేదు అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది.

మొత్తానికైతే సైడ్ క్యారెక్టర్ అనుకోకుండా మెయిన్ క్యారెక్టర్ లభించింది. ఈ ఒక్క పాత్రతో అందరి చేత ప్రశంసలు అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో మళ్లీ వరుస అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ మూవీ రాకాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడలేదు.

Tags:    
  • mrunalthakur 
  • sitaramam 
  • rashmikamandanna 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS