సంగీత - విజయ్ విడాకుల కేసులో ఊహించిన ట్విస్ట్.. విత్డ్రా వెనుక ఇంత కథ ఉందా?

తన భర్త ఒక సినీ నటితో రిలేషన్ లో ఉన్నారని, అందుకే తన భర్త నుంచి తనకు విడాకులు కావాలి అంటూ ఆమె కోర్టును ఆశ్రయించింది.

Update: 2026-08-09 05:49 GMT

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్- సంగీత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రేమించి , పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.. కొడుకులిద్దరూ కెరీర్ ను బిల్డ్ చేసుకుంటున్న సమయంలో సడన్గా ఈ జంట విడిపోతున్నట్లు ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 2025 డిసెంబర్ 5న తన భర్త విజయ్ నుండి తనకు విడాకులు కావాలి అంటూ చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది సంగీత.

తన భర్త ఒక సినీ నటితో రిలేషన్ లో ఉన్నారని, అందుకే తన భర్త నుంచి తనకు విడాకులు కావాలి అంటూ ఆమె కోర్టును ఆశ్రయించింది. అదే సమయంలో ప్రముఖ హీరోయిన్ త్రిష పేరు వెలుగులోకి రావడం గమనార్హం. ముఖ్యంగా చెన్నైలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో త్రిష , విజయ్ కలిసి కనిపించడం, ఒకే రంగు దుస్తుల్లో దర్శనం ఇవ్వడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు కూడా విజయ్ , త్రిష రిలేషన్ గురించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. ఈ విషయంపై అప్పుడప్పుడు త్రిష టీం స్పందించినా.. విజయ్ మాత్రం ఏ రోజు కూడా ఈ విషయంపై స్పందించలేదు.

పైగా అటు విజయ్ తన రాజకీయ పార్టీ ప్రమోషన్స్ లో బిజీ కావడంతో ఆయన కోర్టుకు హాజరు కాలేదు. పార్టీ పెట్టిన అతి తక్కువ సమయంలోనే ఏకంగా తమిళనాడుకి ఆయన ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. ఇక అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా విజయ్ కోర్టుకు హాజరు కావడంలో కాస్త ఇబ్బందులు తలెత్తడంతో ఆయన హాజరు కాలేకపోయారు. అయితే తదుపరి విచారణను ఆగస్టు 7 కి వాయిదా వేయగా..సంగీత వీడియో కాల్ ద్వారా విచారణకు హాజరయ్యారు.

ఈ నేపథ్యంలోనే సంగీత తన భర్త నుండి విడాకుల పిటిషన్ విత్ డ్రా చేసుకుంటున్నట్లు కోర్టుకు తెలియజేసింది. దీంతో విజయ్ తరపు న్యాయవాదులు కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో న్యాయస్థానం కేసును అధికారికంగా క్లోజ్ చేసింది. గత ఆరు నెలలుగా విజయ్ నుండి విడాకులు కావాలి అంటూ కోర్టు చుట్టూ తిరిగిన సంగీత సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అటు తమిళనాడు రాజకీయాలతో పాటు కోలీవుడ్ సినీ వర్గాలలో కూడా పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. విజయ్ నుండి విడాకులు కోరుతూ పిటిషన్ అప్లై చేసిన సంగీత.. మళ్లీ విత్డ్రా చేసుకోవడం వెనుక అసలు కారణం ఏమిటి అనే విషయానికొస్తే.. తమిళనాడులో సీఎం హోదాలో ఉన్న విజయ్ గౌరవానికి భంగం కలకూడదని సంగీత ఇలా విడాకుల పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నట్లు సమాచారం. విపక్షాల విమర్శలకు ఆస్కారం ఇవ్వకుండా.. శ్రేయోభిలాషుల సూచన మేరకు ఆమె తన భర్తను, భర్త హోదాను గౌరవించారని తెలుస్తోంది. పైగా మీడియా ప్రచారానికి, కోర్టుకు దూరంగా ఇంట్లోనే సమస్యను పరిష్కరించుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ అంశంపై మధ్యవర్తుల సమక్షంలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఫ్యామిలీ విషయం నుండి విజయ్ కి భారీ ఊరట కలిగింది అని చెప్పవచ్చు.

Tags:    

Similar News