తెలుగు సినిమా మార్కెట్ ఎంత? పాన్ ఇండియాలో మన స్టార్ హీరోల కలెక్షన్స్ ఎంత?

తెలుగు సినిమా ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. పాన్ ఇండియాలో మన స్టార్ హీరోలు క్రియేట్ చేస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు.

Update: 2026-09-26 17:30 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. పాన్ ఇండియాలో మన స్టార్ హీరోలు క్రియేట్ చేస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. 'బాహుబలి' సినిమాతో 1800 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టారు. 'పుష్ప 2' సినిమా 1900 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాగా పుష్ప 2 నిలిచింది. పాన్ ఇండియా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతుండటం విశేషం... మన స్టార్ హీరోలు 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం రాబోతున్న సినిమాలతో వాళ్ళ స్టామినాయేంటో ప్రూవ్ చేసుకోవడానికి ప్రతి హీరో తనదైన రీతిలో కష్టపడుతున్నాడు. టైర్ వన్ హీరోల విషయానికి వస్తే వందల కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు.

ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాలు మనవాళ్ళను టాప్ పొజిషన్ కి తీసుకెళ్ళాయి. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన తమకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడంలో మన వాళ్ళు కీలకపాత్ర వహిస్తున్నారు. బాలీవుడ్ హీరోలను సైతం పక్కన పెడుతూ మన స్టార్ హీరోలు నెంబర్ వన్ పొజిషన్ ను కైవసం చేసుకోవడానికి ముందుకు దూసుకెళ్తుండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి... ప్రస్తుతం ప్రభాస్ 2000 కోట్ల మార్కును ఈజీగా దాటగలడనే ఒక పేరు ను సంపాదించుకున్నాడు.

సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో చేస్తున్న 'స్పిరిట్' సినిమాతో ఈ ఫీట్ ని ఈజీగా సాధిస్తాడు. అల్లు అర్జున్ సైతం 'పుష్ప 2' సినిమాతో పెను సంచలనాలను క్రియేట్ చేశాడు. కాబట్టి 'రాకా' సినిమాతో మరింత ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. రామ్ చరణ్ సుకుమార్ తో చేయబోయే సినిమా సైతం 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబడుతుందనే అంచనాలైతే ఉన్నాయి. మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను ఈజీగా రాబడుతుంది. నిజానికి ఈ సినిమా 1600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా దాదాపు 3,000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి...

జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న 'డ్రాగన్' సినిమా సైతం 2000 కోట్ల మార్కును టార్గెట్ గా పెట్టుకొని తెరకెక్కుతూ ఉండడం విశేషం... కలెక్షన్ల విషయంలో ఎన్టీఆర్ కొత్త రికార్డులను క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరోలందరు వాళ్ల సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి ప్రతి ఒక్కరు 2000 కోట్ల మార్క్ ను అందుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక సంవత్సరంలోనే దాదాపు పదివేల కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఇండస్ట్రీ గా మారుతుంది. కాబట్టి ప్రతి హీరో కూడా రాబోయే సినిమాలతో ఎలాగైనా సరే పాన్ ఇండియా ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది...

Tags:    

Similar News