డ్రాగన్‌లో రెండు ప్రపంచాలు.. మధ్యలో తారక్
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది మామూలు అప్డేట్ కాదు.. డ్రాగన్ మూవీలో అసలు మ్యాటర్ ఏంటో చిన్న క్లూ బయటకు వచ్చింది.
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇది మామూలు అప్డేట్ కాదు.. డ్రాగన్ మూవీలో అసలు మ్యాటర్ ఏంటో చిన్న క్లూ బయటకు వచ్చింది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్లాన్ చూస్తుంటే.. ఈసారి తారక్ ను ఇండియా వరకే ఆపేలా కనిపించడం లేదు. గ్లోబల్ రేంజ్ లో షేక్ చేసేలా సినిమా రెడీ చేస్తున్నారన్న టాక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
నిజానికి డ్రాగన్ పై అంచనాలు మొదటి నుంచి భారీగా ఉన్నాయి. తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో ఆ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడు రాజమౌళి కుమారుడు, ప్రొడ్యూసర్ ఎస్ ఎస్ కార్తికేయ చేసిన కామెంట్స్ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తారక్ అన్నతో మాట్లాడుతున్నానని, సినిమా గురించి కొన్ని విషయాలు తనకు తెలుసని ఆయన చెప్పారు.
ముఖ్యంగా.. ఇప్పటివరకు చూసిన ప్రశాంత్ నీల్ కాదు, కొత్త ప్రశాంత్ నీల్‌ను చూడబోతున్నామని.. అలాగే ఇప్పటివరకు చూడని కొత్త తారక్ ను కూడా సినిమాలో చూస్తామని కార్తికేయ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. డ్రాగన్ మన ఇండియా షేక్ చేయడమే కాదు.. ప్రపంచాన్ని కూడా షేక్ చేసేలా ఉంటుందని ఆయన చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ లో ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి.
ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే భారీ యాక్షన్, డార్క్ విజువల్స్, రా అండ్ రస్టిక్ టేకింగ్ గుర్తొస్తాయి. కేజీఎఫ్, సలార్ తర్వాత అదే మార్క్ ను మరింత పెద్ద స్కేల్ లో చూపించేందుకు డ్రాగన్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి నీల్ కేవలం యాక్షన్ కే పరిమితం కాకుండా కథను కూడా ఇంటర్నేషనల్ రేంజ్ లో రాసుకున్నట్లు సమాచారం. 1960ల బ్యాక్ డ్రాప్ లో సాగే ఆ కథలో అంతర్జాతీయ నల్లమందు స్మగ్లింగ్ బిజినెస్ కీలకంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
దాని చుట్టూ జరిగే మాఫియా గేమ్, డామినేషన్ వార్స్ కథకు మెయిన్ స్ట్రెంత్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో తారక్ రోల్ చాలా పవర్ ఫుల్ గా, ఇప్పటివరకు ఆయన చేయని విధంగా ఇంటెన్స్ గా ఉండబోతుందని టాక్. ఇక విజువల్స్ విషయంలో నీల్ కొత్త గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలోని కొన్ని సీన్స్ కు డార్క్ షేడ్స్ ను ఉపయోగిస్తూనే.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను మాత్రం పూర్తిగా భిన్నమైన కలర్ ట్రీట్మెంట్ తో చూపించబోతున్నట్లు సమాచారం.
అంటే కథలో ఒక వరల్డ్ డార్క్ గా ఉంటే.. మరో వరల్డ్ కలర్ ఫుల్ గా కనిపించనుంది. ఆ రెండు వరల్డ్స్ మధ్య వచ్చే ఛేంజ్ తారక్ రోల్ లో ఎమోషన్ ను స్ట్రాంగ్ గా చూపించేందుకు యూజ్ అవ్వనుందని సమాచారం. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాలో అనిల్ కపూర్, బిజు మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా.. భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.