బాలీవుడ్‌లో సౌత్ హీరోయిన్ల ఫ్లాప్‌ల పరంపర!

దీంతో బాలీవుడ్‌లో సౌత్ నటీమణుల ఫ్లాప్‌ల పరంపర మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Update: 2026-09-26 11:30 GMT

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికలుగా వెలుగోందిన భామ‌ల‌కు బాలీవుడ్ మాత్రం వరుస చేదు అనుభవాలనే మిగుల్చుతోంది. టాలీవుడ్, కోలీవుడ్‌లలో వరుస విజయాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన భామలు.. హిందీ పరిశ్రమకు వెళ్లేసరికి పరాజయాలను చవిచూడాల్సి వస్తోంది. తాజాగా తమన్నా నటించిన హిందీ చిత్రం `ది వావన్` థియేటర్లలో సరైన ఓపెనింగ్స్ సాధించలేక తొలి రోజే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. దీంతో బాలీవుడ్‌లో సౌత్ నటీమణుల ఫ్లాప్‌ల పరంపర మరోసారి చర్చనీయాంశంగా మారింది.

దక్షిణాదిలో `మిల్కీ బ్యూటీ` గా దశాబ్దానికి పైగా చెరగని ముద్ర వేసిన తమన్నాకు హిందీలో మాత్రం ఆశించిన స్థాయిలో అదృష్టం కలసిరావడం లేదు. ఓటీటీ వేదికలపై కొన్ని ప్రాజెక్ట్‌లతో ...ప్రత్యేక గీతాలతో సంచలనం సృష్టించినప్పటికీ పూర్తిస్థాయి థియే ట్రికల్ సినిమాల విషయంలో మాత్రం త‌మ‌న్నాకు నిరాశే ఎదురవుతోంది. తాజా సినిమా `దివావ‌న్` కి కి సరైన కలెక్షన్లు రాకపోవడమే గాక‌ వీక్ కథనం తో డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో తమన్నా కెరీర్‌లో మరో బాలీవుడ్ ఫ్లాప్‌గా మిగిలిపోయింది.

అంతకుముందు పలువురు సౌత్ స్టార్ హీరోయిన్లకు బాలీవుడ్ నిరాశనే మిగిల్చింది. టాలీవుడ్‌లో ఒకప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా ఊపేసిన పూజా హెగ్డే బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ `సర్కస్`, `కిసీ కా భాయ్ కిసీ కా జాన్`, `దేవా` వంటి వరుస పరాజయాలతో నెట్టుకొస్తోంది. అలాగే `సీతారామం`, `హాయ్ నాన్న` వంటి సినిమాలతో దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా మారిన మృణాల్ ఠాకూర్ కూడా బాలీవుడ్ సోలో సినిమాల విషయంలో ఆశించిన స్థాయి విజయాలను సాధించలేకపోవడం గమనార్హం.

మరోవైపు `మహానటి` చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకుని సౌత్ లో అగ్రస్థానంలో కొన‌సాగిన‌ కీర్తి సురేష్‌ సైతం బాలీవుడ్ ఎంట్రీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా? ఆ సినిమాల ఫలితాలు ఆమెకు నిరాశనే మిగిల్చాయి. దక్షిణాదిలో దక్కినంత స్టార్‌డమ్, బలమైన పాత్రలు ఉత్తరాది చిత్రాల్లో వారికి లభించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంతటి స్టార్ పవర్ ఉన్నా? నటనలో ఎంతటి దిట్టలైనా బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సౌత్ నటీమణుల మంత్రం పారకపోవడం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సౌత్ హీరోయిన్ల వరుస పరాజయాలకు కథల ఎంపికలోని లోపాలే ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. దక్షిణాదిలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించే తారలను, బాలీవుడ్ దర్శకులు గ్లామర్ హంగుల కోసమో లేదా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసమో మాత్రమే పరిమితం చేస్తున్నారు. బలం లేని కథలు, బలవంతపు క్యారెక్టరైజేషన్లు, సరైన ప్రమోషన్లు లేకపోవడం వల్ల కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.

వరుస ఫ్లాప్‌ల పరంపర నుంచి బయటపడాలంటే సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ ప్రాజెక్ట్‌ల విషయంలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. అగ్ర‌ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయని లేదా భారీ బ్యానర్లు అని గుడ్డిగా క‌మిట్ అవ్వ‌కుండా? కథా బలమున్న ప్రాజెక్ట్‌లను మాత్రమే ఎంచుకోవాలి. నటనకు, ఇమేజ్‌కు తగిన స్థాయిలో న్యాయం జరిగే పాత్రలను ఎంచుకున్నప్పుడు మాత్రమే ఉత్తరాది తెరపై కూడా సౌత్ భామలు విజయ జెండాను ఎగర వేయగలరు.

Tags:    

Similar News