• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  OTT - Streaming Apps >  Bigg Boss Telugu 10:...

Bigg Boss Telugu 10: పంచ్‌ల వర్షం కురిపించిన హైపర్ ఆది!

| బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 పదో వారంలో హైపర్ ఆది ఎంట్రీతో హౌస్‌లో నవ్వులు విరిశాయి. నాగార్జునతో పాటు త్రిగుణ్, ముఖేష్, వర్షిణి, నరేష్, అమన్, శివ, రామకృష్ణ ఆటతీరుపై తనదైన శైలిలో పంచులు, సెటైర్లు వేశాడు. ముఖ్యంగా త్రిగుణ్ ప్లానింగ్, ముఖేష్-వర్షిణి ట్రాక్, శివ ఓవర్ కాన్ఫిడెన్స్‌పై ఆది చేసిన కామెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-16 04:09 GMT

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో పదవ వారానికి సంబంధించి ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది ఎంట్రీ హౌస్‌లో నవ్వుల పువ్వులు పూయించింది. ప్రతీ ఏడాది లాగీ ఈ సారి కూడా ఆది స్టేజ్‌పైకి రాగానే తనదైన శైలిలో కంటెస్టెంట్లందరినీ ఆటపట్టిస్తూ వేసిన పంచ్‌లు, ఇచ్చిన ఇంపుట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నాగార్జున నుంచి ప్రతి ఒక్కరి గేమ్ వరకు ఆది వదిలిన సెటైర్లు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి.

స్టేజ్‌పైకి రాగానే బ్యూటీ కాన్సెప్ట్‌ను పట్టుకున్నాడు ఆది. "అసలు అందం మీద కనుక జీఎస్టీ విధిస్తే.. అందరికంటే ఎక్కువగా నాగ్ సర్ కట్టాలి. నేను అందరికంటే తక్కువ కడతాను, రామ్‌ప్రసాద్ అసలు కట్టడు.” అంటూ తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు.

త్రిగుణ్‌ను ఉద్దేశించి ఆది మాట్లాడుతూ.. "ఎవరైనా నీకు ఎదురువచ్చినా, నువ్వే ఎదురువెళ్లినా నువ్వే వాళ్లకు రిస్క్. ఎవరినీ వదలడం లేదు. నక్క అంటావు, కప్ప అంటావు.. ఎప్పుడు ఆడతావో, ఎవరిపై పడతావో నీకే అర్థం కాదు. అసలు గూగుల్‌లో గతంలో త్రిగుణ్ అని టైప్ చేస్తే హీరో వచ్చేవాడు, ఇప్పుడు ఏమేమో వస్తున్నాయి. గూగుల్‌ను కూడా మానిప్యులేట్ చేస్తున్నావు!" అంటూ త్రిగుణ్ ప్లానింగ్స్‌ను ఎత్తి చూపాడు.

ముఖేష్, వర్షిణిల ట్రాక్‌పై ఆది మాట్లాడుతూ.. "ఈ పదవ సీజన్ గేమ్‌లో సవాలు కాదు, మీ ఇద్దరికీ మీరే ఒక సవాలు.” అని చెప్పాడు.

నరేష్ ఆటను ప్రశంసిస్తూనే సెటైర్లు వేశాడు ఆది. "నీ ఆట, మాట, కాన్ఫిడెన్స్‌కు హ్యాట్సాఫ్. సుధీర్, ముఖేష్‌లను మోటివేట్ చేస్తున్నావు. బస్తా టాస్క్‌లో కేజీ బరువు మోశావు. ఎత్తుకు తగ్గ ఆట ఆడకుండా ఏకంగా నాగార్జున ఎత్తులో ఆడుతున్నావు" అన్నాడు.

“బీపీకి మిషన్ పెడితే పేలిపోతుంది. మన్మథుడు సినిమాలో నాగ్ లాగా ఉంటానని ఫిక్స్ అయ్యావు, కానీ రక్షకుడు సినిమాలో నాగ్ లాగా నరాలు తెగేలా కోపం చూపిస్తున్నావు." అని అమన్ గురించి చెప్పాడు.

"బయట అంతా చూసొచ్చావు, చివరకు త్రిగుణ్ చేతిలో మళ్ళీ మేక అయిపోయావు. ఓవర్‌కాన్ఫిడెన్స్ కాస్త తగ్గేలా చూసుకో." అని శివ గురించి చెప్పాడు.

"నువ్వు కప్ కోసం వచ్చినట్లు లేదు, ట్రిప్‌కి వచ్చినట్లున్నావు. టీవీల్లో నిన్ను చూస్తుంటే హౌస్‌లో పక్కన కూర్చుని చూస్తున్నట్టే ఉంది. కొంచెం నవసాల్లో జ్యూస్ చూపించు లేదంటే బోర్ కొడుతుంది." అని రామకృష్ణ గురించి చెప్పాడు ఆది.

మొత్తానికి హైపర్ ఆది ఎంట్రీతో హౌస్‌మేట్స్‌లో ఉన్న టెన్షన్ ఒక్కసారిగా మాయమై, నవ్వుల వాతావరణం నెలకొంది. కంటెస్టెంట్ల తప్పులను అద్దం పట్టినట్లు ఆది చెప్పిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది!

Tags:    
  • biggbosstelugu10 
  • hyperadi 
  • nagarjuna 
  • trigun 
  • biggbosstelugu 

Similar News

Bigg Boss Telugu 10: వైల్డ్‌కార్డ్ కాకపోయి ఉంటే శ్వేత నాయుడు ఎలిమినేట్ అయ్యేది కాదా?

2026-11-16 04:10 GMT

'రామాయ‌ణం' ఓటీటీ హక్కులు ఇంకా అమ్ముడుకాని కారణం?

2026-11-15 20:52 GMT

చిరు టాక్‌ షో.. సెకండ్‌ ఎపిసోడ్‌ వీళ్లతోనే!

2026-11-14 16:26 GMT

Bigg Boss Telugu 10: పదవ వారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ.. డబుల్ ఎలిమినేషన్ గండంలో ఉన్నదెవరు?

2026-11-14 03:39 GMT

Bigg Boss Telugu 10: కుటుంబాల ఎంట్రీ తర్వాత కెప్టెన్సీ టాస్క్ రగడ!

2026-11-14 03:30 GMT

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

2026-11-13 16:37 GMT

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

Bigg Boss Telugu 10: దేబ్జానీకి, సుధీర్ కి అదిరిపోయే హింట్స్!

2026-11-13 04:06 GMT

సైలెంట్ గా అర్ధరాత్రి ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ మూవీ!

2026-11-12 03:31 GMT

Bigg Boss Telugu 10: హౌస్‌లో శివ - ప్రియాంక జైన్ గ్రాండ్ ఎంగేజ్‌మెంట్!

2026-11-12 03:25 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ కి బూస్ట్ ఇచ్చే ఎపిసోడ్ పడింది కదా!

2026-11-12 03:23 GMT

Copyright @2026

Powered by Blink CMS