• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  OTT - Streaming Apps >  సైలెంట్ గా అర్ధరాత్రి...

సైలెంట్ గా అర్ధరాత్రి ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ మూవీ!

| సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్ 2' నవంబర్ 12 అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ 15న విడుదలైన ఈ సినిమా 27 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.831 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు కథనం పేర్కొంది.

By - Madhu Reddy
Update: 2026-11-12 03:31 GMT

థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్నో చిత్రాలు థియేటర్ రన్ పూర్తి చేసుకొని.. ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కి వస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని చిత్రాలు థియేటర్లలో విడుదలైన నెలలోపే ఓటీటీ స్ట్రీమింగ్ కి వస్తే.. మరికొన్ని కాస్త ఆలస్యంగానే ఆడియన్స్ ను అలరించడానికి సిద్ధమవుతూ ఉంటాయి. అయితే మరికొన్ని ముందుగానే అభిమానులకు అధికారికంగా ప్రకటించి ఓటీటీ స్ట్రీమింగ్ కి వస్తే.. ఇంకొన్ని ఎటువంటి హడావుడి లేకుండా అర్ధరాత్రిళ్లు స్ట్రీమింగ్ కి వస్తూ ఉంటాయి. అలాంటి చిత్రాలలో సూపర్ స్టార్ చిత్రం కూడా ఒకటి. సైలెంట్ గా అర్ధరాత్రి నుండి ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

అదేదో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2. అక్టోబర్ 15వ తేదీన థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా.. ప్రకటించినట్టుగానే నవంబర్ 12వ తేదీ నుండి అర్ధరాత్రి ఓటీటీ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం , కన్నడ భాషలలో అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తానికి అయితే నవంబర్ 12 నుండి ఓటీటీ స్ట్రీమింగ్ కి వస్తుందని అమెజాన్ ప్రకటించినట్టుగానే.. అర్ధరాత్రి నుండే ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ తీసుకురావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇటు ఓటిటిలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.

జైలర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలై 27 రోజుల్లోనే సుమారుగా రూ.831 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇండియా వ్యాప్తంగా రూ.470 కోట్ల నెట్ కలెక్షన్ వసూలు చేయగా.. రూ .556 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాకి సుమారుగా రూ.350 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఇక ఓవరాల్ గా చూసుకుంటే.. సుమారుగా రూ.120 కోట్లకు పైగా ఆదాయం లభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ మైలురాయి అత్యధిక గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిన ఆరవ చిత్రంగా సౌత్ ఇండియాలో నిలవగా.. అటు తమిళ్ మూవీలలో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన మొదటి సినిమాగా ఆల్ టైం రికార్డు సృష్టించింది.

జైలర్ 2 చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ రచన, దర్శకత్వం వహించారు. తమిళ్ యాక్షన్ కామెడీ చిత్రంగా విడుదలైన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. ఇందులో రజనీకాంత్ ,రమ్యకృష్ణ, యోగి బాబు, రిత్విక్ తమ మునుపటి పాత్రలనే తిరిగి పోషించగా.. ఎస్ జె సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్ , సూరజ్ వెంజరమూడు లాంటి తారాగణాన్ని ఈ రెండవ భాగంలో జోడించారు. మొదటి భాగానికి గా సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంలో మోహన్ లాల్ , శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్ , జాకీశ్రాఫ్ , విజయ్ సేతుపతి లాంటి భారీ తారాగణం అతిథి పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. మొదటి భాగంలో తమన్నా స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకోగా.. రెండవ భాగంలో పూర్ణ తన పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది.

Tags:    
  • jailer2 
  • rajinikanth 
  • jailer2ott 
  • amazonprimevideo 

Similar News

Bigg Boss Telugu 10: హౌస్‌లో శివ - ప్రియాంక జైన్ గ్రాండ్ ఎంగేజ్‌మెంట్!

2026-11-12 03:25 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ కి బూస్ట్ ఇచ్చే ఎపిసోడ్ పడింది కదా!

2026-11-12 03:23 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

Bigg Boss Telugu: నామినేషన్స్ లో బిగ్‌ బాస్ అదిరిపోయే ట్విస్ట్!

2026-11-10 03:47 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు కొత్త చిక్కు.. స్క్రిప్ట్ దశలోనే చట్టం తెలియ‌క‌పోతే!

2026-11-07 00:30 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

Copyright @2026

Powered by Blink CMS