టాక్సిక్ ఫ్లాప్‌పై కియారా కామెంట్స్.. కన్నడ ఇండస్ట్రీని తప్పుబట్టని హీరోయిన్!
| 'టాక్సిక్' సినిమా బాక్సాఫీస్ ఫలితం నిరాశ కలిగించిందని కియారా అద్వానీ అంగీకరించింది. యశ్‌తో ఇంటిమేట్ సీన్లపై వచ్చిన ట్రోలింగ్‌ను భర్త సిద్ధార్థ్ మల్హోత్రా పట్టించుకోలేదని తెలిపింది. సినిమా ఫలితంపై దర్శకులను నిందించకుండా, తన పాత్రకు వచ్చిన ప్రశంసల పట్ల సంతోషం వ్యక్తం చేసింది.
సినిమా విజయానికి ఎంతగా క్రెడిట్ తీసుకుంటామో, పరాజయాన్ని కూడా అంతే హుందాగా అంగీకరించాలి. ఈ విషయాని ఈ మధ్య చాలా మంది హీరో హీరోయిన్లు మర్చిపోతున్నారు. కానీ కియారా మాత్రం ఇలా చేయకుండా..అలాంటి వైఖరికి భిన్నంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటోంది.
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ సినిమాలో కియారా హీరోయిన్గా చేసింది. ఈ సినిమాలో యశ్‌తో కలిసి ఆమె చేసిన కొన్ని ఇంటిమేట్ సన్నివేశాలు.. అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. పెళ్లి తర్వాత, తల్లి అయిన తర్వాత ఇలాంటి సన్నివేశాల్లో నటించడం అవసరమా అంటూ కొందరు నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు. ఈ విషయంలో కియారా తీవ్ర విమర్శలు, ట్రోలింగ్‌ను ఎదుర్కొంది. ఆఖరికి ఆమె భర్తను కూడా విమర్శించారు.
తాజాగా కాఫీ విత్ కరణ్ సీజన్ 9లో పాల్గొన్న కియారా ఈ వివాదంపై స్పందించింది. తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. తన సినిమా సన్నివేశాలపై వచ్చిన విమర్శలను సిద్ధార్థ్ పెద్దగా పట్టించుకోలేదని కియారా తెలిపింది. "అతను అసలు పట్టించుకోలేదు. ఈ విషయం గురించి ఎప్పుడూ నాతో మాట్లాడలేదు." అని ఆమె చెప్పింది. నటీమణులు ఇలాంటి విమర్శలను ఎదుర్కోవడం కొత్తేమీ కాదని, గతంలో ఐశ్వర్యారాయ్ వంటి ప్రముఖ హీరోయిన్లు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చింది.
మరోవైపు టాక్సిక్ సినిమా బాక్సాఫీస్ ఫలితంపై కూడా కియారా తన మనసులోని మాటను బయటపెట్టింది. సినిమాకు మొదట మంచి ఓపెనింగ్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడం తనని తన చిత్ర బంధాన్ని చాలా బాధించిందని తెలిపింది. ఈ సినిమా ఫలితం తనను చాలా నిరాశకు గురిచేసిందని, అలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదని చెప్పింది. అయితే ఈ సినిమాలో తాను ఎంచుకున్న పాత్రకు వచ్చిన ప్రశంసలు మాత్రం సంతోషాన్ని ఇచ్చాయని పేర్కొంది. తన కెరీర్లో ఈ పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని అభిప్రాయపడింది.
అయితే సినిమా ఫ్లాప్ అయ్యింది అని ఒప్పుకున్న ఈ హీరోయిన్.. దర్శకురాలని బ్లెమ్ చేయకుండా.. అందరిని సపోర్ట్ చేస్తూ మాట్లాడటం.. అలానే తను ఎంచుకున్న పాత్ర పైన తనకున్న నమ్మకాన్ని ఇప్పటికి కూడా అదేలాగా వ్యక్తపరచడం.. ఆమెకు ప్రశంసలు తెచ్చిపెడుతోంది. సినిమా హిట్ అయితే ఒకలాగా.. ప్లాప్ అయితే ఒకలాగా.. మాట్లాడే హీరోయిన్స్ ఉన్న ఈ తరుణంలో.. కియారా మాత్రం సినిమాలను, సినిమా దర్శకులను బ్లేమ్ చేయకుండా.. కేవలం హీరోయిన్లు ఎదుర్కొనే సమస్య మాత్రమే మాట్లాడటం కూడా ప్రశంసనీయం.