టాలీవుడ్ హీరోపై మనసు పారేసుకున్న మమిత బైజు.. డైహార్డ్ ఫ్యాన్ అంటూ!

ముఖ్యంగా టాలీవుడ్ హీరోపై మనసు పారేసుకుంటూ మమిత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Update: 2026-08-09 05:46 GMT

సెలబ్రిటీలు అంటే అభిమానం కేవలం సినీ ప్రేక్షకులకు మాత్రమే కాదు.. సెలబ్రిటీలకు కూడా.. ఇండస్ట్రీలో తమ అభిమాన నటీనటులు ఉంటారు. ముఖ్యంగా ఆయా సందర్భాలు వచ్చినప్పుడు తమకు ఇష్టమైన హీరో హీరోయిన్ గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ప్రముఖ హీరోయిన్ మమిత బైజు కూడా తాజాగా తన ఫేవరెట్ హీరో గురించి చెప్పి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ముఖ్యంగా టాలీవుడ్ హీరోపై మనసు పారేసుకుంటూ మమిత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఒక్క సినిమాతో ఊహించని పాపులారిటీ..

కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లా కిడంగూర్ ప్రాంతానికి చెందిన ఈ మలయాళ బ్యూటీ తొలిసారి 2017లో సర్వోపరి పాలక్కారన్ అనే చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. 2021లో ఆపరేషన్ జావా సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె.. ఆ తర్వాత ఖో ఖో సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత సూపర్ శరణ్య, ప్రణయ విలాసం వంటి చిత్రాలతో మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె.. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రేమలు సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. 2024 లో వచ్చిన ఈ చిత్రానికి గిరీష్ ఎడి దర్శకత్వం వహించగా.. తెలుగులో ఎస్ ఎస్ కార్తికేయ విడుదల చేశారు.

సూర్య సరసన హీరోయిన్గా మూవీ..

ఈ సినిమాతో మంచి పేరు అందుకున్న ఈమె.. 2025లో డ్యూడ్ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. జన నాయగన్ సినిమాలో హీరో కూతురు పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో ఆమెకు తగినంత క్యారెక్టర్ పడలేదనే ఆవేదన అభిమానులు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఈమె సూర్య సరసన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

ఆ టాలీవుడ్ హీరో అంటే చాలా ఇష్టం..

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా.. అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రమోషన్స్లో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మమిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాను అల్లు అర్జున్ కు డైహార్డ్ ఫ్యాన్ అని, ఆయన సినిమాలను రిపీట్ మోడ్లో చూస్తూ ఉంటాను అంటూ అల్లు అర్జున్ పై తన ఇష్టాన్ని పంచుకుంది. ముఖ్యంగా బన్నీ స్టైల్ అంటే చాలా ఇష్టమని , ఆయనను ఎప్పుడూ ఫాలో అవుతానని కూడా తెలిపింది.

నా కెరియర్లో తుది నిర్ణయం ఆయనదే..

ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మానసిక ప్రశాంతత కోసం కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాను . ముఖ్యంగా నా విషయంలో ఏ నిర్ణయమైనా సరే అన్నయ్య తీసుకుంటారు. ఆయన నిర్ణయమే నా కెరియర్లో ఫైనల్ అంటూ చెప్పుకొచ్చింది మమిత బైజు. మొత్తానికి అయితే మమిత చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అల్లు అభిమానులు ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు.

Tags:    

Similar News