కాకా స్పీడ్.. అందరికీ పాఠమే
ముఖ్యంగా తన కొత్త సినిమా ‘కాకా’కు మెగాస్టార్ చూపిస్తున్న స్పీడ్ ప్రశంసనీయం.
పెద్ద హీరో సినిమా ఒకటి పట్టాలెక్కిందంటే.. ఇక దాని రిలీజ్ కోసం సుదీర్ఘ కాలం ఎదురు చూడాల్సిందే. కొందరు స్టార్లయితే రెండు మూడేళ్లకు కానీ ఒక సినిమా పూర్తి చేయట్లేదు. పాన్ ఇండియా మోజులో పడి.. అవసరం లేని హంగులు జోడించి.. ఏళ్ల తరబడి సినిమాలను చెక్కుతూనే ఉన్నారు. ఇలాంటి టైంలో సీనియర్ హీరోలు మాత్రం స్పీడుగా సినిమాలు లాగించేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక పాన్ ఇండియా టార్గెట్‌తో భారీ స్థాయిలో తీసిన ‘సైరా’ ఒక్కటే ఆలస్యం అయింది. ‘విశ్వంభర’ వేరే కారణాలతో లేట్ అయింది తప్పితే.. మిగతా సినిమాలన్నీ చిరు వేగంగానే పూర్తి చేస్తున్నారు. ముఖ్యంగా తన కొత్త సినిమా ‘కాకా’కు మెగాస్టార్ చూపిస్తున్న స్పీడ్ ప్రశంసనీయం. ఈ సినిమా షూటింగ్ మొదలైంది మే చివరి వారంలో. ఇప్పటికి నాలుగు నెలలే అయ్యాయి. ఈలోపే ‘కాకా’ చిత్రీకరణ 80 శాతం పూర్తి అయిందని చిరు అప్‌డేట్ ఇవ్వడం చూసి అందరూ షాకైపోతున్నారు.
‘కాకా’ ఫస్టాఫ్ పూర్తయిందనే అప్‌డేట్ నెల కిందటే వచ్చింది. ఇంతలోనే సెకండాఫ్‌లో 30 శాతం పూర్తి చేసినట్లు చిరు తాజాగా వెల్లడించాడు. ఫస్టాఫ్‌కు బీజీఎం పని కూడా తమన్ మొదలుపెట్టేసినట్లు కూడా వెల్లడించాడు. టాలీవుడ్లో వేగంగా సినిమాలు చేసే స్టార్ డైరెక్టర్లు లేకపోలేదు. అనిల్ రావిపూడి చాలా ఏళ్లుగా ఏడాది మధ్యలో షూట్ మొదలుపెట్టి సంక్రాంతికి రెడీ చేసేస్తున్నాడు. కానీ అతడి ప్లానింగ్ వేరు, స్పీడు వేరు. కానీ బాబి కొల్లి లాంటి దర్శకుడు కూడా ఇప్పుడు ఇదే వేగంతో సినిమా చేస్తుండడం విశేషమే. ‘కాకా’ పెద్ద స్కేల్ ఉన్న సినిమా. చిరంజీవి మూవీ అంటే ప్రతిదీ భారీగా ఉండాల్సిందే. ఇలాంటి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇంత వేగంగా చిత్రీకరణ జరుపుకోవడం అంటే విశేషమే. ఏళ్ల తరబడి ఒక సినిమాకు అంకితం అయిపోయి.. అభిమానులకు తీవ్ర అసహనం కలిగిస్తున్న హీరోలు, దర్శకులకు ఇది ఒక పాఠమే. వారణాసి లాంటి మెగా ఈవెంట్ ఫిలిమ్స్‌కు ఎక్కువ టైం పెట్టారంటే ఓకే కానీ.. మిగతా చిత్రాలను మాత్రం వీలైనంత వేగంగా పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటే బెటర్.