ఒకప్పుడు హీరో తోడగొడితే మాస్... మరి ఇప్పుడు ఏం చేస్తే మాస్?
ఏది ఏమైనా కూడా రూరల్ బ్యాక్ డ్రాప్ లో కనిపించే ప్రతి హీరో భారీ ఎమోషన్స్ ను పండిస్తూ ఎలివేషన్స్ తో ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటున్నాడు.
సినిమా ఇండస్ట్రీలో ఒక్కో టైమ్ లో ఒక్కోతరహా సినిమాలు ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ప్రేక్షకుడి అభిరుచి మేరకు సినిమాలను తీర్చిదిద్దడంలో దర్శకులు కీలక పాత్ర వహిస్తున్నారు. ఇక ఇలాంటి నేపథ్యంలోనే గతంలో స్టార్ హీరోలు తొడగొడితే మాస్ ఆడియన్స్ పూనకాలతో ఊగిపోయేవారు. మరి ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు వాటన్నింటికి స్వస్తి చెబుతూ కొన్ని డిఫరెంట్ తరహా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి... ఒకప్పుడు తొడగొడితే మాస్ అని భావించేవారు. కానీ ఇప్పుడు రా అండ్ రస్టిక్ గా కనిపిస్తూ రూరల్ బ్యాక్ డ్రాప్ లో హీరో నాచురల్ గా మన కుర్రాడే అనేలా అక్కడి కట్టు బొట్టు తో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం దీనినే మాస్ అంటు మన హీరోలు ప్రేక్షకుల మన్ననలను పొందుతున్నారు. ఏది ఏమైనా కూడా రూరల్ బ్యాక్ డ్రాప్ లో కనిపించే ప్రతి హీరో భారీ ఎమోషన్స్ ను పండిస్తూ ఎలివేషన్స్ తో ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటున్నాడు.
ఈ మధ్యకాలంలో మాస్ అంటే ఇదే అంటూ మన హీరోలు మాస్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు... ఏదేమైనా కూడా మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ హీరోలందరు వాళ్ళకంటూ ఒక ఓన్ స్టైల్ ను క్రియేట్ చేసుకుంటు కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంటున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మాస్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతుంది. కమర్షియల్ హంగులతోనే సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళుతున్న మన దర్శకులు మాస్ ఎలిమెంట్స్ ను నెక్స్ట్ లెవెల్లో చూపిస్తూ ఎమోషన్ ను ప్రతి ప్రేక్షకుడి మనసుకు తట్టేలా సినిమాలను తీస్తున్నారు. దానివల్ల ప్రతి ఒక్కరు ఆ క్యారెక్టర్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక హీరోలు సైతం మాస్ క్యారెక్టర్ లను పోషించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటం విశేషం...
టైర్ వన్ హీరోలందరు మాస్ హీరోలే కావడం వల్ల వాళ్ల సినిమాలకి ఎక్కువగా కలెక్షన్స్ అయితే దక్కుతున్నాయి. ఇక భారీ ఓపెనింగ్స్ ను సైతం కొల్లగొడుతున్న మన హీరోలు రాబోయే రోజుల్లో మరిన్ని డిఫరెంట్ సినిమాలు, విజువల్ వండర్స్ లో నటిస్తూ ప్రేక్షకులందరిని మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ట్రెండుకు తగ్గట్టుగా సినిమాలను చేస్తూ ప్రతి క్యారెక్టర్ లో వాళ్లకు అంటూ ఒక ఓన్ స్టైల్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. అందువల్లే ఈరోజు స్టార్ హీరోలందరు ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకోగలిగారు...