స్పెషల్ ఫోటోతో మహేష్ బాబుకి బర్తడే విషెస్ చెప్పిన ప్రియాంక చోప్రా!
ఇకపోతే ప్రియాంక పంచుకున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు చాలా క్యాజువల్ లుక్ లో ఫోన్ చూస్తూ పంచుకున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పంచుకున్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి వారణాసి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే నేడు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో షూటింగ్లో తీసుకున్న ఒక స్పెషల్ ఫోటోతో ప్రియాంక చోప్రా మహేష్ బాబుకి బర్తడే విషెస్ తెలియజేసింది.
ఇద్దరూ సాధారణ లుక్ లో షూటింగ్ స్పాట్ లో కూర్చుని ఉన్న స్పెషల్ ఫోటోని షేర్ చేస్తూ.." హ్యాపీ బర్తడే Bob.. వారణాసితో అల్టిమేట్ అడ్వెంచర్ కొనసాగిద్దాం" అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమాలో విలన్ రోల్ చేస్తున్న పృథ్వీరాజ్ కూడా హ్యాపీ బర్తడే బ్రదర్ అంటూ విషెస్ తెలియజేయగా.. అటు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కూడా అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా మహేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇకపోతే ప్రియాంక పంచుకున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు చాలా క్యాజువల్ లుక్ లో ఫోన్ చూస్తూ పంచుకున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటుంది. వారణాసి సినిమా విషయానికి వస్తే.. ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మందాకిని అనే పవర్ఫుల్ పాత్ర పోషిస్తూ ఉండగా మహేష్ బాబు రుద్రా అనే పాత్ర పోషిస్తున్నారు.
మరొకవైపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా మహేష్ బాబు రుద్ర పాత్రకు సంబంధించిన ఫోటోని షేర్ చేస్తూ స్పెషల్ విషెస్ తెలియజేశారు. " రుద్ర తన కంటే చాలా పెద్ద లక్ష్యాన్ని నెరవేర్చడానికే పుట్టాడు. తాను కోరుకోని విధిని ఇప్పుడు మోస్తున్నాడు. అతను చమత్కారి. సున్నితమైన మనసున్న వాడు.. అదే సమయంలో అత్యంత శక్తిమంతుడు కూడా" అంటూ రాజమౌళి తన హీరో పాత్రను వివరించారు.
అంతేకాదు రుద్ర పాత్రలో మహేష్ బాబు నటన గురించి కూడా రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎవరైనా సరే శక్తివంతమైన పాత్రను పోషించగలరు. కానీ అదే సమయంలో శక్తిమంతంగా, సున్నితంగా కనిపించగలిగే వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు" అంటూ హీరో పై ప్రశంసలు కురిపిస్తూ పంచుకున్న పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏది ఏమైనా ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.