• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  OTT - Streaming Apps >  Bigg Boss Telugu 10:...

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

| బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో తొమ్మిదో వారం ఆట అత్యంత ఉత్కంఠభరితంగా, ఎమోషనల్ టర్న్ తీసుకుంది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-04 18:02 GMT

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో తొమ్మిదో వారం ఆట అత్యంత ఉత్కంఠభరితంగా, ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ఈ వారం హౌస్‌లో బిగ్‌బాస్ సరికొత్త థీమ్‌గా 'రివార్డ్ అండ్ రివెంజ్' కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. దీని ప్రకారం ఈ తొమ్మిదో వారంలో జరిగే టాస్క్‌లలో గెలిచిన వారికే.. పదో వారంలో తమ కుటుంబ సభ్యులను కలుసుకునే సువర్ణావకాశం లభిస్తుంది. దీంతో కంటెస్టెంట్లు అందరూ ఫ్యామిలీని కలుసుకోవాలనే కసితో టాస్క్‌లలో హోరాహోరీగా పోరాడేందుకు సిద్ధమయ్యారు.

ఈ వీక్ ఛాలెంజెస్‌లో భాగంగా బిగ్‌బాస్ త్రిగుణ్ మరియు ముఖేష్‌లను సంచాలకులుగా నియమించారు. ఒకవైపు బాల్స్ కట్టి ఉన్న బాస్కెట్‌ను కిందకు పడేయడానికి కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు ఎక్కి ప్రయత్నించేలా టాస్క్ డిజైన్ చేశారు. ఈ గేమ్‌లో సుధీర్.. నరేష్‌ను భుజాలపై ఎత్తుకోగా, ఆర్కే.. అమన్‌ను ఎత్తుకున్నాడు.

అమన్ ఈ టాస్క్‌ను వేగంగా పూర్తి చేశాడు. అయితే ఈ విజయంపై త్రిగుణ్, ముఖేష్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. బాల్ సరిగ్గా అన్‌ర్యాప్ కాలేదని త్రిగుణ్ వాదించగా, ముఖేష్ మాత్రం వేరేలా డెసిషన్ తీసుకున్నాడు. ఇద్దరూ ఒక నిర్ణయానికి రాకపోవడంతో బిగ్‌బాస్ రంగంలోకి దిగి.. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం చెప్పకపోతే అందరూ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చివరకు త్రిగుణ్ అంగీకరించడంతో ముఖేష్ టీమ్ ఈ టాస్క్‌లో విజయం సాధించింది.

ఈ టాస్క్‌లో గెలిచిన ముఖేష్ టీమ్‌కు రివార్డ్ దక్కగా.. త్రిగుణ్ టీమ్‌పై రివెంజ్ తీర్చుకునే అవకాశం లభించింది. తమ టీమ్‌లో ఎవరికి రివార్డ్ దక్కాలనే దానిపై చర్చ జరగగా.. అందరూ కలిసి చివరికి శ్వేత నాయుడుకి ఆ ఫ్యామిలీ వీక్ రివార్డ్ దక్కాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ముఖేష్ తన చెల్లిని చూడాలని ఉందని భావోద్వేగానికి గురైనా, అందరి నిర్ణయానికి కట్టుబడ్డారు.

ఈ తొమ్మిదో వారానికి సంబంధించి హౌస్‌లో కెప్టెన్ త్రిగుణ్, ఆర్కే మరియు శ్వేత నాయుడు మినహా మిగిలిన సభ్యులందరూ నామినేషన్లలో ఉన్నారు. గడిచిన రెండు వారాలుగా డబుల్ ఎలిమినేషన్లు జరగగా.. ఈ వారం మాత్రం సింగిల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుత ఓటింగ్ మరియు సోషల్ మీడియా అంచనాల ప్రకారం.. ముఖేష్ గ్యాంగ్‌లో నుంచి ఈసారి ఒక వికెట్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యాంకర్ వర్షిణి మరియు సుధీర్ అత్యంత డేంజర్ జోన్‌లో కొనసాగుతున్నారు. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    
  • biggbosstelugu10 
  • biggbosstelugu 
  • shwethanaidu 
  • mukesh 
  • varshini 
  • sudheer 

Similar News

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

2026-11-02 06:50 GMT

బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

2026-11-02 06:50 GMT

నాగార్జున సమర్పిస్తున్న సినిమా ని బాయికాట్ చేస్తాం అంటున్న నెటిజన్లు

2026-11-01 12:04 GMT

Copyright @2026

Powered by Blink CMS