వివాహం తర్వాత తొలి పోస్ట్ పంచుకున్న ప్రియా భవాని శంకర్.. జీవితంలో మరువలేని రోజంటూ!
| కోలీవుడ్ నటి ప్రియా భవాని శంకర్ తన పదేళ్ల ప్రేమకు పెళ్లి బంధంతో ముగింపు పలికింది. కాలేజ్ ఫ్రెండ్, ఫైనాన్స్ రంగానికి చెందిన రాజ్ వేల్ రాజ్‌ను నవంబర్ 11న చెన్నైలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుంది. నవంబర్ 10న నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి.
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో న్యూస్ ప్రెజెంటర్ గా కెరియర్ మొదలుపెట్టి.. సీరియల్స్ లో కూడా నటించి, తన కెరియర్ ఆరంభించిన ప్రియా భవాని శంకర్.. ఆ తర్వాత హీరోయిన్ గా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక తెలుగులో సంతోష్ శోభన్ హీరోగా నటించిన కళ్యాణం కమనీయం అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో క్రష్ గా స్థానం సంపాదించుకున్న ఈమె.. ఆ తర్వాత చేసిన భీమా, జీబ్రా లాంటి చిత్రాలు పెద్దగా గుర్తింపును అందివ్వలేదు. కానీ ఈ ఏడాది చివరిగా శివ నిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఇరుముడి చిత్రంలో రవితేజ భార్యగా నటించి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఒకవైపు వరుస సినిమాల షూటింగ్ లతో బిజీగా గడిపేస్తున్న ఈమె.. మరొకవైపు తన వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకుంది .తన కాలేజ్ ఫ్రెండ్ అయిన రాజ్ తో గత 10 ఏళ్లు గా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ అమ్మడు.. సడన్‌గా నవంబర్ 10వ తేదీన నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి చేసుకోవడానికి సమయం పడుతుందేమో అని ఆడియన్స్ , అభిమానులు కూడా అనుకుంటుండగా సడన్‌గా ఆ మరుసటిరోజే అనగా నవంబర్ 11న తన ప్రియుడితో ఏడడుగులు వేసి మరోసారి ప్రైజ్ ఇచ్చింది ప్రియా భవాని శంకర్.
ఫైనాన్స్ రంగానికి చెందిన రాజ్ వేల్ రాజ్ తో చెన్నైలో బుధవారం ఉదయం చాలా సింపుల్ గా ఏడు అడుగులు వేసింది. ఈ సింపుల్ వివాహానికి కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. ఇకపోతే వివాహం తర్వాత ప్రియా భవాని శంకర్ తొలిసారి పోస్టు పంచుకుంటూ జీవితాంతం గుర్తుండిపోతుంది అనే రేంజ్ లో క్యాప్షన్ జోడించింది. తన పెళ్లి ఫోటోలను ప్రియా భవాని శంకర్ షేర్ చేస్తూ.. ఎట్టకేలకు నవంబర్ 11 2026న ఇది జరిగింది అంటూ తమ మధురానుభూతులను అభిమానులతో పంచుకుంది.
ప్రియా భవాని శంకర్ షేర్ చేసిన ఫోటోలలో వీళ్ళిద్దరూ చాలా సింపుల్ గా , ట్రెడిషనల్ గా కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. మొత్తానికైతే పదేళ్ల ప్రేమకు స్వస్తి పలుకుతూ.. ప్రియా భవాని శంకర్ తన మనసుకు నచ్చిన రాజ్ వేల్ రాజ్ తో ఏడడుగులు వేసింది. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సెలబ్రిటీలు, అభిమానులు వీళ్ళిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రియా భవాని శంకర్ సినిమాల విషయానికి వస్తే.. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న అహం బ్రహ్మాస్మి అనే సినిమాలో ఈమె నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2027 జూలై 9వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. అజయ్ జ్ఞానముతో దర్శకత్వంలో హారర్ ఫ్రాంచైజీ లో భాగంగా రాబోతున్న డెమోంటే కాలనీ 3లో కూడా ప్రియా భావాని శంకర్ నటిస్తోంది. మరగాధ నాణయం 2 లో కూడా ఈమె నటిస్తోంది.