• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  OTT - Streaming Apps >  బిగ్ బాస్ తెలుగు 10కు...

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

| బిగ్ బాస్ తెలుగు 10లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, స్నేహాలు, విభేదాలు బహిరంగంగా కనిపిస్తాయి. కానీ ‘ది ట్రైటర్స్ తెలుగు’లో అసలు ఆట తెరవెనుక జరుగుతుంది.

By - Tupaki Desk
Update: 2026-11-03 09:54 GMT

బిగ్ బాస్ తెలుగు 10 అంటే హౌస్‌లో గొడవలు, గ్రూపులు, రాజకీయాలు, ఎలిమినేషన్లు.. ఇవన్నీ ప్రేక్షకులకు సుపరిచితమే. కానీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’ మాత్రం రియాలిటీ గేమ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తోంది. ఇక్కడ నమ్మకమే ఒక ఉచ్చు.. స్నేహం వెనుక మరో కుట్ర.. చివరకు ట్రైటర్స్ సైతం ఒకరికి ఒకరు వెన్నుపోటు పొడిచే పరిస్థితి!

తేజ సజ్జ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సైకలాజికల్ రియాలిటీ షోలో 20 మంది సెలబ్రిటీలు ఒక ప్యాలెస్‌లోకి అడుగుపెట్టారు. వారిలో దాగి ఉన్న ట్రైటర్స్‌ను ఇన్నోసెంట్స్ గుర్తించాలి. మరోవైపు ట్రైటర్స్ తమ అసలు గుర్తింపును బయటపడకుండా కాపాడుకుంటూ, రహస్యంగా ఇతర ప్లేయర్స్‌ను గేమ్ నుంచి తొలగించేందుకు వ్యూహాలు రచిస్తుంటారు. ఈ ఉత్కంఠభరితమైన ఆటలో ఏకంగా రూ.కోటి వరకు ప్రైజ్ మనీ గెలుచుకునే అవకాశం ఉండటంతో ప్రతి ఆరోపణ, ప్రతి ఓటు, ప్రతి పొత్తు గేమ్‌ను కొత్త మలుపు తిప్పుతోంది.

ఇప్పటివరకు 9 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కాగా, గేమ్‌లో అనూహ్యమైన అధికార మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట్లో ఉన్న ఒరిజినల్ ట్రైటర్స్ అందరూ బయటపడటంతో పాటు ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్యాలెస్‌లో ఆట పూర్తిగా కొత్త దశలోకి ప్రవేశించింది. ఇన్నోసెంట్స్ ఇక ట్రైటర్స్ లేరని ఊపిరి పీల్చుకునేలోపే కొత్త ట్రైటర్స్ రంగంలోకి దిగారు. దీంతో మళ్లీ అనుమానాలు, కుట్రలు, వ్యూహాలు మొదలయ్యాయి.

అషికా పాత్రపై అనుమానాలు పెరుగుతున్న సమయంలో విద్యు చేసిన ఎక్స్‌పోజ్ ప్రయత్నం నుంచి, విష్ణుపై ఏకగ్రీవంగా జరిగిన బహిష్కరణ వరకు, రాహత్ ఎలిమినేషన్ వరకు ప్రతి పరిణామం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా రాహత్‌ను పదే పదే ప్రశ్నిస్తూ శ్రావ్య చేసిన ప్రయత్నాలు అతడి బహిష్కరణలో కీలకంగా మారాయి. ఆ పరిణామాలే చివరకు ఒరిజినల్ ట్రైటర్ అసలు రూపాన్ని బయటపెట్టాయి.

అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. మొదటి ట్రైటర్స్‌ను ఎలిమినేట్ చేయడంతో గేమ్ ముగిసిపోలేదు. వారి స్థానంలో కొత్త ట్రైటర్స్ రావడంతో ఇన్నోసెంట్స్ మళ్లీ మొదటి నుంచి తమ వేటను ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్యాలెస్‌లో నమ్మకాలు పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన ట్రైటర్స్‌కు కూడా ఇదొక పెద్ద అవకాశంగా మారింది.

బిగ్ బాస్ తెలుగు 10లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు, స్నేహాలు, విభేదాలు బహిరంగంగా కనిపిస్తాయి. కానీ ‘ది ట్రైటర్స్ తెలుగు’లో అసలు ఆట తెరవెనుక జరుగుతుంది. మీ పక్కనే ఉన్న వ్యక్తి మీ ఎలిమినేషన్ కోసం కుట్ర చేస్తుండవచ్చు. మీరు అత్యంత నమ్మిన వ్యక్తే మీకు అతిపెద్ద శత్రువు కావచ్చు. ఎవరు నిజం చెబుతున్నారు? ఎవరు అబద్ధం చెబుతున్నారు? ఎవరు ఎవరిని నమ్మిస్తున్నారు? అన్నదే ఈ షోలో అసలైన ఉత్కంఠ.

ఒరిజినల్ ట్రైటర్స్ ఆట ముగిసింది.. కొత్త ట్రైటర్స్ రంగంలోకి దిగారు.. మరి ఈసారి ఇన్నోసెంట్స్ వారిని గుర్తించగలరా? లేక మరోసారి మోసపోతారా? గతంలో జరిగిన తప్పులే మళ్లీ పునరావృతమవుతాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మొత్తానికి బిగ్ బాస్ తెలుగు 10కు ‘ది ట్రైటర్స్ తెలుగు’ గట్టి పోటీ ఇస్తూ, తెలుగు ప్రేక్షకులకు సరికొత్త రియాలిటీ గేమ్ అనుభూతిని అందిస్తోంది.

‘ది ట్రైటర్స్ తెలుగు’ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్లు విడుదలవుతున్నాయి.

Tags:    
  • thetraitorstelugu 
  • biggbosstelugu10 
  • tejasajja 
  • primevideo 
  • telugurealityshow 
  • biggbosstelugu10_p 

Similar News

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

2026-11-02 06:50 GMT

బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

2026-11-02 06:50 GMT

నాగార్జున సమర్పిస్తున్న సినిమా ని బాయికాట్ చేస్తాం అంటున్న నెటిజన్లు

2026-11-01 12:04 GMT

కీర్తి 'అక్క'.. టాక్ ఎలా ఉంది?

2026-11-01 05:14 GMT

డిజిటల్ స్పేస్‌లో బోల్డ్ స్టోరీల వెనుక లాజిక్!

2026-11-01 00:30 GMT

Bigg Boss Telugu 10: ఝాన్సీ ఎలిమినేటెడ్, సీక్రెట్ రూమ్కి రోహిత్?

2026-10-31 18:16 GMT

దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ GAME’ డిజిటల్ ఎంట్రీ.. స్ట్రీమింగ్ తేదీ ఇదే!

2026-10-31 15:42 GMT

'వారణాసి'కి మళ్లీ అదే ప్లానా!

2026-10-31 12:42 GMT

రోహిత్ అమన్ ల మధ్య రగిలిన చిచ్చు

2026-10-31 04:02 GMT

Copyright @2026

Powered by Blink CMS