మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?
| తెలుగు దర్శకుల విజన్‌కు ఇతర భాషల్లోనూ గుర్తింపు వస్తున్నా, కొన్ని సినిమాలు మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోవడం లేదు. కథకు సంబంధం లేని ఫైట్లు, హంగులు జోడించడం వల్ల అసలు ఫ్లేవర్ దెబ్బతింటోంది. కథకు తగ్గ కథనం, భావోద్వేగాలు, ప్రేక్షకులను సినిమాలో లీనం చేసే విధానం ఉంటేనే సినిమాలకు ఆదరణ, రిపీట్ వాల్యూ దక్కుతుందని విశ్లేషణ.
ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ల విజన్ కి ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. స్టార్ డైరెక్టర్లు చేసే సినిమాలు ఇతర భాషల ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది దర్శకులు చేసే సినిమాలు ప్లాప్ లను మూట గట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన డైరెక్టర్స్ ఎక్కడ తప్పు చేస్తున్నారు. సినిమాను సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో ప్రాబ్లం ఏంటి? అనేది మనం ఒకసారి తెలుసుకుందాం...
కథ ను బట్టే కథనం ఉండాలి...
కొన్ని సినిమాలు కథ పరంగా చూసినప్పుడు బాగున్నప్పటికి కథనం విషయంలో మాత్రం దర్శకులు అనవసరమైన హంగులు ఆర్భాటాలకు వెళ్తున్నారు. కథ డిమాండ్ మేరకే కథనం నడవాలి. అలా కాకుండా స్టార్ హీరో ఉన్నాడు కాబట్టి ఆయనకి పాన్ ఇండియా ఇమేజ్ ఉండటం వల్ల అనవసరమైన ఫైట్లు, రక్తపాతం పెట్టడం వల్ల కథలోని ఒరిజినల్ ఫ్లేవర్, సోల్ మిస్ అవుతుంది. కథ, కథనం పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే ప్రేక్షకుడు ఎంజాయ్ చేయగలుగుతాడు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా కథనాన్ని మార్చుకుంటు ఉంటే రిజల్ట్ తేడా కొడుతుంది.
ఆ స్టార్ డైరెక్టర్లు చేసే సినిమాలు ఓకేనా?
కొంతమంది స్టార్ డైరెక్టర్లు మాత్రం హీరో ఎవరైనా బడ్జెట్ ఎంతైనా వాళ్ళు అనుకున్నదే స్క్రీన్ మీద కనిపించాలని వాళ్ళ విజన్ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తారు. వాళ్ళు చాలా సందర్భాల్లో సక్సెస్ లను సాధిస్తున్నారు. కొన్ని వేళల్లో వాళ్ల ఐడియాలజీ కూడా రాంగ్ అవ్వచ్చు... కానీ ఎక్కువ సందర్భాల్లో వర్కౌట్ అవ్వడానికి అవకాశం ఉంది... అంటే కథకి ఏమీ కావాలో వాటిని సమకూరిస్తే సక్సెస్ ఈజీ గా వస్తుంది. ఎప్పుడైతే స్టోరీలోకి అన్ని ఇరికించడానికి ట్రై చేస్తారో సినిమా పట్టాలు తప్పుతుంది.
ఎలాంటి సినిమాలు కావాలి...
ప్రేక్షకుడి బాధలు మర్చిపోయేలా సినిమాలో వాళ్ళను లీనం చేయాలి. ప్రతి ఎమోషన్ కి ఆడియన్ కనెక్ట్ అవ్వాలి. తమ చుట్టూ ఉన్న ప్రపంచం కాదు సినిమాలో చూపించే వరల్డ్ లోకి వాళ్ళని తీసుకెళ్లాలి. అలాంటి సినిమాలు ప్రేక్షకుడికి చాలా బాగా నచ్చుతాయి. రిపీట్ వాల్యూ ఉన్న సినిమాలుగా నిలుస్తాయి. ఎక్కువ రోజుల పాటు ప్రేక్షకుడికి గుర్తుండిపోతాయి. అందుకే జానర్ ఏదైనా మనం కథలో ఏం చెప్పాలనుకుంటున్నామో అది పర్ఫెక్ట్ గా రీచ్ అవుతుందా లేదా అనేది ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవాలి. అప్పుడే సినిమా మనం అనుకున్నట్టుగా వస్తుంది. ఫైనల్ గా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది.