పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!
| తమిళ నటి ప్రియా భవాని శంకర్ తన పదేళ్ల ప్రేమకు పెళ్లితో ముగింపు పలికింది. క్లాస్‌మేట్ రాజ్‌వేల్ రాజ్‌తో నవంబర్ 10న నిశ్చితార్థం చేసుకున్న ఆమె, తాజాగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఎలాంటి హడావుడి లేకుండా జరిగిన పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తమిళ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రియా భవాని శంకర్ ఇండస్ట్రీలోకి రాకముందు న్యూస్ రీడర్గా తన కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత 2014లో సీరియల్స్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె 2017లో మేయా దమాన్ అనే తమిళ సినిమా ద్వారా నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే 2006లోనే కేడి అనే చిత్రంలో చిన్న పాత్ర పోషించింది. కానీ దీంతో ఈమె ఒక పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె తొలిసారి తెలుగులో సంతోష్ శోభన్ హీరోగా, అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించిన కళ్యాణం కమనీయం అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
భీమా , జీబ్రా వంటి చిత్రాలతో పలకరించింది కానీ అవన్నీ ఫ్లాప్ గా నిలిచాయి. కానీ ఈ ఏడాది ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో సీనియర్ స్టార్ హీరో రవితేజ హీరోగా నటించిన ఇరుముడి చిత్రంలో హీరోయిన్గా నటించి, భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే గతంలోనే తన బాయ్ఫ్రెండ్ ను పరిచయం చేసిన ఈమె.. గత పదేళ్లుగా తన క్లాస్మేట్ రాజ్ వేల్ రాజ్ తో ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. అయితే దీపావళి సందర్భంగా నవంబర్ 10వ తేదీన అత్యంత సన్నిహితులు , కుటుంబ సభ్యుల సమక్షంలో తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
అయితే ఇప్పుడు సడన్గా పెళ్లి కూడా చేసుకొని మరో సర్ప్రైజ్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఎలాంటి హడావిడి , ముందస్తు ప్రకటన లేకుండానే సింపుల్గా వివాహ బంధంలోకి అడుగు పెట్టేసింది. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదేమైనా నిన్న నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈమె.. ఇప్పుడు మరీ సింపుల్ గా పెళ్లి చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రియా భవాని శంకర్ పెళ్లి చేసుకోవడంతో పలువురు సినీ సెలబ్రిటీలు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రియా భవాని శంకర్ ప్రస్తుత చిత్రాలు..
ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న డెమోంటే కాలనీ 3 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న అహం బ్రహ్మాస్మి చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే 2017 లో వచ్చిన హిట్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ మరగాధ నాయనం సీక్వెల్ లో కూడా ఈమె భాగమైంది.