ఎథ్నిక్ ఎలిగెన్స్‌కు నిర్వచనం.. శ్రీలీల లేటెస్ట్ లుక్ ట్రెండ్!
టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్, టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల తాజాగా షేర్ చేసిన బీచ్‌సైడ్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్, టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల తాజాగా షేర్ చేసిన బీచ్‌సైడ్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. "రోజ్ క్వార్జ్ అవర్స్" పేరుతో ఆమె పంచుకున్న ఈ పిక్స్‌లో అచ్చం దేవకన్యలా మెరిసిపోతూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సముద్రపు ఒడ్డున, సూర్యాస్తమయ వేళ సాంప్రదాయ చీరకట్టులో ఆమె ఇచ్చిన రాయల్ పోజులు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కుర్రకారును కట్టిపడేస్తున్న ఈ లేటెస్ట్ ఫోటోషూట్ ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారింది.
రోజ్ క్వార్జ్ పింక్ సారీలో రాయల్ లుక్ :
తాజా ఫోటోషూట్ కోసం శ్రీలీల షిమ్మరింగ్ పీచ్-రోజ్ పింక్ కలర్ ట్రెడిషనల్ ఎన్‌సెంబుల్‌ను ఎంచుకుంది. తేలికపాటి రోజ్ క్వార్జ్ పింక్ జార్జెట్, ఆర్గాంజా చీరపై సిల్వర్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ, అందమైన బార్డర్స్ ఈ డ్రెస్‌కు ప్రత్యేక ఆకర్షణ తెచ్చాయి. ఇక దీనికి తగ్గట్టుగా స్వీట్‌హార్ట్ నెక్‌లైన్ ఉన్న హెవీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరించి, తలపై చీర కొంగును కప్పుకుని ఎంతో పద్ధతిగా, అందంగా కనిపించింది.
ట్రెడిషనల్ జ్యువెలరీ అండ్ మేకప్ డీటైల్స్ :
ఈ ఎథ్నిక్ లుక్‌ను మరింత హైలైట్ చేస్తూ శ్రీలీల నుదుట మాంగ్ తిక్క, చెవులకు సున్నితమైన ఆభరణాలు ధరించింది. బీచీ గోల్డెన్ అవర్ లైటింగ్‌కు తగినట్లుగా సాఫ్ట్ మేకప్ టోన్స్ ఉపయోగించి తన సహజమైన అందాన్ని మరింత మెరిపించింది. ఇక గాలికి ఎగురుతున్న ఆ వస్త్రాలు, ఆమె చిరునవ్వు చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
ఫ్యాన్స్ ఫిదా.. కామెంట్ల వర్షం:
ఈ అద్భుతమైన పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. శ్రీలీల అందాన్ని చూసి మురిసిపోయిన అభిమానులు "బ్యూటిఫుల్ మేమ్", "లుకింగ్ సో ప్రిట్టీ", "గ్రేస్‌ఫుల్లీ స్టన్నింగ్", "సన్‌షైన్ బ్యూటీ" అంటూ కామెంట్ బాక్స్‌ను పొగడ్తలతో నింపేస్తూ లైకులు కురిపిస్తున్నారు.
బాలీవుడ్ ఎంట్రీ నుంచి పాన్-ఇండియా రేంజ్ వరకు:
ఇక బెంగళూరులో పెరిగిన శ్రీలీల, 'పెళ్లి సందడి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై 'ధమాకా', 'భగవంత్ కేసరి', మహేష్ బాబు సరసన 'గుంటూరు కారం' చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 'పుష్ప 2' స్పెషల్ సాంగ్ తో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకుంది.
ఇక అంతేకాక శ్రీలీల ఎన్నో భారీ ప్రాజెక్టులు నటించింది. వాటిలో 'రాబిన్‌హుడ్', 'జూనియర్', 'మాస్ జాతర'తో పాటు తమిళంలో 'పరాశక్తి', తెలుగులో 'ఉస్తాద్ భగత్ సింగ్', అలాగే ఏడాది కార్తీక్ ఆర్యన్ సరసన అనురాగ్ బాసు దర్శకత్వంలో రొమాంటిక్ మ్యూజికల్ చిత్రం తో బాలీవుడ్ లైను ఎంట్రీ ఇచ్చి పాన్-ఇండియా స్థాయిలో దూసుకుపోతోంది. తన అద్భుతమైన నటన, అంతులేని డ్యాన్స్ ట్యాలెంట్, క్లాసీ ఫ్యాషన్ సెన్స్‌తో కుర్రకారును ఏలుతున్న శ్రీలీల, రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలతో అగ్రనాయికగా దూసుకెళ్లాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.