రాజమౌళి ఈ మూడు లేకపోతే సినిమా చేయలేడా?
ఎప్పుడైతే ప్రేక్షకుడు ఎమోషన్ కి కనెక్ట్ అవుతాడో సినిమాని ఆటోమేటిగ్గా ఇష్టపడతాడని ఆ సినిమా లో ఉన్న ప్రతి సన్నివేశాన్ని తను ఆస్వాదిస్తాడని రాజమౌళి నమ్ముతుంటాడు.
సినిమా ఇండస్ట్రీలో తన విజయకేతనాన్ని ఎగరవేస్తూ ప్రతి ప్రేక్షకుడిని తన సినిమాతో సాటిస్ఫై చేయగలిగే కెపాసిటి ఉన్న ఒకే ఒక్క దర్శకుడు రాజమౌళి... ప్రేక్షకుడి యొక్క పల్స్ తెలిసిన డైరెక్టర్ గా ఇతడిని అభివర్ణిస్తూ ఉంటారు. నిజానికి ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. దానికి తోడుగా ఆయన సినిమాలో నటించిన ప్రతి హీరోని టాప్ హీరోగా మార్చిన ఘనత కూడా తనకే దక్కుతుంది. ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి తన సినిమాలో ఒక మూడు ఎలిమెంట్స్ లేకపోతే సినిమానే చేయడు. అవేంటంటే ఒకటి భారీ విలనిజం ఉండాలి. ఎప్పుడైతే విలన్ స్ట్రాంగ్ గా ఉంటాడో హీరో అంత పెద్ద స్ట్రాంగ్ పర్సన్ ని కొట్టినప్పుడు తను మరింత ఎలివేట్ అవుతాడనే పాయింట్ ను పట్టుకొని తను ముందుకు సాగుతున్నాడు. ఇక రెండోది కథలో ఎమోషన్ ఉండాలి.
ఎప్పుడైతే ప్రేక్షకుడు ఎమోషన్ కి కనెక్ట్ అవుతాడో సినిమాని ఆటోమేటిగ్గా ఇష్టపడతాడని ఆ సినిమా లో ఉన్న ప్రతి సన్నివేశాన్ని తను ఆస్వాదిస్తాడని రాజమౌళి నమ్ముతుంటాడు. ఇక మూడోది ఏంటంటే హీరోల ఎలివేషన్స్ ను సైతం తను చాలా గ్రాండ్ గా డిజైన్ చేసుకుంటూ ఉంటాడు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి సినిమా గ్రాఫ్ ని పెంచుతూ తగ్గిస్తూ ప్రేక్షకుడి యొక్క భావోద్వేగాలను తన కంట్రోల్ లోకి తీసుకొచ్చి తను సినిమాలోని క్యారెక్టర్ ని ఎలా తిప్పితే ప్రేక్షకులు అందులో ఇన్వాల్వ్ అయిపోయి తను కూడా అలానే చూస్తూ ఉండిపోతాడు.
మొత్తానికైతే సినిమాని సక్సెస్ తీరానికి చేర్చడంలో రాజమౌళి కొన్ని స్ట్రాటజీలను ఫాలో అవుతూనే ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని ఇవ్వడానికి అనుక్షణం తపిస్తూనే ఉంటాడు. అందుకే ఆయన ఇప్పటివరకు చేసిన 12 సినిమాలు ప్రేక్షకుడిని విశేషంగా అలరించాయి అంటే మామూలు విషయం కాదు. ఈ మధ్యకాలంలో వస్తున్న దర్శకులు ఒక్క సినిమాతోనే సక్సెస్ ని సాధించడానికి నానా తంటాలు పడుతుంటే రాజమౌళి మాత్రం వరుసగా 12 సినిమాలతో సూపర్ సక్సెస్ ని అందుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి...
ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న 'వారణాసి' సినిమాలో సైతం ఇంతకుముందు చూసిన విజువల్ వండర్స్ కంటే అంతకుమించిన రేంజ్ లో ఈ సినిమాలో విజువల్స్ మనం చూడబోతున్నాం అంటూ రాజమౌళి చెబుతూనే వస్తున్నాడు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 27 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాబట్టి ఈ సినిమాతో రాజమౌళి మరింత ముందుకు దూసుకెళ్లడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది...