• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సృజనాత్మక స్వేచ్ఛకు...

సృజనాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు!

| సెన్సార్ బోర్డు కొత్త నిబంధనలపై మాలీవుడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టైటిళ్ల విషయంలో బోర్డు జోక్యం సృజనాత్మక స్వేచ్ఛను హరించడమేనని కేరళ సినీ సంఘాలు మండిపడ్డాయి. నిబంధనలను వెనక్కి తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించాయి. ఈ వివాదంలో ఇతర సినీ పరిశ్రమలు కూడా మద్దతుగా నిలుస్తాయా అన్న చర్చ మొదలైంది.

By - Srikanth Kontham
Update: 2026-11-13 11:36 GMT

ఇటీవ‌లే సీబీఎఫ్ సీ చిత్ర పరిశ్రమపై కఠినమైన నిబంధనలు అమలులోకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమాల విడుదల తేదీలు .. టైటిళ్లను ప్రచార హోరును బట్టి ఫైనల్ చేయడానికి వీల్లేదని సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అవి ఎప్పుడైనా మారొచ్చ‌ని కొత్త నిబంధనలొచ్చాయి. కంటెంట్‌తో పాటు టైటిల్స్ .. రిలీజ్ డేట్లపై కూడా బోర్డు పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తుంద‌ని..ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ఎంత మాత్రం స‌హేతుకం కాద‌ని అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త కూడా వ్య‌క్త‌మ‌వుతోంది.

తాజాగా మాలీవుడ్ పరిశ్రమ మరోసారి సెన్సార్ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టైటిళ్ల విషయంలో సెన్సార్ బోర్డు కొత్తగా జారీ చేసిన నిబంధనలను అనవసరమైనవిగా అభివ‌ర్ణించింది. దీనిపై సినీ సంఘాలు న్యాయపోరాటం చేస్తాయ‌ని హెచ్చరించాయి. టైటిల్స్ విష‌యంలో జోక్యం చేసుకోవడం సృజనాత్మక స్వేచ్ఛను హరించడమేనని కేర‌ళ బోర్డు గ‌ట్టిగా వాదిస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం సినిమా కంటెంట్ మాత్రమే కాకుండా టైటిల్స్ కూడా త‌మ పరిశీలన పరిధిలోకి రావాలని సెన్సార్ బోర్డు పట్టుబడుతుండటమే.

ఈ కొత్త విధానంతో నిర్మాతల స్వేచ్ఛను అణచి వేయాలని చూస్తున్నారని సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. నిబంధనల పేరుతో సెన్సార్ బోర్డు అధికారాలను దుర్వినియోగం చేస్తోందని..దీనివల్ల నిర్మాణ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేరళకు చలనచిత్ర సంఘాలు అత్యవసర సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించాయి. సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వెనక్కి త‌గ్గ‌ని పక్షంలో కోర్టును ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసాయి.

ఆర్టిస్టుల హక్కులను కాపాడుకునేందుకు చట్టపరమైన పోరాటం ఒక్కటే మార్గమని భావిస్తున్నారు. సినిమా టైటిల్ అనేది దర్శకుడి ఆలోచనకు, సృజనాత్మకతకు అద్దం పడుతుందని దానిపై కూడా ఆంక్షలు విధించడం సరికాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో భావప్రకటన స్వేచ్ఛకు ఇది విఘాతమని పలువురు ప్రముఖులు భావిస్తున్నారు. ఇప్పటికే అనేక వివాదాలతో సతమతమవుతున్న చిత్ర పరిశ్రమకు ఈ కొత్త నిబంధనలు మరింత భారంగా మారే అవకాశం ఉందంటున్నారు.

కేరళ సంఘాల హెచ్చరిక దేశవ్యాప్తంగా ఇతర చలనచిత్ర పరిశ్రమల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. మాలీవుడ్ కు తోడుగా కోలీవుడ్..శాండిల్ వుడ్...టాలీవుడ్ కూడా తోడైతే? ఈ వివాదం మ‌రింత తీవ్ర రూపం దాల్చుతుంది. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే ప్ర‌భుత్వం సెల‌బ్రిటీల‌తో అత్యంత స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప‌రిశ్ర‌మ‌లో పెద్ద స్టార్ల‌ను టార్గెట్ చేసి వారితో మాట మంతి చేయ‌డం వంటి వ్య‌వ‌హారాలు నెరుపుతుంది. ఈ వివాదంలోకి నేరుగా హీరోలే రంగంలోకి దిగితే కేంద్రం వెన‌క్కి త‌గ్గే అవ‌కాశం ఉంద‌నే ప్రచారం మ‌రోవైపు జ‌రుగుతోంది.

Tags:    
  • cbfc 
  • mollywood 
  • tollywood 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS