• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హృతిక్ ముందు డ్యాన్స్...

హృతిక్ ముందు డ్యాన్స్ ముచ్చట్లు బయటపెట్టిన అనన్య!

| హృతిక్ రోషన్ తన చిన్ననాటి క్రష్ అని చెప్పిన అనన్య పాండే, అప్పట్లో ఆయన్ను అంకుల్ అని పిలుస్తూ ‘ధూమ్ మచాలే’, ‘క్రేజీ కియా రే’ పాటలకు డ్యాన్స్ చేసి చూపించేదానని గుర్తుచేసుకుంది. ప్రస్తుతం అనన్య కెరీర్ నెమ్మదించగా, తెలుగులోనూ కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

By - Srikanth Kontham
Update: 2026-11-19 07:53 GMT

బాలీవుడ్ ఇండస్ట్రీలో పెరిగిన స్టార్ కిడ్స్‌కు పెద్ద స్టార్లతో ఉండే జ్ఞాపకాలు ఎప్పుడూ ఒకలా ఉండవు. కొందరికి వాళ్లు పెద్ద హీరోల్లా కనిపిస్తే.. చిన్నతనంలో మాత్రం చాలామందిని అంకుల్ అనే పిలుస్తుంటారు. ఇప్పుడీ విషయంలోనే అనన్య పాండే చెప్పిన చిన్ననాటి ముచ్చట సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తనకు ఫస్ట్ క్రష్ అని చెబుతూనే చిన్నప్పుడు ఆయన్ని అంకుల్ అని పిలిచిన రోజులను.. ఆయన ముందే డ్యాన్స్ చేసిన తీరును గుర్తు చేసుకుంది అనన్య. చిన్నప్పుడు హృతిక్ రోషన్ అంటే అనన్యకు ఎన‌లేని ఇష్టం ఉండేదట.

ఆ అభిమానం ఎంతలా ఉండేదంటే? పలికిన తొలి మాటల్లో హృతిక్ పేరు కూడా ఉండేదని చెప్పుకొచ్చింది. అలా ఫస్ట్ లవ్‌గా భావించే హృతిక్ ముందు కూర్చోబెట్టుకుని మరీ `ధూమ్ మచాలే` పాటకు స్టెప్పులేసిన రోజులను తలుచుకుంది. అప్పటికింకా తనకు పెద్దగా విషయాలు తెలియకపోవడంతో అంతటి స్టార్ హీరోను కూడా అంకుల్ అంటూ సంబోధించేదానని అనన్య న‌వ్వేసింది. అంతటితో ఆగకుండా డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌ను హృతిక్‌తో బలవంతంగా చూపించిన సరదా సంఘటన పంచుకుంది.

`ధూమ్ మచాలే`తో పాటు `క్రేజీ కియా రే` వంటి పాటలకు ఎనర్జీతో డ్యాన్స్ చేస్తూ హృతిక్ ను కూర్చోబెట్టి మరీ చూపించేదట. చిన్నారిగా ఉన్నప్పుడు చేసిన అల్లరి చేష్టలు ఇప్పుడు గుర్తు చేసుకుంటే తనకే విచిత్రంగా అనిపిస్తున్నాయంది. సినీ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లకు ఇండస్ట్రీలోని స్టార్స్ అందరూ కుటుంబ సభ్యుల్లా.. తెలిసిన వాళ్లలా కనిపిస్తారు. తెరపై భారీ యాక్షన్.. అదిరిపోయే డ్యాన్స్‌లతో అదరగొట్టే హృతిక్ రోషన్‌ను చిన్నప్పుడు దగ్గరగా చూసినప్పుడు కలిగే ఆ ఉత్సాహం వేరేలా ఉంటుంది. చిన్న వయసులో చేసిన చిలిపి పనులు కెరీర్‌లో బిజీగా ఉన్న తర్వాత తలుచుకుంటే తియ్యటి జ్ఞాపకంగా మిగిలిపోతాయి.

ఇక అన‌న్యా పాండే సినిమాల విష‌యానికి వ‌స్తే ఈ ఏడాది `చాంద్ మేరీ దిల్` చిత్రంలో న‌టించింది. ఏడాది మొత్తం న‌టించింది ఆఒక్క సినిమాలోనే. కొత్త అవ‌కాశాలేవి రాలేదు. గ‌త ఏడాది రెండు సినిమాల్లో న‌టించినా అవి పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు. దీంతో అన‌న్య కెరీర్ బాగా స్లో అయిన‌ట్లే క‌నిపిస్తుంది. టాలీవుడ్ లో కూడా అవ‌కాశాలు రావ‌డం లేదు. `లైగ‌ర్` తో ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు సినిమాల వైపు చూడ‌ని సంగ‌తి తెలి సిందే. ప్ర‌స్తుతం మ‌ళ్లీ అక్క‌డ కంబ్యాక్ అవ్వాల‌ని చూసినా? ఉన్న పోటీలో మ‌రో ఛాన్స్ అందుకోవ‌డం చిన్న విష‌యం కాదు.

Tags:    
  • ananyapanday 
  • hrithikroshan 
  • dhoommachale 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS