సితారా.. నాన్న మొబైల్ తీసుకుని ఆ రాముడు లుక్ లీక్ చేయమ్మా!

"హ్యాపీ బర్త్‌డే నాన్నా.. నువ్వెప్పుడూ నా ఫేవరెట్ పర్సన్‌వే. లవ్ యు ఆల్వేస్" అంటూ సితార తన తండ్రిపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఒక క్యూట్ ఫోటోను పోస్ట్ చేసింది.

Update: 2026-08-09 07:31 GMT

సూపర్‌స్టార్ మహేష్ బాబుకు త‌న గారాలప‌ట్టీ సితార‌తో ఉన్న అనుబంధం గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. నాన్న కూచీ సితార అంటే గొప్ప ప్రేమాభిమానాలు ఈ తండ్రికి ఉన్నాయి. నేడు (ఆగ‌స్టు9) మ‌హేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమార్తె సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ప్రత్యేకమైన పోస్ట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. "హ్యాపీ బర్త్‌డే నాన్నా.. నువ్వెప్పుడూ నా ఫేవరెట్ పర్సన్‌వే. లవ్ యు ఆల్వేస్" అంటూ సితార తన తండ్రిపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ఒక క్యూట్ ఫోటోను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు మామ్ నమ్రతా శిరోద్కర్ హెచ్‌డి హార్ట్ ఎమోజీలతో స్పందించగా..అభిమానులు లైక్స్ - కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ఈ బర్త్‌డే పోస్ట్ కి క్ష‌ణాల్లో అభిమానుల నుంచి స్పంద‌న‌లు వ‌చ్చాయి. తండ్రి కూతుళ్ల అనుబంధంపై ఫ్యాన్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తూ ల‌వ్ హార్ట్ ఈమోజీల‌ను షేర్ చేస్తున్నారు. కొంద‌రు అభిమానుల‌కు ప్ర‌త్యేకించి మ‌హేష్ ఫిట్‌నెస్ ఎలిమెంట్ విప‌రీతంగా ఆక‌ర్షించింది. మహేష్ బాబు ఫిట్‌నెస్.. అత‌డి చేతికి కనిపిస్తున్న నరాలు అభిమానుల దృష్టిని బాగా ఆకర్షించాయి. ``ఆ నరాలు ఏంటి అన్నా.. వాట్ ఎ ఫిట్‌నెస్!`` అంటూ ఫ్యాన్స్ కామెంట్ బాక్స్‌లో రచ్చ చేస్తున్నారు. మహేష్ బాబు తన వయస్సు పెరుగుతున్న కొద్దీ మరింత యంగ్‌గా, ఫిట్‌గా తయారవుతున్నారని... ఆయన మేకోవర్ - హ్యాండ్‌సమ్ లుక్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సితార పోస్ట్ కింద అభిమానులు క్రియేటివ్‌గా రాసిన కామెంట్లు.. విషెస్ ట్రెండింగ్‌గా మారాయి. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన రాజకుమారుడు, మురారి, ఒక్కడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, మహర్షి, గుంటూరు కారం నుండి ...ప్ర‌తిష్ఠాత్మ‌క SSMB29 - వారణాసి బ్యాక్‌డ్రాప్ వరకు ఆయన కెరీర్‌లోని ప్రతి సినిమా పేరునూ కలుపుతూ ఒక అభిమాని రాసిన సుదీర్ఘమైన బర్త్‌డే విష్ పోస్ట్‌కే హైలైట్‌గా నిలిచింది.

మరికొందరు అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తూ.. ``సితారా.. నాన్న మొబైల్ తీసుకుని ఆ రాముడు (SSMB29-రాజమౌళి సినిమా) లుక్ ఫోటోలు ఏవైనా ఉంటే లీక్ చేయమ్మా!`` అంటూ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు ``బాబులకే బాబు మా మహేష్ బాబు`` అంటూ టాలీవుడ్ ప్రిన్స్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిజిటల్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు.

ప్రస్తుతం ఎస్‌ఎస్ రాజమౌళితో అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్ ప్రాజెక్ట్ తో మహేష్ బాబు ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి త‌లిసిందే. ఈ స‌మ‌యంలో బ‌ర్త్ డే వేడుక‌లు వేడెక్కిస్తున్నాయి. ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు మహేష్ బాబుకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మ‌హేష్ - రాజ‌మౌళి కాంబినేష‌న్ లోని వార‌ణాసి చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. ఈ సినిమా ప్ర‌చారార్భాటం ఇప్ప‌టికే వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News