చరణ్.. ఇప్పుడు మెయిన్ టార్గెట్ అదే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! మణికట్టు గాయం నుంచి కోలుకునే ప్రాసెస్ లో భాగంగా ఆయనకు లేటెస్ట్ గా నిర్వహించిన ఫాలో అప్ ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయింది.

Update: 2026-09-24 16:46 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! మణికట్టు గాయం నుంచి కోలుకునే ప్రాసెస్ లో భాగంగా ఆయనకు లేటెస్ట్ గా నిర్వహించిన ఫాలో అప్ ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయింది. దీంతో చరణ్ ఇప్పుడు పూర్తిగా కోలుకునేందుకు రెడీ అయ్యారు. అందుకుగాను కొన్ని వారాల పాటు ఫిజియోథెరపీ పూర్తి చేసిన తర్వాత మళ్లీ సెట్స్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

చరణ్ కుడి మణికట్టుకు పెద్ది సినిమా షూటింగ్ సమయంలో గాయమైన విషయం తెలిసిందే. ఓ యాక్షన్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో గాయపడ్డారు. కానీ సినిమా పనులు, ప్రమోషన్స్‌ ను పూర్తి చేసిన తర్వాతే ఆపరేషన్ చేయించుకోవాలని చరణ్ అప్పట్లో డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత జులైలో కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో ఆయనకు మణికట్టు శస్త్రచికిత్స జరిగింది.

ఇప్పుడు సెప్టెంబర్ 24వ తేదీన చరణ్ మరోసారి అదే ఆసుపత్రికి వెళ్లారు. ముందుగా అనుకున్న ఫాలో అప్ సర్జరీలో భాగంగా వైద్యులు మణికట్టుకు ఉన్న క్యాస్ట్‌ తొలగించారు. ఆపరేషన్ సమయంలో అమర్చిన రాడ్లను కూడా సక్సెస్ ఫుల్ గా తీసేశారు. అది పూర్తవడంతో చరణ్ కోలుకునే ప్రక్రియలో మరో స్టేజ్ ను కంప్లీట్ చేసినట్లైంది. అయితే వెంటనే చరణ్ షూటింగ్‌ లోకి వెళ్లే పరిస్థితి మాత్రం లేదు.

వైద్యుల సజెషన్స్ ప్రకారం, మరో 8 నుంచి 10 వారాల పాటు రామ్ చరణ్ సీరియస్ గా ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది. మణికట్టు పూర్తిగా నార్మల్ స్టేజ్ కు రావడంతో పాటు, షూటింగ్‌లో యాక్షన్ సన్నివేశాలు చేయడానికి అవసరమైన స్ట్రెంత్ తిరిగి పొందడమే ఇప్పుడు మెయిన్ టార్గెట్. అందుకే చరణ్ నవంబర్ మధ్య తర్వాతే ఆయన తిరిగి కెమెరా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇక చరణ్.. పెద్ది తర్వాత సుకుమార్ తో వర్క్ చేయనున్నారు. రంగస్థలం తర్వాత మళ్లీ లెక్కల మాస్టర్ తో కలిసి పనిచేస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ చిత్రాన్ని సంబంధించిన పూజా కార్యక్రమాలను అక్టోబర్ 20వ తేదీన హైదరాబాద్‌ లో నిర్వహించేందుకు మూవీ టీమ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. చరణ్ పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.

నవంబర్ లేదా డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించేలా సుకుమార్ టీమ్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆ మూవీ కోసం చరణ్ తన లుక్‌ ను మార్చుకోనున్నట్లు టాక్ ఉంది. పెద్దిలో కనిపించిన లుక్‌ కు భిన్నంగా సుకుమార్ సినిమా కోసం స్లిమ్‌ గా కనిపించేలా సిద్ధమవుతున్నారని సమాచారం. ఇక ప్రస్తుతం చరణ్‌ కు కావాల్సింది పూర్తిగా కోలుకోవడమే. ఫిజియోథెరపీ పూర్తయ్యాక మళ్లీ షూటింగ్ సెట్స్‌ లోకి అడుగుపెట్టనున్నారు. అంటే నవంబర్ తర్వాత మెగా పవర్ స్టార్ మళ్లీ బిజీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.



Tags:    

Similar News