• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  100 అడుగుల క్రేన్ ప్రమాదం...

100 అడుగుల క్రేన్ ప్రమాదం నుంచి కాపాడిన అదృశ్య హస్తం!

| ‘ఇండియన్ 2’ షూటింగ్‌లో జరిగిన క్రేన్ ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డానని కాజల్ అగర్వాల్ వెల్లడించారు. 2020లో చెన్నైలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది మరణించగా, ప్రమాదానికి క్షణాల ముందు తాను ఒక్క అడుగు వెనక్కి వేయడంతో క్రేన్ తనపై పడలేదని గుర్తుచేసుకున్నారు. ఈ అనుభవం జీవితంపై తన దృక్పథాన్ని మార్చిందని తెలిపారు.

By - Srikanth Kontham
Update: 2026-11-13 12:30 GMT

అప్పుడ‌ప్పుడు సెట్స్ లో అనుకోని ప్ర‌మాదాలు చోటుచేసుకుంటాయి. కొన్నిసార్లు అవి ప్రాణాల మీద‌కు సైతం వ‌స్తుంటాయి. తాజాగా చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ విష‌యంలో అలాంటి ఘ‌ట‌న ఒక‌టి చోటు చేసుకుంద‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే.. కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన `ఇండియన్ 2`షూటింగ్ సమయంలో చోటు చేసుకున్న ఓ ఘోర క్రేన్ ప్రమాదం నుంచి కాజ‌ల్ తృటిలో ప్రాణాలతో బయటపడిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.

2020లో చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో `ఇండియన్ 2` షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ పెను విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో ముగ్గురు చిత్ర యూనిట్ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సరిగ్గా ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు కాజ‌ల్...కమల్ హాసన్ ఆ క్రేన్ కిందే నిలబడి ఉన్నామని అయితే ఏదో తెలియని శక్తి తనను వెనక్కి లాగినట్లు అనిపించిందని కాజల్ వివరించారు. ఆ క్షణంలో తాను ఒక్క అడుగు వెనక్కి వేయడం వల్లే భారీ క్రేన్ తనపై పడకుండా పక్కనే కుప్పకూలిందన్నారు.

కళ్ల ముందే అంత పెద్ద ప్రమాదం జరగడం.. సహచర సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భయానక దృశ్యాలు ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయ న్నారు. ఆ ఘటన తర్వాత జీవితం పట్ల తన దృక్పథమే పూర్తిగా మారిపోయిందన్నారు. ఆ ప్రమాదం తనకు ఓ పునర్జన్మ లాంటిదని.. దేవుడి దయ వల్లే ఆ రోజు క్షేమంగా బయట పడగలిగానని కాజల్ ఎమోష‌న‌ల్ అయ్యారు.

ప్రతి క్షణాన్ని ఎంతో విలువైనదిగా భావించాలని.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని ఆ ఘటన తనకు గొప్ప జీవిత పాఠాన్ని నేర్పిందన్నారు. ఆ చేదు జ్ఞాపకం నుంచి కోలు కోవడానికి చాలా సమయం పట్టిందని వెల్లడించారు. అయితే ఈ విష‌యాన్ని కాజ‌ల్ ఇంత‌కాలం దాచి పెట్ట‌డం వెనుక అభిమానుల ఆందోళ‌న ఉంటుంద‌ని గుర్తించింది. తృటిలో కాజ‌ల్ ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకుంద‌ని తెలిస్తే? మీడియాలో ర‌క‌ర‌కాల ప్ర‌చారాల‌కు అవ‌కాశం ఉంటుంది. ఘ‌ట‌న మ‌రింత హైలైట్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో కాజ‌ల్ ఈ విష‌యాన్ని ఇంత వ‌ర‌కూ ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు.

ఇక కాజ‌ల్ తెలుగు సినిమాల విష‌యానికి వ‌స్తే న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న `దాదా` సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వివాహం అనంత‌రం అమ్మ‌గా మారినా కాజ‌ల్ ఇప్ప‌టికీ అవ‌కాశాల‌తో ప‌రిశ్ర‌మ‌లో మెరుస్తోంది.

Tags:    
  • kajalaggarwal 
  • indian2 
  • kamalhaasan 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS