"లైఫ్ టైం లవ్ " అంటూ పోస్ట్. గ్రీస్ అందాల మధ్య అనిరుధ్ -కావ్య దంపతులు!
| మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ నవంబర్ 11న గ్రీస్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రజనీకాంత్, ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. తమ పెళ్లి ఫొటోలను అనిరుధ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది.
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్న అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ సహా యజమాని కావ్య మారన్ ఎట్టకేలకు నవంబర్ 11న గ్రీస్ అందాల నడుమ వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. ఈ ప్రైవేట్ డెస్టినేషన్ వెడ్డింగ్ కి పలువురు సినీ, రాజకీయ,వ్యాపార రంగాల ప్రముఖులు హాజరై సందడి చేశారు. సాధారణంగా సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి అంటే అందులో దాదాపు కొన్ని నిజమవుతాయనే కామెంట్లు ఎప్పటికప్పుడు వ్యక్తం అవుతూనే ఉంటాయి. అయితే ఆ రూమర్స్ నిజమైనప్పుడు అభిమానులు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా గతకాలంగా సోషల్ మీడియాలో అనిరుధ్, కావ్య జంటపై పెద్ద ఎత్తున రూమర్స్ వెలువడిన విషయం తెలిసిందే. ఇక ఆ రూమర్స్ ను నిజం చేస్తూ ఈ జంట వివాహం చేసుకున్నారు.
వివాహం తర్వాత అనిరుధ్ తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను అధికారికంగా ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ అద్భుతమైన క్యాప్షన్ జోడించారు." నా జీవితంలో ఒక్కసారి.. జీవితాంతం నిలిచిపోయే రోజు నవంబర్ 11" అంటూ ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లైఫ్ టైం లవ్ అంటూ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మొత్తానికైతే ఇన్ని రోజులు రూమర్స్ గా సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలు ఇప్పుడు ఎట్టకేలకు నిజమయ్యాయి.
గ్రీస్ అందాల మధ్య అతిరథ మహారథుల సమక్షంలో అనిరుధ్, కావ్య పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఈ పెళ్లి వేడుకలలో వీరిద్దరూ ధరించిన దుస్తులు అభిమానులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ డిజైనర్ తరుణ్ తాహిలియాని డిజైన్ చేసిన లేత రంగుల దుస్తులను వీరు ధరించారు. అందులో అనిరుధ్ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన ఐవరీ కుర్తా, వేష్టి, లాంగ్ జాకెట్ ధరించగా.. కావ్య బ్లష్డ్ పింక్ ఎంబెల్లిష్డ్ లెహంగా ధరించింది. ఈ దుస్తులలో ఈ జంట చూడ చక్కగా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే కావ్య - అనిరుధ్ పెళ్లి వేడుక అంబరాన్ని తాకింది అనడంలో సందేహం లేదు.
గ్రీస్లో అత్యంత వైభవంగా జరిగిన ఈ ప్రైవేట్ వేడుకకు సన్నిహిత కుటుంబ సభ్యులు, సూపర్ స్టార్ రజినీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయ నిధితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాదు ఈ వేడుకలో అనిరుద్ హిట్ ట్రాక్ "మనసిలాయో" పాటకు రజనీకాంత్ డాన్స్ చేస్తున్న క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం గమనార్హం.
మరోవైపు గ్రీస్ వివాహం అనంతరం 2026 నవంబర్ 21న చెన్నైలో గ్రాండ్ గా వీరి రిసెప్షన్ జరగనుంది. కావ్య తల్లిదండ్రులైన కళానిధి మారన్, కావేరీ వ్యక్తిగతంగా పలువురు సెలబ్రిటీలను కలిసి ఆహ్వానించిన విషయం తెలిసిందే. చెన్నైలో జరిగే ఈ విందుకు భారతీయ సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని సమాచారం.