• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  OTT - Streaming Apps >  ఈవారం ఓటీటీ ప్రియులకి...

ఈవారం ఓటీటీ ప్రియులకి అసలైన మజా.. అలరించబోతున్న చిత్రాలు, సిరీస్ లివే!

| ఈ వారం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో 20కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలకు సిద్ధమయ్యాయి. ఆహాలో అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘క్రేజీ కళ్యాణం’ నవంబర్ 20న రానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘418’, ‘హైకూ’, అమెజాన్ ప్రైమ్‌లో ‘కరేజ్’, సోనీ లివ్‌లో ‘అన్బిల్ అవన్’, సన్ నెక్స్ట్‌లో ‘అనుమాన పక్షి’ స్ట్రీమింగ్ కానున్నాయి.

By - Madhu Reddy
Update: 2026-11-17 04:41 GMT

శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్లలో ఏ ఏ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి అనే ఆసక్తి సినిమా లవర్స్ కు ఏ విధంగా ఉంటుందో.. ఇటు ఓటీటీలలో విడుదలయ్యే చిత్రాల కోసం కూడా ఓటీటీ ఆడియన్స్ అంతే ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించడానికి నెట్ ఫ్లిక్స్ మొదలుకొని సోనీ లివ్ వరకు దాదాపు 20కి పైగా చిత్రాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాయి. మరి ఈ వారం ఓటీటీలో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైన చిత్రాలు, సిరీస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

అమెజాన్ ప్రైమ్ లో సిరీస్ ల సందడి..

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ లో ఈసారి సిరీస్ లు,సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే ఇంగ్లీష్ సినిమా 'ది ఒడిస్సీ' నవంబర్ 17 నుండి రెంటెడ్ పద్ధతిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే మరో హిందీ మూవీ 'కరేజ్" నవంబర్ 18న ఓటిటి స్ట్రీమింగ్ కి రాబోతోంది. అలాగే హిందీ సిరీస్ 'క్యాంపస్ డైరీస్ సీజన్ 2' నవంబర్ 18న ఓటిటి స్ట్రీమింగ్ కి వస్తుండగా..

' మాడ్డెన్' అనే ఇంగ్లీషు సిరీస్ నవంబర్ 18 నుండి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతుంది. వీటితోపాటు స్పానిష్ సిరీస్ 'పర్ఫెక్ట్ లయర్స్' నవంబర్ 20న స్ట్రీమింగ్ కి రాబోతోంది.

ఆహా..

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో, తరుణ్ భాస్కర్ కీలకపాత్ర పోషించిన 'క్రేజీ కళ్యాణం' ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్ఫామ్ ఆహా వేదికగా నవంబర్ 20న అందుబాటులోకి రానుంది.

నెట్ ఫ్లిక్స్ లో మూవీ మజా..

ఇంగ్లీష్ సిరీస్' గార్డింగ్ స్టార్స్' నవంబర్ 18న స్ట్రీమింగ్ కి వస్తుండగా.. పోలిష్ సిరీస్ 'ద లా ఆఫ్ బీస్ట్స్' నవంబర్ 18న స్ట్రీమింగ్ కి రానుంది. అలాగే ఇంగ్లీష్ సిరీస్ 'ది అల్ట్రూయిస్ట్' నవంబర్ 19న స్ట్రీమింగ్ కి రానుండగా.. ప్రశాంత నీల్ మూవీ '418' నవంబర్ 20న ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతోంది. అలాగే కోర్టు మూవీ బ్యూటీ శ్రీదేవి ఆపళ్ల తమిళ్లో నటించిన తొలి చిత్రం 'హైకూ 'తెలుగు డబ్బింగ్ కూడా నవంబర్ 20న స్ట్రీమింగ్ కి రానుంది . అలాగే హిందీ సిరీస్ 'దిండోరా సీజన్ 2' నవంబర్ 20 నుండి ఓటీటీలో

స్ట్రీమింగ్ కి రానుండగా కొరియన్ సిరీస్ 'ది బ్లూ రోడ్' కూడా నవంబర్ 20న అందుబాటులోకి రానుంది.

జియో హాట్ స్టార్ వేదికగా తెలుగు డబ్బింగ్ సిరీస్ 'మిస్టర్ అండ్ మిసెస్ ఆఫీస్' నవంబర్ 18న అందుబాటులోకి రానుండగా.. హిందీ సిరీస్ క్వీన్ నవంబర్ 16 నుండి స్ట్రీమింగ్ కి రాబోతోంది. అలాగే ఆపిల్ టీవీ ప్లస్ లో ఇంగ్లీష్ మూవీ' వే ఆఫ్ ది వారియర్ కిడ్' అనే చిత్రం నవంబర్ 20న స్ట్రీమింగ్ కి రానుంది. వీటితోపాటు సోనీ లీవ్ లో తెలుగు డబ్బింగ్ మూవీ 'అన్బిల్ అవన్' నవంబర్ 20న ఓటీటీ స్ట్రీమింగ్ కి రానుండగా.. 'అనుమాన పక్షి' అనే తెలుగు చిత్రం నవంబర్ 20న సన్ నెక్స్ట్ వేదికగా స్ట్రీమింగ్ కి రాబోతోంది.. అలాగే జి ఫైవ్ వేదికగా హిందీ సీరీస్ మూవీ 'టీన్ టిగడా' నవంబర్ 20న ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతోంది.

Tags:    
  • ottreleases 
  • ottmovies 
  • webseries 
  • netflix 
  • amazonprimevideo 
  • aha 

Similar News

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల చేతిలో నామినేషన్స్!

2026-11-17 04:06 GMT

డార్లింగ్ తో మెగాస్టార్.. ఇక రికార్డులు షురూ..!

2026-11-17 04:05 GMT

Bigg Boss Telugu 10: వైల్డ్‌కార్డ్ కాకపోయి ఉంటే శ్వేత నాయుడు ఎలిమినేట్ అయ్యేది కాదా?

2026-11-16 04:10 GMT

Bigg Boss Telugu 10: పంచ్‌ల వర్షం కురిపించిన హైపర్ ఆది!

2026-11-16 04:09 GMT

'రామాయ‌ణం' ఓటీటీ హక్కులు ఇంకా అమ్ముడుకాని కారణం?

2026-11-15 20:52 GMT

చిరు టాక్‌ షో.. సెకండ్‌ ఎపిసోడ్‌ వీళ్లతోనే!

2026-11-14 16:26 GMT

Bigg Boss Telugu 10: పదవ వారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ.. డబుల్ ఎలిమినేషన్ గండంలో ఉన్నదెవరు?

2026-11-14 03:39 GMT

Bigg Boss Telugu 10: కుటుంబాల ఎంట్రీ తర్వాత కెప్టెన్సీ టాస్క్ రగడ!

2026-11-14 03:30 GMT

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

2026-11-13 16:37 GMT

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

Bigg Boss Telugu 10: దేబ్జానీకి, సుధీర్ కి అదిరిపోయే హింట్స్!

2026-11-13 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS