• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  OTT - Streaming Apps >  9వ వారం ఎలిమినేషన్...

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

| బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 తొమ్మిదో వారం 10 మంది కంటెస్టెంట్లు నామినేషన్లలో ఉన్నారు. ముఖేష్ గౌడ టాప్‌లో ఉండగా, వర్షిణి, నీతూ మాస్టర్, శివకుమార్, సుధీర్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీపావళి సందర్భంగా ఈ వారం ఎలిమినేషన్ రద్దు చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే డేంజర్ జోన్‌లో ఉన్నవారికి ఊరట లభించనుంది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-08 04:43 GMT

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 ప్రస్తుతం అత్యంత రసవత్తరమైన దశకు చేరుకుంది. 8వ వారంలో రోహిత్ నాయుడు షాకింగ్ ఎలిమినేషన్, ఆ తర్వాత తలెత్తిన వివాదాలు రేపిన దుమారం అంతాఇంతా కాదు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు, ఊహాగానాలు ఆసక్తికరంగా మారాయి.

ఈ 9వ వారంలో ఏకంగా 10 మంది కంటెస్టెంట్లు: రామ్ ప్రసాద్, నరేష్, అమన్, నీతూ మాస్టర్, వంశీ, ముఖేష్ గౌడ, వర్షిణి, దెబ్జానీ, శివకుమార్, సుధీర్ నామినేషన్ బరిలో నిలిచారు. వీరిలో రోహిత్ లేకపోవడం, త్రిగుణ్ నామినేషన్లలో లేకపోవడంతో ముఖేష్ గౌడ భారీ ఓట్లతో టాప్‌లో దూసుకుపోతుండగా.. త్రిగుణ్ సపోర్ట్, కెప్టెన్సీ కలిసి రావడంతో టెంపర్ వంశీ రెండో స్థానంలో నిలిచారు.

ఇక రామ్ ప్రసాద్, నరేష్, అమన్, దెబ్జానీలు సురక్షిత జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఓటింగ్ పరంగా నీతూ మాస్టర్, శివకుమార్, వర్షిణి మరియు సుధీర్‌లు అత్యంత లీస్ట్ పర్సంటేజ్‌తో డేంజర్ జోన్‌లో ఉన్నారు. గత వారం ముఖేష్ పవర్ ద్వారా తృటిలో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్న సుధీర్, ఈ వారం కూడా అతి తక్కువ ఓట్లు సాధించినప్పటికీ.. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం ఆయన సేఫ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ తొమ్మిదో వారంలో ఎలాంటి ఎలిమినేషన్ ఉండకపోవచ్చనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. రాబోయే పండగను పురస్కరించుకుని 'దీపావళి ధమాకా' ట్రీట్‌గా బిగ్‌బాస్ మేకర్స్ ఈ వారం ఎలిమినేషన్‌ను రద్దు చేసే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. డేంజర్ జోన్‌లో ఉన్న వర్షిణి, నీతూ మాస్టర్‌లకు ఇది పెద్ద ఊరట అవుతుంది.

గ్రాండ్ ఫినాలేకు కౌంట్‌డౌన్ మొదలైన తరుణంలో.. హౌస్‌లో ఇంకా చాలా మంది కంటెస్టెంట్లు మిగిలి ఉన్నారు. మధ్యలో ఇలా 'నో ఎలిమినేషన్' వీక్ కనుక వస్తే, రాబోయే రోజుల్లో హౌస్‌లోని మిగతా వారందరినీ షార్ట్‌లిస్ట్ చేయడానికి మేకర్స్ తప్పనిసరిగా మూడు సార్లు డబుల్ ఎలిమినేషన్‌లను అమలు చేయాల్సి వస్తుంది.

Tags:    
  • biggbosstelugu10 
  • biggboss10 
  • biggbosstelugu 
  • varshini 
  • mukeshgoud 

Similar News

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

Bigg Boss Telugu: నామినేషన్స్ లో బిగ్‌ బాస్ అదిరిపోయే ట్విస్ట్!

2026-11-10 03:47 GMT

ఈవారం ఓటీటీ రిలీజ్ చిత్రాలు, సిరీస్ లు ఇవే!

2026-11-09 10:42 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ల‌కు కొత్త చిక్కు.. స్క్రిప్ట్ దశలోనే చట్టం తెలియ‌క‌పోతే!

2026-11-07 00:30 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Copyright @2026

Powered by Blink CMS