Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్
| గత రెండు వారాలు డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో ఈ సారి మాత్రం సింగిల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందనిపిస్తుంది.
స్టార్ ప్లేయర్ రోహిత్ ఎలిమినేషన్ వివాదం తర్వాత ప్రారంభమైన ఈ 9వ వారం నామినేషన్లు హౌస్‌లో సమీకరణాలను పూర్తిగా మార్చేసేలా కనిపిస్తున్నాయి. మరి ఈ వారం ఎవరి ప్రయాణం ముగుస్తుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది! అయితే నామినేషన్స్ మాత్రం ఎప్పటి లాగా వాడీ వేడిగా సాగింది.
గత రెండు వారాలు డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో ఈ సారి మాత్రం సింగిల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందనిపిస్తుంది. ఈ తొమ్మిదవ వారంలో నామినేషన్లలో ముఖేష్ మరియు వర్షిణి ప్రధాన టార్గెట్‌గా నిలిచారు. పైగా ముకేశ్ అలియెన్స్ లో తక్కువ మంది ఉండటంతో, ఎక్కువ మంది వాళ్లనే టార్గెట్ చేసారు. దీంతో వాళ్ళకి కాస్త సింపతీ వచ్చే అవకాశం ఉంది.
గత వారం వర్షిణి అండ్ బ్యాచ్ కొన్ని బూతు పదాలు వాడిన సంగతి తెల్సిందే. హోస్ట్ నాగార్జున సైతం ఈ విషయం గురించి ప్రస్తావించారు. ఈ నామినేషన్లలో ఆ విషయాలు మరోసారి చర్చకు వచ్చాయి.
ముఖేష్ మాట్లాడిన తీరు అత్యంత రూడ్‌గా, వల్గర్‌గా ఉందని వంశీ మండిపడ్డాడు. ముఖేష్ అలా మాట్లాడటం వల్లే సింగర్ ఝాన్సీ కంటతడి పెట్టుకోవాల్సి వచ్చిందని విమర్శిస్తూ ముఖేష్‌ను నామినేట్ చేశాడు. అలాగే వర్షిణి వ్యక్తిత్వాన్ని విమర్శిస్తూ ఆమెను కూడా వంశీ నామినేట్ చేశాడు.
ఇక గతంలో అమన్ తీసుకున్న ఒక నిర్ణయం నచ్చలేదని చెబుతూ అమన్‌ను సుధీర్ నామినేట్ చేశాడు. అంతే కాకుండా వంశీని కూడా సుధీర్ నామినేట్ చేసాడు. ఎవరికీ ఎలాంటి సంబంధం లేకపోయినా ముఖేష్ అనవసరంగా దూకుడు ప్రదర్శిస్తున్నాడని శ్వేత నాయుడు ఆరోపించింది. ముఖేష్ తన గేమ్ తాను ఆడుతున్నానని చెప్పగా.. ముఖేష్ ఆడిన గేమ్ వల్లే ఝాన్సీ హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందని శివ మధ్యలో దూరి కౌంటర్ ఇచ్చాడు.
ఇక ఇది కాకుండా నీతు, వర్షిణిని నామినేట్ చేసింది. వీకెండ్ లో తన గురించి రాసిన అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ వర్షిణి ని నామినేట్ చేసింది నీతూ. వర్షిణి ఈ విషయంలో సరిగా డిఫెండ్ చేసుకోలేక పోయింది. ఇంకో పక్కన నరేష్ కూడా వర్షిణి ని నామినేట్ చేస్తూ, వేరే వాళ్ళ కోసం గేమ్ ఆడుతున్నావ్ అని చెప్పాడు.
ఈ రకంగా ఆల్మోస్ట్ అందరూ వర్షిణి ముకేశ్లని గట్టిగానే టార్గెట్ చేసారు. అయితే ఇంకా ఈ ప్రక్రియ ముగియలేదు.