ఫౌజీ నుంచీ గూస్ బంప్స్ తెప్పించే న్యూస్.. 3 వారాల పాటూ.. సినిమాకే హైలెట్!

అప్పుడు అదే హైదరాబాదులోని ఆర్ ఎఫ్ సి (రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్) లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. సుమారుగా 3 వారాల పాటు ఇక్కడ షూటింగ్ కొనసాగుతుందని సమాచారం.

Update: 2026-08-09 07:28 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ నుండి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఫౌజీ'. 'సీతారామం' వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి.. ఈసారి భారతదేశానికి స్వాతంత్రం రాక పూర్వం ఒక సైనికుడి గాధతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి తొలిసారి వెండితెరకు పరిచయమవుతూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఫౌజీ.

పలుమార్లు వాయిదా పడ్డ ఫౌజీ

నిజానికి ఆగస్టు 14వ తేదీనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. ఇప్పటికీ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇంకా ఈ సినిమా షూటింగ్ కొంత భాగం మిగిలి ఉండడం గమనార్హం. ఇలాంటి సమయంలో ఈ సినిమా నుంచి ఈ మధ్య అప్డేట్స్ వదులుతూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు మేకర్స్.

అందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ గత కొద్ది రోజులుగా హైదరాబాద్లోని కోకాపేటలో షూటింగ్ జరిగింది. ఒక దేవాలయంలో బ్రాహ్మణులు వేడుక చేసుకుంటుండగా.. బ్రిటీషర్స్ సైనికులు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్న సమయంలో బ్రాహ్మణుడి గెటప్లో ప్రభాస్ వచ్చి వారిని కాపాడే సన్నివేశాన్ని ఇటీవల చిత్రీకరించినట్లు సమాచారం.

అప్పుడు అదే హైదరాబాదులోని ఆర్ ఎఫ్ సి (రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్) లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు. సుమారుగా 3 వారాల పాటు ఇక్కడ షూటింగ్ కొనసాగుతుందని సమాచారం. పైగా ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా ఉంటుందట. మరి మెట్రోలో సాగే ఈ మూడు వారాల షూటింగు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 డిసెంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్, భానుచందర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేశభక్తి గాధకు, సాంప్రదాయానికి పెద్ద పీట వేసే చిత్రంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇకపోతే ఇటీవల పోస్టర్ ను విడుదల చేస్తూ.." అజ్ఞాత పర్వం ముగిసింది. తిరుగుబాటు మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా 2026 డిసెంబర్ 3న ఘనంగా విడుదల కాబోతోంది" అంటూ పోస్టర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇందులో ప్రభాస్ రక్తంతో తడిసిపోయి మెడలో జంధ్యం వేసుకొని చేతిలో రైఫిల్ పట్టుకొని ఒక రాయిపై కూర్చొని కనిపిస్తున్నారు. ఆయన చుట్టూ నేలపై అనేక మృతదేహాలు పడి ఉన్నాయి. ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్ అనే వాక్యం కూడా పోస్టర్ పై ఉండడం గమనార్హం. మొత్తానికి అయితే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News