• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మాయ లేడీ సెన్సార్.....

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

| రాకేష్ వర్రే హీరోగా నటించిన ‘మాయ లేడీ’ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ విషయాన్ని రజినీకాంత్ స్టైల్ ఎంట్రీ, ‘శివాజీ’ సినిమాలోని ఫేమస్ డైలాగ్‌తో ఫన్నీగా ప్రకటించారు. ఈ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నవంబర్ 13న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

By - M Prashanth
Update: 2026-11-11 01:42 GMT

సినిమా ప్రమోషన్స్ అంటే ఏదో రొటీన్ ప్రెస్ మీట్లు, క్యాజువల్ పోస్టర్లు వదిలే రోజులు ఎప్పుడో పోయాయి. ఆడియన్స్‌ను థియేటర్ వైపు తిప్పుకోవాలంటే కాస్త క్రేజీగా ఆలోచించాల్సిందే. సరిగ్గా ఇదే రూట్ ఎంచుకున్నాడు 'మాయ లేడీ' హీరో రాకేష్ వర్రే. తన సినిమా సెన్సార్ పూర్తయిన విషయాన్ని ఎవరూ ఊహించని రీతిలో, క్రేజీ కామెడీ టచ్‌తో అనౌన్స్ చేసి సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు.

ఆఫీస్‌లో టీమ్ మొత్తం కూర్చుని సెన్సార్ సర్టిఫికెట్ కోసం వెయిట్ చేస్తుంటే, మనోడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ప్లాన్ చేశాడు. బ్లాక్ గాగుల్స్, చేతిలో గొడుగు పట్టుకుని కూలీ సినిమాలో రజినీకాంత్ రేంజ్ స్వాగ్‌తో రూమ్‌లోకి నడుచుకుంటూ వచ్చాడు. ఇంతలో టీమ్ నుంచి ఫోన్ చేసి మీటింగ్ టైమ్‌కి రాకుండా ఏంటిరా ఈ ఓవరాక్షన్ అని అడిగితే, శివాజీ సినిమాలోని 'పందులే గుంపుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది' అంటూ ఆల్ టైమ్ ఫేమస్ డైలాగ్‌తో రిప్లై ఇవ్వడం హిలేరియస్‌గా సాగింది.

తీరా అంత బిల్డప్ ఇచ్చి టేబుల్ మీద పెట్టింది చూస్తే సెన్సార్ పోస్టర్. 'మాయ లేడీ' చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చిందని ఇలా వెరైటీగా రివీల్ చేశారు. చిన్న వీడియోనే అయినా ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో సోషల్ మీడియాలో ఈ క్లిప్ వైరల్ అవుతోంది. కంటెంట్‌తో పాటు ప్రమోషన్లలో కూడా కొత్తదనం చూపిస్తే యూత్ వెంటనే కనెక్ట్ అవుతారు.

నిజానికి క్రేజీ యాంట్స్ బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే ఇలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రమోషన్స్ కామన్. గతంలో 'ఎవరికీ చెప్పొద్దు' సినిమాకి కూడా రాకేష్ ఇలానే డిఫరెంట్ ఐడియాలతో ప్రమోట్ చేసి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు 'మాయ లేడీ' విషయంలోనూ అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ట్రైలర్‌లో ట్విన్స్ కన్ఫ్యూజన్ లవ్ స్టోరీతో పాటు సత్య కామెడీ హైలైట్ కాగా, ఇప్పుడు ఈ సెన్సార్ వీడియో కూడా ప్రాజెక్ట్ మీద పాజిటివ్ వైబ్‌ను పెంచేసింది.

రొమాంటిక్ కామెడీ జానర్లకు ఆడియన్స్ ఎప్పుడూ రెడీగానే ఉంటారు. దానికి తోడు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్, మధుమిత సర్కార్ డ్యుయల్ రోల్ వేరియేషన్స్ సినిమాకి మెయిన్ ఎట్రాక్షన్‌గా మారాయి. ఇప్పటికే యూత్ సర్కిల్స్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం నవంబర్ 13న గ్రాండ్‌గా థియేటర్లలోకి వస్తోంది. ప్రమోషన్లలో చూపిస్తున్న ఈ ఫన్ థియేటర్లలో కూడా వర్కవుట్ అయితే బాక్సాఫీస్ దగ్గర 'మాయ లేడీ' గట్టిగానే సౌండ్ చేసే చాన్స్ ఉంటుంది.



#MayaLady సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. #MayaLadyOnNov13th #RakeshVarre #TeluguCinema #Tollywood #Tupaki Follow👉 @tupaki_official https://t.co/uu53eB5kvq

— Tupaki (@tupaki_official) November 10, 2026


Tags:    
  • mayalady 
  • rakeshvarre 
  • mayaladymovie 
  • uacertificate 
  • tollywood 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS