Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!
| బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 తొమ్మిదో వారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ వారం 10 మంది నామినేషన్లలో ఉండగా, అన్‌అఫీషియల్ పోల్స్‌లో ముఖేష్ గౌడ మొదటి స్థానంలో, టెంపర్ వంశీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. నరేష్, అమన్, రామ్ ప్రసాద్ సేఫ్ జోన్‌లో ఉండగా, నీతూ నటరాజ్, వర్షిణి, శివ కుమార్, సుధీర్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు ఓటింగ్ ట్రెండ్స్ సూచిస్తున్నాయి. ఫ్యామిలీ వీక్‌కు ముందు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో హౌస్ ఇప్పుడు అత్యంత కీలకమైన తొమ్మిదో వారం ఎలిమినేషన్ దశకు చేరుకుంది. రాబోయే వారంలో 'ఫ్యామిలీ వీక్' ఉండటంతో, ఈ వారం హౌస్‌లో ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో తారాస్థాయికి చేరింది.
గత వారం రోహిత్ నాయుడు షాకింగ్ ఎలిమినేషన్ తర్వాత ఈ వారం నామినేషన్లలో ఏకంగా 10 మంది కంటెస్టెంట్లు బరిలో నిలవడం ఆటను మరింత రసవత్తరంగా మార్చింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కొందరు, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందని ఇంకొంత మంది చెప్తున్నారు.
త్రిగుణ్ నామినేషన్లలో లేకపోవడంతో ఓటింగ్ పరంగా ముఖేష్ గౌడ భారీ ఆధిక్యంతో టాప్ గేర్‌లో దూసుకుపోతున్నారు. సీరియల్ అభిమానుల మద్దతుతో ఆయన అధిక శాతం ఓట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా టెంపర్ వంశీ సుమారు రెండో స్థానంలో నిలవడం విశేషం. త్రిగుణ్‌తో ఉన్న స్నేహం కారణంగా ఆయన ఓట్లు కూడా పెద్ద ఎత్తున వంశీకి పడుతున్నట్లు అర్థమవుతుంది.
నామినేషన్లలో మొత్తం పది మంది ఉండటంతో, వచ్చిన ఓట్లలో సగానికి పైగా ముఖేష్, వంశీలే దక్కించుకున్నారు. మిగతా 50 శాతం ఓట్ల కోసం 8 మంది పోటీ పడుతుండటంతో అందులో చాలా మంది డేంజర్ జోన్లో ఉన్నట్టే. ప్రస్తుత అన్‌అఫీషియల్ పోల్స్ మరియు ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం.. నరేష్, అమన్, రామ్ ప్రసాద్‌లు సేఫ్ జోన్ వైపు ఉండగా.. నీతూ నటరాజ్, వర్షిణి, శివ కుమార్ మరియు సుధీర్‌లు అత్యంత ప్రమాదకరమైన డేంజర్ జోన్‌లో కొనసాగుతున్నారు. గత వారం ముఖేష్ పవర్ ద్వారా ఎలిమినేషన్ నుంచి తృటిలో తప్పించుకున్న సుధీర్, ఈ వారం ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉండటం ఆయనకు పెద్ద మైనస్‌గా మారింది.
ఫ్యామిలీ వీక్‌కు ముందు జరిగే ఈ చివరి ఎలిమినేషన్‌లో చివరి నిమిషంలో ఓటింగ్ సమీకరణాలు ఎలా మారతాయి, హోస్ట్ నాగార్జున వీకెండ్‌లో ఎలాంటి ట్విస్ట్ ఇస్తారనేది వేచి చూడాలి!