• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూర్య 'కర్ణ '.. ఎంతవరకు...

సూర్య 'కర్ణ '.. ఎంతవరకు వచ్చినట్లు..?

| అయితే కర్ణ సినిమాను చాలా నెలల క్రితమే మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు షూటింగ్ మొదలు కాలేదు.

By - Tupaki Desk
Update: 2024-05-15 15:30 GMT

మహాభారతంలోని కర్ణుడి పాత్రను బేసుకుని బీ టౌన్ స్టార్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మిశ్రా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'కర్ణ '. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాను ఆయన పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే కర్ణ సినిమాను చాలా నెలల క్రితమే మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు షూటింగ్ మొదలు కాలేదు. బడ్జెట్ సమస్యతో పాటు సూర్య డేట్స్ ఖాళీ లేకపోవడం ఈ మూవీ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. షూటింగ్ మొదలు పెట్టేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారట. బడ్జెట్ ను కూడా కాస్త తగ్గించినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

దీంతో సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. సూర్య తన యాక్టింగ్ తో ఈ సినిమాలో అదరగొట్టనున్నారని అంటున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని చెబుతున్నారు. అయితే సీనియర్ ఎన్టీఆర్, శివాజీ గణేశన్ లు.. ఇప్పటికే కర్ణుడి పాత్రలో పలు సినిమాల్లో కనిపించి అలరించారు. ఇప్పుడు అదే పాత్రను సూర్య చేస్తుండడంతో.. తన టాలెంట్ అంతా బయటపెట్టాలని చెబుతున్నారు సినీ పండితులు.

అయితే ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో చేయాలని దర్శకుడు రాకేష్ తొలుత భావించారు. కానీ ఆ తర్వాత సూర్యను ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫిమేల్ లీడ్ రోల్ పోషించనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే మేకర్స్ ఆమెను కాంటాక్ట్ చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా చిత్రంలో ఛాన్స్ రావడంతో జాన్వీ కూడా సరే అన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మరోవైపు, ప్రస్తుతం కంగువ మూవీతో బిజీగా ఉన్నారు సూర్య. 2024లోనే ఈ సినిమా రిలీజ్ కానుండడంతో స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత వెట్రిమారన్ వడివాసల్ చిత్రం చేయనున్నారు. ఈ మూవీ కాకుండా లోకేష్ కనగరాజ్ యూనివర్స్ లో భాగంగా రోలెక్స్ చేయనున్నారని కూడా గుసగుసలు వినిపించాయి. కానీ కర్ణ ప్రీప్రొడక్షన్ పనులు మరికొద్ది రోజుల్లో కంప్లీట్ అవ్వనున్నాయని, అంతలో కంగువను కూడా సూర్య పూర్తి చేయనున్నారని చెబుతున్నారు. ఆ తర్వాత 'కర్ణ ' ప్రాజెక్ట్ స్టార్ చేయనున్నారని అంటున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    
  • Suriya 
  • karna 
  • Bollywood 
  • Rakeshomprakash 
  • Janhvikapoor 
  • Kanguva 
  • Siva 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS