బ్లాక్ బస్టర్ మూవీ.. రిలీజ్ కు ఎన్ని తలనొప్పులో..
ఎలాంటి హైప్ లేకుండా వచ్చిన ఓ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఎలాంటి హైప్ లేకుండా వచ్చిన ఓ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొదట తక్కువ థియేటర్లలోనే విడుదలైనా.. ప్రేక్షకుల రెస్పాన్స్ తో ఫుల్ గా స్క్రీన్లు పెరిగాయి. ఐదు వారాలు పూర్తయినా నార్త్ లో ఇంకా సినిమా జోరు తగ్గలేదు. ఇంతటి విజయం సాధించిన ఆ మూవీ సౌత్ రిలీజ్ విషయంలో మాత్రం ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి నార్త్ లో సినిమా రిజల్ట్ చూసిన తర్వాత సౌత్ లో కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. దీనిపై అనౌన్స్మెంట్ రావడంతో ఇక్కడి ప్రేక్షకుల్లో కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. అయితే ఆ తర్వాత రిలీజ్ కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో అసలు సినిమా ఎప్పుడు వస్తుందనే దానిపై కన్ఫ్యూజన్ వచ్చింది. ఇదే సమయంలో సౌత్ రిలీజ్ వ్యవహారంలో మార్పులు జరిగినట్లు సమాచారం.
ఆ ప్రాజెక్టుతో కలిసి పనిచేస్తున్న తెలుగు దర్శకుడు, డిస్ట్రిబ్యూటర్లు తప్పుకున్నట్లు తెలుస్తోంది. వారి స్థానంలో మరో ప్రొడక్షన్ హౌస్ రంగంలోకి వచ్చినట్లు సమాచారం. దీంతో సౌత్ రిలీజ్ ప్లాన్ మళ్లీ మారే పరిస్థితి ఏర్పడిందని టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ఒక సినిమా విడుదలకు ముందే డిస్ట్రిబ్యూషన్, థియేటర్లు, ప్రమోషన్స్ వంటి ప్లాన్స్ ను రెడీ చేసుకుంటారు. కానీ ఇక్కడ నార్త్ లో ఊహించని స్థాయిలో సినిమా విజయం సాధించడంతో సౌత్ మార్కెట్ పై కూడా దృష్టి పడింది.
అప్పటికే సినిమా అక్కడ విడుదలై ఉండటంతో కొత్తగా రిలీజ్ ప్లాన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడే పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ ఇంపార్టెన్స్ కనిపిస్తోంది. ఇప్పుడు ఒక సినిమా కథ, క్యాస్టింగ్, మేకింగ్ మాత్రమే కాకుండా.. ఏయే భాషల్లో విడుదల చేయాలి, ఏ మార్కెట్ ను టార్గెట్ చేయాలనే అంశాలను కూడా ముందుగానే ప్లాన్ చేస్తున్నారు. అలా చేస్తే ఒకే సమయంలో అన్ని ప్రాంతాల్లో సినిమాను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
అయితే ఆ సినిమా మొదట పాన్ ఇండియా రిలీజ్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రాజెక్ట్ కాదు. నార్త్ మార్కెట్ పైనే ఫోకస్ చేసి ఉండొచ్చు. కానీ సినిమా ఊహించని విజయం సాధించడంతో సౌత్ లోనూ డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడు అక్కడ రిలీజ్ చేయడానికి కొత్తగా డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్ ప్లాన్ సిద్ధం చేయాల్సి వస్తోంది. ఒక ప్రాంతంలో చిన్న రేంజ్ లో మొదలైన సినిమా.. భారీ విజయంతో ఇతర మార్కెట్ల దృష్టిని ఆకర్షించింది.
అదే సమయంలో ముందుగా పాన్ ఇండియా ప్లాన్ లేకపోవడం వల్ల ఇప్పుడు వేరే మార్కెట్ లోకి వెళ్లడానికి కొత్త ప్లాన్స్ అవసరమవుతున్నాయి. అందుకే ఇప్పుడు సౌత్ రిలీజ్ ఎప్పుడు ఉంటుందనే దానిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చివరకు మరేం జరుగుతుందో.. ఆ సినిమా సౌత్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.