• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  OTT - Streaming Apps >  Bigg Boss Telugu 10: ఈ...

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

| బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు, ఊహించని పరిణామాలకు కేంద్ర బిందువుగా మారింది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-03 18:23 GMT

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు, ఊహించని పరిణామాలకు కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా ముఖేష్ గౌడ హద్దులు దాటి మాట్లాడటం, తోటి కంటెస్టెంట్ దెబ్జానీపై వ్యక్తిగత విమర్శలు చేయడం హౌస్‌లో పెద్ద దుమారమే రేపింది. ఈ నామినేషన్ల తదనంతరం హౌస్‌లో ఎమోషనల్ వాతావరణం నెలకొంది. బిగ్బాస్ ఆదేశాల ప్రకారం ఇంటి సభ్యులందరూ వారి వారి కుటుంబ సభ్యుల గురించి విశేషాలు పంచుకున్నారు.

నామినేషన్ల సమయంలో ముఖేష్ కాస్తా అజాగ్రత్తగా వ్యవహరించి, నోరు జారి దెబ్జానీని వ్యక్తిగతంగా విమర్శిచాడు. ముఖేష్ చేసిన ఈ తప్పు పట్ల ఆయన సొంత గ్రూప్‌లో ఉన్న సుధీర్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. తప్పు ఎక్కడ జరిగినా నిలదీస్తానన్నట్లుగా సుధీర్ తన స్నేహితుడైన ముఖేష్‌కు వ్యతిరేకంగా మాట్లాడి, ఆయన గ్రూప్ నుంచి బయటకు వచ్చినట్లు సంకేతాలు ఇచ్చాడు.

అంతే కాకుండా ఓవర్గా మాట్లాడవద్దని ముఖేష్‌కు ఎంత చెప్పినా వినడం లేదని, అనవసరంగా రెచ్చిపోతున్నాడని నరేష్ దగ్గర సుధీర్‌ చర్చించడంతో అతను తన ఓన్ ఎలియెన్స్ ని బ్రేక్ చేసినట్లుగా కనిపిస్తుంది. మరోవైపు ముఖేష్ మాత్రం, సుధీర్ మొదటి నుంచే వ్యక్తిగతంగా ఆడతానని చెబుతున్నాడని, అతని ప్రవర్తనలో తేడా వస్తోందని వర్షిణికి వివరించాడు. అయితే నిన్న కాక మొన్న ముకేశ్ వల్లనే సుధీర్ సేవ్ అవ్వడంతో, ఇప్పుడు సుధీర్ వాళ్లకి దూరంగా ఉండటం అది సుధీర్కి కచ్చితంగా నెగటివ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇకపోతే ప్రస్తుత పరిణామాలు, సోషల్ మీడియా చర్చల ప్రకారం ఈ వారం నామినేషన్లలో ఉన్న వర్షిణి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో బిగ్‌బాస్ మేకర్స్ వివిధ సందర్భాల్లో వర్షిణిని ఎలిమినేషన్ నుంచి కాపాడుతూ వస్తున్నారనే టాక్ ఉంది. కానీ ఈసారి ఆమె ప్రవర్తన, నామినేషన్లలో ఆమెపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈసారైనా ఆమెకు ఎగ్జిట్ డోర్ పడుతుందా? లేక మేకర్స్ మళ్లీ ఏవైనా వ్యూహాలు పన్నుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ వర్షిణి ఎలిమినేట్ అవ్వని పక్షంలో కచ్చితంగా సుధీర్, నీతూ డేంజర్ జోన్లో ఉండే అవకాశం కనిపిస్తుంది.

Tags:    
  • biggbosstelugu10 
  • biggboss10 
  • mukeshgowda 
  • sudheer 
  • varshini 
  • neethu 

Similar News

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

2026-11-02 06:50 GMT

బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

2026-11-02 06:50 GMT

నాగార్జున సమర్పిస్తున్న సినిమా ని బాయికాట్ చేస్తాం అంటున్న నెటిజన్లు

2026-11-01 12:04 GMT

కీర్తి 'అక్క'.. టాక్ ఎలా ఉంది?

2026-11-01 05:14 GMT

డిజిటల్ స్పేస్‌లో బోల్డ్ స్టోరీల వెనుక లాజిక్!

2026-11-01 00:30 GMT

Bigg Boss Telugu 10: ఝాన్సీ ఎలిమినేటెడ్, సీక్రెట్ రూమ్కి రోహిత్?

2026-10-31 18:16 GMT

Copyright @2026

Powered by Blink CMS