తెలుగింట సీత‌మ్మ టాలీవుడ్ కి దూర‌మైన‌ట్లేనా?

అయితే కొంతకాలంగా అమ్మ‌డు టాలీవుడ్ తెరపై పెద్దగా కనిపించకపోవడంతో అంజలి తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైనట్లేనా? అన్న అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.

Update: 2026-09-26 10:30 GMT

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో అమాయకమైన, సహజసిద్ధమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరై తెలుగింట సీతమ్మ గా గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి. తెలుగు నటీమణులకు అవకాశాలు అరుదుగా లభించే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని స్టార్ హీరోయిన్ల సరసన నిలిచిన అతికొద్దిమంది తెలుగు భామల్లో అంజలి ఒకరు. అయితే కొంతకాలంగా అమ్మ‌డు టాలీవుడ్ తెరపై పెద్దగా కనిపించకపోవడంతో అంజలి తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైనట్లేనా? అన్న అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి.

ప్రస్తుతం అంజ‌లి చేతిలో తెలుగు ప్రాజెక్ట్‌లు లేకపోవడం ఈ సందేహాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. తెలుగులో ఆశించిన రీతిలో ప్రాధాన్యత ఉన్న అవకాశాలు రాకపోవడంతో అమ్మ‌డు ఇటువైపు రావడం లేదా? లేక వచ్చిన పాత్రలు నచ్చక స్వయంగా వదులుకుంటున్నారా? అనే ప్రశ్న పక్కనబెడితే ఆమె లేని లోటు టాలీవుడ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకునే అంజలికి సరిపడే కథలు టాలీవుడ్‌లో లేక‌పోవ‌డం కూడా ఓ కారణం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

టాలీవుడ్‌లో సైలెంట్ అయినా? అంజలి తమిళం, మలయాళ పరిశ్రమల్లో మాత్రం పూర్తి బిజీగా ఉన్నారు. కోలీ వుడ్‌లో ఆమెకు ఇప్పటికీ అద్భుతమైన ఆఫర్లు వస్తున్నాయి. నటనకు ఆస్కారం ఉన్న వైవిధ్యమైన, బలమైన పాత్రలను అక్కడ దర్శకులు ఆమె కోసం డిజైన్ చేస్తున్నారు. మలయాళంలో కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకునే ప్రాజెక్ట్‌లు, వెబ్ సిరీస్‌లలో కీలక పాత్రలు పోషిస్తూ అక్కడ స‌త్తా చాటుతోంది. పరభాషా పరిశ్రమలు అజంలిలో నటిని సరిగ్గా వినియోగించుకుంటున్నారు? అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

నిజానికి టాలీవుడ్‌లో సోంత భామ‌ల‌కు సీరియస్ అవకాశాలు లభించడం అరుదు. ఉత్తరాది లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భామలకే ద‌ర్శక‌, నిర్మాత‌లు మొగ్గు చూపుతారనే విమర్శ తొలి నుంచీ ఉంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అంజలి స్వచ్ఛమైన ప్రతిభతోనే దశాబ్దానికి పైగా టాలీవుడ్‌లో నిలదొక్కుకుని ఎన్నో విజయాలను సాధించింది. అయితే ప్రస్తుత ట్రెండ్‌లో హీరోయిన్ల ప్రాధాన్యత కమర్షియల్ హంగులకే పరిమితం కావడం వల్ల అంజలి లాంటి పెర్పార్మ‌ర్ల‌కు తగ్గ పాత్రలు రాకపోవడం విచారకరం.

'గీతాంజలి', 'మసాలా', 'వకీల్ సాబ్',  'గేమ్ ఛేంజర్' వరకూ అంజలి తెలుగులో చేసిన ప్రతి సినిమాలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. ముఖ్యంగా డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలలో .. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో అమ్మ‌డి నటన అద్భుతంగా ఉంటుంది. ఈనేప‌థ్యంలో అంజ‌లికి తెలుగు పరిశ్రమపై ఆసక్తి తగ్గలేదని కేవలం మంచి కథ, తన స్థాయికి తగ్గ బలమైన పాత్ర లభిస్తే మళ్లీ టాలీవుడ్‌లో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారని సినీ వర్గాల నుంచి అందుతోన్న‌ స‌మాచారం.

Tags:    

Similar News