పవన్ పిల్లలకు ఆ ఆస్తి.. ఎప్పుడిచ్చారంటే!
| 2024 ఎన్నికల అఫిడవిట్‌లో పవన్ కళ్యాణ్ తన కుటుంబ ఆస్తుల వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లో ఉన్న ప్రాపర్టీని పిల్లలు మార్క్ శంకర్, పోలీనా అంజనీలకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇందులో ఒక్కొక్కరికి 50 శాతం వాటా ఉండగా, వారి వాటా విలువ చెరో రూ.11 కోట్లుగా పేర్కొన్నారు. అన్నా కొణిదెలకు బంజారాహిల్స్‌లో రూ.1.95 కోట్ల విలువైన ఫ్లాట్, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వస్తున్న వార్తలతో ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా భార్య అన్నా లెజ్నెవా, పిల్లల పేర్ల మీద ఎంత ఆస్తి ఉందనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ తన కుటుంబ సభ్యులకు గతంలోనే కొన్ని ఆస్తులను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ విషయాన్ని 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో కూడా పేర్కొన్నారు.
పిఠాపురం నుంచి పోటీ చేసినప్పుడు పవన్ తన ఆస్తులు, అప్పులతో పాటు భార్యాపిల్లల పేరిట ఉన్న ఆస్తుల వివరాలను వెల్లడించారు. అప్పట్లో కుటుంబ సభ్యుల చరాస్తులు, స్థిరాస్తులను విడివిడిగా చూపించారు. ఎన్నికల సందర్భంగా సమర్పించిన ఈ పత్రాల్లో పిల్లలకు ఇచ్చిన భారీ ప్రాపర్టీ వివరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అవే వివరాలు మరోసారి బయటకు వచ్చాయి.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లో ఉన్న స్థిరాస్తిని పవన్ తన పిల్లలు మార్క్ శంకర్, పోలీనా అంజనీలకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇందులో ఇద్దరికీ చెరో 50 శాతం వాటా ఉంది. అఫిడవిట్‌లో ఒక్కొక్కరి వాటా విలువ రూ.11 కోట్లుగా పేర్కొన్నారు. అంటే ఇద్దరి పేర్ల మీద కలిపి రూ.22 కోట్ల విలువైన ప్రాపర్టీ ఉంది.
ఇక అన్నా కొణిదెల పేరిట కూడా హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నాయి. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో 3,336 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ ఫ్లాట్ ఉంది. దీని విలువను రూ.1.95 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే ఆమె బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.86 లక్షల డిపాజిట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. వీటితో పాటు బంగారం, ఇతర ఆభరణాల వివరాలను కూడా నమోదు చేశారు.
పవన్‌కు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. అకీరా నందన్, ఆద్యతో పాటు మార్క్ శంకర్, పోలీనా అంజనీల పేరిట కూడా చరాస్తులు ఉన్నట్లు 2024 ఎన్నికల పత్రాల్లో చూపించారు. అప్పటి వివరాల ప్రకారం నలుగురి పేరిట కలిపి రూ.3.52 కోట్లకు పైగా చరాస్తులు ఉన్నాయి. వీటిలో బ్యాంకు డిపాజిట్లు, ఇతర ఆస్తులు ఉన్నాయి. అయితే పవన్, అన్నా విడిపోతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ పాత ఆస్తుల వివరాలను ప్రస్తుత వ్యవహారంతో ముడిపెట్టి కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటివరకు విడాకుల విషయంలో పవన్ మీడియా ముందు ఎలాంటి వివరణ అయితే ఇచ్చింది లేదు. మరి రానున్న రోజుల్లో ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.