రాధిక ఆప్టే వివాదంలో చిక్కుకున్న కీర్తి సురేష్.. ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్!
| రాధిక ఆప్టే సౌత్ సంప్రదాయాలపై చేసిన వ్యాఖ్యల వివాదంపై కీర్తి సురేష్ స్పందించారు. మామతో ప్రేమాయణం అన్నప్పుడు తనకు అర్థం కాలేదని, అది కొన్ని ప్రాంతాలకే పరిమితమైన సంప్రదాయమని వివరించే ప్రయత్నం చేశానని తెలిపారు. అయితే రాధిక వ్యాఖ్యలను అప్పుడే ఎందుకు ఖండించలేదంటూ కీర్తిపై విమర్శలు కొనసాగుతున్నాయి.
రాధిక ఆప్టే.. బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ ఈమె కెరీర్ కు పునాది వేసింది మాత్రం సౌత్ సినిమా ఇండస్ట్రీ అనే చెప్పాలి. ముఖ్యంగా టాలీవుడ్ లో రక్త చరిత్ర 1,2, లెజెండ్ , లయన్ వంటి చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె.. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈమె ప్రముఖ సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తో కలిసి అక్కా అనే నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో నెగిటివ్ షేడ్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగానే సౌత్ సినీ ఇండస్ట్రీ పై విమర్శలు గుప్పిస్తూ.. తెలుగు సాంప్రదాయాలను తక్కువ చేసి మాట్లాడింది. తనకంటే వయసున్న వారితో నటించానని, పైగా మామను పెళ్లి చేసుకోవడం ఏంటి? అంటూ ఇలా సాంప్రదాయాలను కించపరిచింది. దీంతో ఈమెపై వ్యతిరేకత నెలకొంది. ముఖ్యంగా ఎంతో మంది బాలీవుడ్ తారలు కూడా రాధిక ఆప్టేపై విరుచుకుపడ్డారు.
ఇదే ప్రమోషన్స్ లో రాధిక ఆప్టే తో పాటు కీర్తి సురేష్ కూడా పాల్గొనింది. అయితే రాధిక ఆప్టే సౌత్ సినీ ఇండస్ట్రీపై అంతలా నిందలు వేస్తుంటే.. పక్కనే ఉన్న కీర్తి సురేష్ ఎందుకు వీటిని ఖండించే ప్రయత్నం చేయలేదు? అనే కామెంట్లు అప్పుడే వ్యక్తం అయ్యాయి.ఎంతో మంది నెటిజన్స్ సినీ ప్రియులు కూడా కీర్తి సురేష్ పై మండిపడ్డారు. సొంత గడ్డను అంతలేసి మాటలు అంటుంటే.. ఎందుకు స్పందించలేదు అంటూ ప్రశ్నించారు. అయితే ఈ విషయాలు ఆమె వరకు చేరలేదేమో తెలియదు కానీ కీర్తి సురేష్ దీనిపై స్పందించలేదు.. కానీ ఇటీవల కీర్తి సురేష్ మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొనగా ఒక జర్నలిస్టు రాధిక ఆప్టే వివాదంపై స్పందించారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన చర్చ ప్రకారమే.. ఆ జర్నలిస్ట్ స్పందిస్తూ.. ఈ సంఘటన గురించి మీరు ఎందుకు వెంటనే ప్రశ్నించలేదు? అంటూ నిలదీశారు. దీనికి ఆమె మాట్లాడుతూ.. "మామతో ప్రేమాయణం అన్నప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత అది కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉంటుందని వివరించే ప్రయత్నం చేశాను. నిజానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రాంతాలలో మాత్రమే ఆ పాటించే సంస్కృతి ఉంది అని నాకు తెలుసు . కానీ కేరళలో అలా లేదు. కర్ణాటక గురించి నాకు తెలియదు. ముఖ్యంగా రాధిక ఆప్టే కి సాంస్కృతిక భేదాలను వివరించడమే నా ఉద్దేశం ఉత్తర భారతదేశానికి చెందిన వారికి వివరిస్తున్నప్పుడు నా సొంత సంస్కృతిని ఎన్నడూ కూడా నేను అగౌరవ పరచలేదు అంటూ ఆమె స్పష్టం చేశారు.
మొత్తానికైతే కీర్తి సురేష్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారినా.. సౌత్ సినీ ఇండస్ట్రీ పై విమర్శలు గుప్పిస్తున్నప్పుడు వెంటనే ప్రశ్నించాలని నీకు తెలియదా అంటూ కూడా మండిపడుతున్నారు. ఏది ఏమైనా రాధిక ఆప్టే వివాదం కారణంగా ఇప్పుడు కీర్తి సురేష్ కూడా విమర్శలు ఎదుర్కొంటుందని తెలుస్తోంది.