• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కళ్ళుచెదిరే అందాలతో...

కళ్ళుచెదిరే అందాలతో కియారా.. క్యూట్ లుక్ తో ఆకట్టుకుంటున్న కూతురు!

| కియారా అద్వానీ నవంబర్ 2026 ఎస్క్వైర్ ఇండియా డిజిటల్ కవర్ కోసం చేసిన ఫోటోషూట్‌తో ఆకట్టుకుంది. ప్రింటెడ్ బ్రాలెట్, హైస్లిట్ మ్యాక్సీ స్కర్ట్, ఆరెంజ్ జాకెట్‌లో మెరిసింది. అనైతా ష్రాఫ్ అడజానియా స్టైలింగ్ చేయగా, వైష్ణవ్ ప్రవీణ్ ఫొటోలు తీశారు. తాజాగా జైపూర్ ఎయిర్‌పోర్టులో భర్త సిద్ధార్థ్, కుమార్తెతో కనిపించడం కూడా చర్చనీయాంశమైంది.

By - Madhu Reddy
Update: 2026-11-19 05:32 GMT

గ్లామర్ బ్యూటీగా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కియారా అద్వానీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈమె.. తొలిసారి తెలుగులో 'భరత్ అనే నేను' చిత్రంతో వెండితెరకు పరిచయమైంది.మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. పైగా ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన 'వినయ విధేయ రామ' సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటించింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. అయినా సరే మళ్లీ రాంచరణ్ హీరోగా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గేమ్ చేంజర్' సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

 

దీంతో టాలీవుడ్ లో మరో అవకాశం లభించలేదు. కానీ కన్నడ ఇండస్ట్రీలో యశ్ హీరోగా నటించిన టాక్సిక్ సినిమాలో హీరోయిన్గా నటించింది. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలవడం గమనార్హం . ముఖ్యంగా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఈమె కెరీర్ కు ఏ ఒక్క సినిమా కూడా తోడ్పడలేదు అనే కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈయన.. మరొకవైపు మ్యాగజైన్ కవర్ పేజీలపై దర్శనమిస్తూ అభిమానులను అలరిస్తోంది . ఈ క్రమంలోనే తాజాగా 2026 నవంబర్లో విడుదలైన ఎస్క్వైర్ ఇండియా మ్యాగజైన్ డిజిటల్ కవర్ స్టోరీ కోసం చేసిన ప్రత్యేక ఫోటోషూట్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.

 

ఆ ఫోటోలను తాజాగా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంది..ఇకపోతే తాజాగా ఈమె ధరించిన ఔట్ ఫిట్ విషయానికి వస్తే.. ప్రింటెడ్ బ్రాలెట్ టాప్ ధరించిన ఈమె.. దీనికి కాంబినేషన్లో హై స్లిట్ మ్యాక్సీ స్కర్ట్ తో పాటు ఆరెంజ్ కలర్ జాకెట్ ధరించి తన అవుట్ ఫిట్ ను పర్ఫెక్ట్ చేసుకుంది. ముఖ్యంగా ఈమె ధరించిన మ్యాక్సీ స్కర్ట్ పై అందమైన ఇల్లు, పచ్చని ప్రకృతిని తలపించేలా డిజైన్ చేసిన అవుట్ ఫిట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ డ్రెస్సును ప్రముఖ స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అడజానీయా స్టైలింగ్ చెయ్యగా.. వైష్ణవ్ ప్రవీణ్ ఫోటోలు తీశారు. మొత్తానికి అయితే ఈ అవుట్ ఫిట్ లో కళ్ళు చెదిరే అందంతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది ఈ ముద్దుగుమ్మ.

 

ఇదిలా ఉండగా జైపూర్ విమానాశ్రయంలో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా జంట కెమెరాలకు చిక్కారు. ఈ సందర్భంగా వారి కుమార్తె సారాయా ముఖం కొద్దిగా ఇంటర్నెట్లో దర్శనమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ జంట సాధారణ దుస్తులలో విమానాశ్రయం లోపలికి వెళ్తూ కనిపించగా.. సిద్ధార్థ్ తన కుమార్తెను పట్టుకొని ఉన్నారు. కియారా మాత్రం సారాయా ముఖం కెమెరా కంట పడకుండాకప్పే ప్రయత్నం చేసింది. కానీ ఒక్క క్షణం పాటు వారి పాప ఫోటో ఒకటి కెమెరాలో రికార్డు అవ్వడంతో ఇప్పుడు ఆ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయి తెగ చక్కెరలు కొడుతోంది.

Tags:    
  • kiaraadvani 
  • esquireindia 
  • kiarafashion 
  • sidharthmalhotra 

Similar News

ప్రిన్స్ విలియం ముందు సైఫ్ అలీఖాన్ బోల్డ్ కామెంట్స్!

2026-11-19 05:36 GMT

'ధురంధర్ 2' డే 14 కలెక్షన్లను దాటేసిన రామాయణం!

2026-11-19 05:08 GMT

ట్రెండింగ్: స‌మంత త‌ర్వాత జెన్-Z లేడీ బాస్?

2026-11-19 05:01 GMT

8 కిలోల గజ్జెలతో శ్రద్ధా కపూర్ సాహ‌సం.. లావణి నృత్యం అంత క‌ష్ట‌మా?

2026-11-19 05:01 GMT

ఖ‌రీదైన ప‌చ్చ‌ల హారంతో మ‌హారాణినే త‌ల‌పించింది!

2026-11-19 05:01 GMT

టైసన్ నాయుడు టీజర్.. ఓల్డ్ సిటీలో ఇన్వెస్టిగేషన్ ట్విస్ట్

2026-11-19 04:56 GMT

'ఆకాశంలో ఒక తార' USA థియేటర్స్ లిస్ట్

2026-11-19 04:05 GMT

ఓటీటీలో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ'.. అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన!

2026-11-19 03:47 GMT

'ఈఎన్ఈ రిపీట్' మూవీ రివ్యూ

2026-11-19 03:30 GMT

మన సంస్కృతిని వాళ్ల దగ్గర తక్కువ చేసి మాట్లాడను.. రాధికా ఆప్టే వ్యాఖ్యలపై కీర్తి సురేష్ స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-19 03:13 GMT

కొత్త 'జేమ్స్ బాండ్- 007' ఎంపికలో బెజోస్ ఫింగ‌రింగ్ దేనికి?

2026-11-19 03:12 GMT

Copyright @2026

Powered by Blink CMS