నాగార్జున సమర్పిస్తున్న సినిమా ని బాయికాట్ చేస్తాం అంటున్న నెటిజన్లు

బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్న పరిణామాలు, ఎలిమినేషన్ల తీరుపై వ్యక్తమవుతున్న నిరసన నాగార్జున కి గట్టిగా తగులుతుంది.

Update: 2026-11-01 12:04 GMT

నాగార్జున అక్కినేని సమర్పిస్తున్న తాజా తెలుగు చిత్రం ఇట్లు అర్జున. అనీష్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అనశ్వరా రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని నవంబర్ 13గా ఖరారు చేస్తూ నాగార్జున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ పోస్ట్‌కు బిగ్‌బాస్ ప్రేక్షకులు, బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిత్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత, ట్రోల్స్ ఎదురవుతున్నాయి.

బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్న పరిణామాలు, ఎలిమినేషన్ల తీరుపై వ్యక్తమవుతున్న నిరసన నాగార్జున కి గట్టిగా తగులుతుంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారంలో భాగంగా డబుల్ ఎలిమినేషన్ జరగగా.. మొదటి ఎలిమినేషన్‌గా సింగర్ ఝాన్సీ హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఇక రెండవ ఎలిమినేషన్‌గా టైటిల్ ఫెవరేట్‌గా ఉన్న రోహిత్ నాయుడు పట్నం ఎలిమినేట్ అయినట్లు వార్తలు వచ్చాయి.

హౌస్‌మేట్స్ ఓటింగ్ ఆధారంగా రోహిత్‌ను బయటకు పంపడం పట్ల ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచి టైటిల్ రేసులో దూసుకుపోతున్న రోహిత్‌కు హోస్ట్ నాగార్జున సరైన ఫీడ్‌బ్యాక్ ఇవ్వకుండా, ప్రతి వీకెండ్ నిరుత్సాహపరుస్తున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. రోహిత్ సీక్రెట్ రూమ్‌కి వెళ్లాడని తొలుత ప్రచారం జరిగినప్పటికీ, అది నిజం కాదని.. రోహిత్ నిజంగానే హౌస్ నుంచి బయటకు వచ్చేశాడని ఆయన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసారు. అయితే కొద్ది సేపటికే దాన్ని మళ్ళీ డిలీట్ చేసారు.

నాగార్జున పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రోహిత్ ఫ్యాన్స్, ఆయన ప్రెసెంట్ చేస్తున్న ఇట్లు అర్జున సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. ప్రేక్షకులు వేసే ఓట్లకు ఎలాంటి విలువ ఇవ్వకుండా, హౌస్‌మేట్స్ ఓటింగ్‌ను ప్రాతిపదికగా తీసుకుని బలమైన కంటెస్టెంట్లను కావాలనే ఎలిమినేట్ చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో చైత్ర, చరణ్, షాలినిలను సైతం ఆడియన్స్ ఓట్లు కాకుండా హౌస్‌మేట్స్ ఓటింగ్‌తోనే బయటకు పంపడాన్ని గుర్తు చేస్తున్నారు.

Tags:    

Similar News