• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'విశ్వంభర'.. సైలెంట్‌గా...

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

| చిరంజీవి 'విశ్వంభర' సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కమెడియన్ ప్రవీణ్ డబ్బింగ్ స్టూడియో నుంచి ఫొటో షేర్ చేయడంతో ఈ విషయం బయటపడింది. వీఎఫ్ఎక్స్ పనుల వల్ల ఆలస్యమైన ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

By - M Prashanth
Update: 2026-11-11 07:29 GMT

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఆ తర్వాత పలుమార్లు వాయిదా పడింది. మధ్యలో చిరంజీవి మరో సినిమా పూర్తి చేసి విడుదల చేసినా 'విశ్వంభర' మాత్రం థియేటర్లకు రాలేదు. దీంతో అసలు సినిమా పనులు ఎంతవరకు వచ్చాయనే సందేహాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఓ నటుడు పెట్టిన ఫొటో ద్వారా కొంత క్లారిటీ వస్తోంది.

కమెడియన్ ప్రవీణ్ లేటెస్ట్ గా డబ్బింగ్ స్టూడియో నుంచి ఓ ఫొటో షేర్ చేశారు. వెనుక స్క్రీన్‌పై 'విశ్వంభర' టైటిల్ కనిపిస్తుండగా, 'డబ్బింగ్ టైమ్' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పెద్దగా అప్డేట్స్ ఇవ్వకుండానే డబ్బింగ్ పనులు కొనసాగుతున్నాయని అర్థమవుతుంది. నిజానికి 'విశ్వంభర' ఆలస్యానికి ప్రధాన కారణం వీఎఫ్ఎక్స్.

మొదటి టీజర్ విడుదలైనప్పుడు గ్రాఫిక్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆ విజువల్స్‌ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు చిత్రబృందం సమయం తీసుకుంది. ఈ విషయాన్ని యూవీ క్రియేషన్స్ ప్రతినిధులు కూడా గతంలో చెప్పారు. రెండో టీజర్‌లో మెరుగైన గ్రాఫిక్స్ చూపించినప్పటికీ సినిమా విడుదల మాత్రం మరింత ఆలస్యమైంది.

ఇక్కడ మరో సమస్య ఏంటంటే 'విశ్వంభర' తర్వాత మొదలైన చిరంజీవి సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 'కాకా' షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి తీసుకురానున్నారు. దీంతో 'విశ్వంభర'కు సరైన రిలీజ్ డేట్ ఎంచుకోవడం నిర్మాతలకు చాలెంజ్ గా మారింది. వేసవిలో విడుదల చేసే ఆలోచన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వంభర'లో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా, యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సినిమాలో ఫాంటసీ ప్రపంచాన్ని చూపించేందుకు ఎక్కువగా గ్రాఫిక్స్ ఉపయోగిస్తున్నారు. అందుకే నార్మల్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం పడుతోంది. అయితే మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయినట్లు మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ముఖ్యంగా గ్రాఫిక్స్, ఫైనల్ మిక్సింగ్ వంటి పనులు కూడా పూర్తి కావాల్సి ఉంటుంది. మరి మేకర్స్ అసలు సందడి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

Tags:    
  • chiranjeevi 
  • vishwambhara 
  • vishwambharamovie 
  • megastar 
  • trisha 
  • vasishta 

Similar News

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

బన్నీతో సినిమా.. ఇంకెంత వెయిటింగ్!

2026-11-20 05:07 GMT

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS