• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Fashion >  నేచుర‌ల్ అందంతో జెన్ Zని...

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

| రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ తన అందం, డాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో నార్త్, సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ట్రెడిషనల్ లెహంగాలు, చీరలు, ఇండో వెస్ట్రన్ అవుట్‌ఫిట్లలో రాయల్ లుక్‌తో మెప్పిస్తోంది. 'ఆజాద్'తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఘట్టమనేని యువహీరో సరసన తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

By - Sivaji Kontham
Update: 2026-11-05 08:06 GMT

త‌డానీ కుటుబం నుంచి టాలీవుడ్ లో అడుగుపెట్టిన యువ‌రాణి రాషా త‌డానీకి ఇటీవ‌ల ఉత్త‌రాదితో పాటు ద‌క్షిణాదినా ఫాలోయింగ్ ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. అందాల క‌థానాయిక ర‌వీనా టాండ‌న్ న‌ట‌వార‌సురాలిగా బ‌రిలోకి దిగిన రాషా త‌డానీ తొలి నుంచి త‌న అంద‌చందాలు, అద్భుత‌మైన ఎక్స్ ప్రెష‌న్స్ తో కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. `ఉయ్ అమ్మా` పాట‌లో రాషా హుషారైన స్టెప్పుల‌కు, ఎన‌ర్జీకి కూడా జ‌నం పిచ్చెక్కిపోయారు.

అదంతా అటుంచితే రెగ్యుల‌ర్ ఫోటోషూట్ల‌లో రాషా త‌డానీ హ‌ద్దులు మీర‌కుండానే మ‌త్తెక్కిస్తోంది. ఇన్ స్టాగ్ర‌మ్ స‌హా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసే ఫోటోషూట్ల‌లో ఎంతో ట్రెడిస‌ష‌న‌ల్ లుక్ లో క‌నిపించినా కానీ గ‌మ్మ‌త్త‌యిన అందంతో మ‌త్తులోకి దించేస్తోంది. రాషా త‌డానీ ఇన్ స్టా ఫీడ్ ఆధారంగా విశ్లేషిస్తే.. ర‌క‌ర‌కాల డిజైన‌ర్ దుస్తుల్లో క‌నిపిస్తున్న ఈ బ్యూటీ అంద‌చందాలు ఎలా కిక్కెక్కిస్తున్నాయో వ‌ర్ణించ‌డానికి ప‌దాలు చాల‌వు.

ఒకప్పటి అందాల కథానాయిక రవీనా టాండన్ నటవారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాషా, తొలి చిత్రం నుంచే తనదైన ముద్ర వేసింది. కేవలం తల్లి పోలికలు మాత్రమే కాకుండా.. నటనలోని ఎక్స్‌ప్రెషన్స్, హావభావాలు.. డాన్స్‌లో ఉండే ఎనర్జీతో యువత గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గ్లామర్ విషయంలో రాషా తడానీ ఎంచుకుంటున్న శైలి చాలా ప్రత్యేకమైనది. సోషల్ మీడియా వేదికగా.. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే ఫోటోషూట్లలో హద్దులు మీరకుండానే అపరిమితమైన మత్తును నింపుతోంది. అతిగా ఎక్స్‌పోజింగ్ చేయకుండా, ఎంతో ష‌టిల్డ్‌గా కళ్లతోనే మాయ చేసే టాలెంట్ రాషా సొంతం. ఇన్‌స్టా ఫీడ్‌ను పరిశీలిస్తే, రాషా పోస్ట్ చేసే ప్రతి ఫోటోషూట్ డిజైనర్ దుస్తుల్లో ఒక రాయల్ గ్లామర్‌ను ఆవిష్కరిస్తుంది. క్లాసీగా కనిపిస్తూనే నెటిజన్లను కట్టిపడేసే మంత్రముగ్ధమైన అందం ఈ కుర్ర‌భామ సొంతం.

ట్రెడిషనల్ డిజైనర్ లెహంగాలు, చీరలు, ఇండో-వెస్ట్రన్ అవుట్‌ఫిట్లలో రాషా కనిపించే తీరు చూపు తిప్పుకోనివ్వదు. సాంప్రదాయ దుస్తుల్లో కనిపించినా.. అందులో దాగి ఉన్న గమ్మత్తయిన రాయల్ లుక్ .. సహజసిద్ధమైన అందం చూసేవారిని మైమరిపిస్తుంది. ఎలాంటి ఆర్టిఫిషియల్ మేకప్ హంగులు లేకపోయినా.. తనదైన‌ నేచురల్ స్మైల్, వింటేజ్ గ్లామర్.. తీక్ష‌ణ‌మైన‌ చూపులతోనే కిక్కెక్కించే ఐకానిక్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా త‌న నేచుర‌ల్ అందం జెన్ జీని విప‌రీతంగా క‌వ్విస్తోంది. అందుకే రాషా రెగ్యుల‌ర్ ఇన్‌స్టా రీల్స్, ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

ఇక రాషా తడానీ కెరీర్ జర్నీ విషయానికి వస్తే.. రామ్ చరణ్ `పెద్ది`లో న‌టిస్తుంద‌ని భావించినా ఛాన్స్ మిస్స‌యింది. అయినా ఘ‌ట్ట‌మ‌నేని యువ‌హీరో స‌ర‌స‌న తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. తొలి సినిమాతోనే ఈ భామ‌కు ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అలాగే బాలీవుడ్ డెబ్యూ ప్రాజెక్ట్ ఆజాద్ ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాలతోనే ఈ యువ‌న‌టి అందరి దృష్టిని ఆకర్షించింది. ప‌రిణ‌తి అనుభ‌వంతో వ‌స్తుంది గ‌నుక‌.. ప్ర‌స్తుతానికి ఆక‌ట్టుకునే నటన, డాన్స్, గ్లామర్ అనే మూడు విభాగాల్లోనూ మంచి మార్కులు కొట్టేసి టాలీవుడ్,యు బాలీవుడ్ మేకర్స్‌కు బెస్ట్ ఆప్షన్‌గా మారింది.

2026 సంవత్సరంలో రాషా తడానీ కొన్ని భారీ ప్రాజెక్టుల‌లో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. ప‌లు క్రేజీ సౌత్ - నార్త్ ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. టాలెంట్‌కు తోడు అద్భుతమైన గ్లామర్ ప్రెజెన్స్ ఉన్న రాషా తడానీ మునుముందు ఏల‌బోయే టాప్ హీరోయిన్ల జాబితాలో నిలవడం ఖాయమేన‌ని అభిమానులు భావిస్తున్నారు.



Rasha Thadani turns heads at the Diwali celebrations in a stunning midnight-blue lehenga with gold embroidery. 💙✨ #rashathadani #instantbollywood #gk https://t.co/QDk9noLsAy

— InstantBollywood (@instantbolly) November 4, 2026


Tags:    
  • rashathadani 
  • rashathadanishoot 
  • ravteenatandan 
  • tollywood 
  • bollywood 

Similar News

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

Copyright @2026

Powered by Blink CMS