ఐరన్ లెగ్ కామెంట్స్.. చిట్టికి నవ్వొస్తుందట!

ఒక హీరోయిన్‌ కు వరుసగా సినిమాలు ఫ్లాప్ అయితే వెంటనే వచ్చే కామెంట్ ఐరన్ లెగ్. సినిమా రిజల్ట్స్ కు హీరో హీరోయిన్ల సెంటిమెంట్లతో లింక్ చేయడం ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో కనిపిస్తూనే ఉంది.

Update: 2026-09-26 09:30 GMT
ఒక హీరోయిన్‌ కు వరుసగా సినిమాలు ఫ్లాప్ అయితే వెంటనే వచ్చే కామెంట్ ఐరన్ లెగ్. సినిమా రిజల్ట్స్ కు హీరో హీరోయిన్ల సెంటిమెంట్లతో లింక్ చేయడం ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో కనిపిస్తూనే ఉంది. అయితే ఇలాంటి కామెంట్స్ తనకు మాత్రం నవ్వు తెప్పిస్తాయని యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా అంటోంది. సిగ్మా ప్రమోషన్స్‌ లో మాట్లాడిన ఆమె.. ఆ విషయంపై తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.
'ఒక హీరోయిన్‌ కు బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు వర్కౌట్ కాకపోతే ఐరన్ లెగ్ అంటారు. అలాంటి మాటలు వింటే నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది' అని ఫరియా చెప్పారు. మన దగ్గర సినిమాలకు సంబంధించి ఎన్నో మూఢనమ్మకాలు ఉంటాయని తెలిపింది. కొందరు ఉంటే మంచి జరుగుతుందని, మరికొందరు ఉంటే చెడు జరుగుతుందని నమ్మే పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు.
అయితే సినిమా హిట్, ఫ్లాప్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదనే విషయాన్ని తన కెరీర్‌ నే ఎగ్జాంపుల్ గా ఫరియా చెప్పకనే చెప్పింది. ఓ స్టేజ్ లో వరుస ఫ్లాపులు ఎదురైనా.. తర్వాత అదే హీరోయిన్‌ కు భారీ సక్సెస్ రావచ్చని తెలిపింది. 'కొన్నేళ్ల తర్వాత హిట్ కూడా అంతే పెద్దగా రావచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి' అనే ఫీలింగ్ ను షేర్ చేసుకున్నారు.
ఫరియా అబ్దుల్లా కెరీర్‌ విషయానికి వస్తే.. జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది. చిట్టి పాత్రలో ఆమె చేసిన అల్లరి, కామెడీ, యాక్టింగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. తొలి సినిమాతోనే వచ్చిన గుర్తింపు ఆమెకు వరుస అవకాశాలు తీసుకొచ్చింది. ఆ తర్వాత లైక్ షేర్ & సబ్‌ స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటీ అడక్కు వంటి సినిమాల్లో హీరోయిన్‌ గా కనిపించింది. ఆ సినిమాల్లో కొన్ని ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఫరియా కెరీర్‌ పై కూడా చర్చ జరిగింది.
అయితే మత్తు వదలరా 2తో ఆమె మరోసారి సక్సెస్ అందుకుంది. దీంతో ఒక హీరోయిన్ కెరీర్‌ ను వరుసగా వచ్చిన కొన్ని సినిమాల రిజల్ట్స్ తో మాత్రమే అంచనా వేయడం సరైంది కాదనే మాట వినిపించింది. మరోవైపు ఫరియా ప్రస్తుతం సిగ్మా మూవీతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా.. ఫరియా ఎనర్జిటిక్ రేడియో జాకీ పాత్రలో కనిపించనున్నారు.
తమిళంతో పాటు తెలుగులో కూడా ఆ సినిమా విడుదల కానుండగా, ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అందుకే తనపై వచ్చిన ఐరన్ లెగ్ లాంటి కామెంట్లను సీరియస్‌ గా తీసుకోకుండా.. కెరీర్‌ లో విజయాలు, పరాజయాలు సహజమే అన్నట్టుగా ఫరియా రెస్పాండ్ అవ్వడం ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆమె ఫోకస్ అంతా కొత్త సినిమాలు, కొత్త పాత్రలపైనే ఉందని క్లియర్ గా తెలుస్తోంది. మరి ఫ్యూచర్ లో ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటుందో వేచి చూడాలి.



Tags:    

Similar News