• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  OTT - Streaming Apps >  Bigg Boss Telugu 10:...

Bigg Boss Telugu 10: హౌస్‌లో శివ - ప్రియాంక జైన్ గ్రాండ్ ఎంగేజ్‌మెంట్!

| బిగ్‌బాస్ తెలుగు 10 ఫ్యామిలీ వీక్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శివ కోసం హౌస్‌లోకి వచ్చిన ఆయన ప్రియురాలు, నటి ప్రియాంక జైన్.. అందరి సమక్షంలో నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో హౌస్‌లో ఎంగేజ్‌మెంట్ వేడుక జరిగింది. అయితే గతంలోనూ వీరిద్దరూ ఇతర షోల్లో ఇలాంటి వేడుకలు చేసుకోవడంతో సోషల్ మీడియాలో కొందరు క్రింజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-12 03:25 GMT

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 పదవ వారంలో జరుగుతున్న 'ఫ్యామిలీ వీక్' ఎపిసోడ్‌లు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. అయితే ఈ వారం హౌస్‌లో జరిగిన ఒక ఊహించని సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్ హిస్టరీలోనే ఏ భాషలోనూ జరగని విధంగా.. తొలిసారిగా ఒక కంటెస్టెంట్ తన ప్రియురాలితో బిగ్‌బాస్ హౌస్‌లోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఈ విషయం మీద ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా రచ్చ జరుగుతుంది.

ఫ్యామిలీ వీక్‌లో భాగంగా శివ కోసం ఆయన ప్రియురాలైన ప్రముఖ నటి ప్రియాంక జైన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. శివ కోసం ప్రత్యేకంగా కొత్త బట్టలు తీసుకువచ్చిన ప్రియాంక, అవి వేసుకోమని చెప్పి, అందరి సమక్షంలో నిశ్చితార్థం జరుగుతోంది అంటూ సంతోషంగా ప్రకటించింది. ఈ వేడుక కోసం బిగ్‌బాస్ టీమ్ కూడా అన్ని ఏర్పాట్లు చేయగా, హౌస్‌మేట్స్ అందరూ పెళ్లి పెద్దలలా వ్యవహరించి ఈ వేడుకను అద్భుతంగా జరిపించారు.

గత కొద్ది సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న శివ మరియు ప్రియాంక జైన్.. గతంలో 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షోలోనూ పాల్గొని తమ పెళ్లి గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు అనుకోకుండా బిగ్‌బాస్ హౌస్ వేదికగా వారి ప్రేమ పెళ్లి దిశగా అడుగులు వేసింది. ఎంగేజ్‌మెంట్ తర్వాత ఇద్దరూ కలిసి బిగ్‌బాస్ హౌస్‌లోకి కుడికాలు పెట్టి అడుగుపెట్టారు. అప్పుడు శివ నవ్వుతూ.. "నా కాబోయే భార్యతో కలిసి హౌస్‌లోకి వస్తున్నాను" అని చెప్పగా, ప్రియాంక జైన్ తన పేరు చెబుతూ ముద్దుగా సిగ్గుపడింది.

అయితే ఇంతకు ముందు కూడా వాళ్ళు వేరే షోస్ లో, ఈవెంట్స్లో ఇలా ఎంగేజ్మెంట్, పెళ్లి చేసుకున్నారు. అందుకే చాలా మంది ఇదేమి కొత్త కాదు అని క్రింజ్ అని కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా, శివకి ప్రియాంక బోలెడన్ని హింట్స్ ఇవ్వడంతో అతని ఆట ఎలా మారబోతుందనే ఆసక్తి పెరుగుతుంది.

Tags:    
  • biggbosstelugu10 
  • biggboss10 
  • shivabiggBoss 
  • priyankajain 

Similar News

ఓటీటీలో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ'.. అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన!

2026-11-19 03:47 GMT

మెగాస్టార్ 'మెగావర్స్'లో తమిళ్ మెగా బ్రదర్..!

2026-11-17 05:38 GMT

ఈవారం ఓటీటీ ప్రియులకి అసలైన మజా.. అలరించబోతున్న చిత్రాలు, సిరీస్ లివే!

2026-11-17 04:41 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల చేతిలో నామినేషన్స్!

2026-11-17 04:06 GMT

డార్లింగ్ తో మెగాస్టార్.. ఇక రికార్డులు షురూ..!

2026-11-17 04:05 GMT

Bigg Boss Telugu 10: వైల్డ్‌కార్డ్ కాకపోయి ఉంటే శ్వేత నాయుడు ఎలిమినేట్ అయ్యేది కాదా?

2026-11-16 04:10 GMT

Bigg Boss Telugu 10: పంచ్‌ల వర్షం కురిపించిన హైపర్ ఆది!

2026-11-16 04:09 GMT

'రామాయ‌ణం' ఓటీటీ హక్కులు ఇంకా అమ్ముడుకాని కారణం?

2026-11-15 20:52 GMT

చిరు టాక్‌ షో.. సెకండ్‌ ఎపిసోడ్‌ వీళ్లతోనే!

2026-11-14 16:26 GMT

Bigg Boss Telugu 10: పదవ వారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ.. డబుల్ ఎలిమినేషన్ గండంలో ఉన్నదెవరు?

2026-11-14 03:39 GMT

Bigg Boss Telugu 10: కుటుంబాల ఎంట్రీ తర్వాత కెప్టెన్సీ టాస్క్ రగడ!

2026-11-14 03:30 GMT

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

2026-11-13 16:37 GMT

Copyright @2026

Powered by Blink CMS