• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Fashion >  కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్...

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

| యాక్సెసరీస్ విషయానికి వస్తే.. షర్ట్, ఫ్యాంట్ ను కలుపుతూ నడుముకు ధరించిన డిజైనర్ ఎరుపు రంగు లెదర్ బెల్ట్ ధర సుమారుగా రూ.34,000 ఉంటుందని సమాచారం.

By - Madhu Reddy
Update: 2026-11-03 11:05 GMT

ఇటీవల కాలంలో హీరోయిన్స్ ఎప్పటికప్పుడు తమ అందంతోనే కాదు కాస్ట్యూమ్స్ తో కూడా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే అందం, అభినయంతో, కాస్ట్యూమ్స్ తో కాకుండా ఆ కాస్ట్యూమ్ ధరలతో అందరినీ ఆశ్చర్యపరిచింది బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్.. విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. నేరుగా తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించకపోయినా.. తన చిత్రాలను తెలుగులో డబ్బింగ్ చేసి ఇటు సౌత్ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుంది.

 

అలా పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్న ఈమె.. తాజాగా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే తాజాగా ఈమె ధరించిన ఔట్ఫిట్ విషయానికి వస్తే.. స్టైలిష్ గా, ట్రెండింగ్ గా కనిపించినప్పటికీ.. దాని ధర తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి కరీనాకపూర్ తాజాగా ధరించిన దుస్తులు, యాక్సెసరీస్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పవర్ డ్రెస్సింగ్ కు సరికొత్త నిర్వచనం చూపించిన కరీనాకపూర్.. పైస్లీ ప్రింట్ సిల్క్ షర్టు ధరించింది. ఇక దీని ధర అంచనా ప్రకారం సుమారుగా రూ.28,500 వరకూ ఉంటుంది. బాటమ్ లో బ్లాక్ లూజ్ ప్యాంట్ ధరించింది.ఇక దీని ధర సుమారుగా రూ.32,000 వరకు ఉంటుందని సమాచారం.

యాక్సెసరీస్ విషయానికి వస్తే.. షర్ట్, ఫ్యాంట్ ను కలుపుతూ నడుముకు ధరించిన డిజైనర్ ఎరుపు రంగు లెదర్ బెల్ట్ ధర సుమారుగా రూ.34,000 ఉంటుందని సమాచారం. అలాగే తన స్టైలిష్ లుక్కును మరింత అందంగా తీర్చిదిద్దుకోవడానికి ఈమె చేతిలో పట్టుకున్న ఎరుపు రంగు లెదర్ పర్సు ధర సుమారుగా రూ.48,000 ఉంటుందని అంచనా. అలాగే ఈమె ధరించిన హై హీల్స్ చెప్పుల ధర ఏకంగా రూ .72,000 వరకు ఉంటుందని ఫ్యాషన్ ప్రియులు చెబుతున్నారు.

కరీనాకపూర్ ధరించిన ఆభరణాల విషయానికి వస్తే.. బంగారు చెవి పోగులు ధరించిన ఈమె.. వీటి ధర ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువను బట్టి రూ.2,25,000 అని అంచనా. చేతికి ధరించిన స్టేట్మెంట్ బ్రాస్లెట్ ధర రూ.6,50,000 ఉండొచ్చు. అలా కరీనా కపూర్ మొత్తం లుక్కును పవర్ డ్రెస్సింగ్ గా అభివర్ణిస్తున్నారు అభిమానులు. క్లాసిక్ దుస్తులు దీనికి కాంబినేషన్ గా హెవీ గోల్డ్ జ్యువెలరీ ఈమె లుక్ ను మరింత రాయల్ గా మార్చేశాయి. ఏది ఏమైనా నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలిచే ఈమె ఈసారి తన అవుట్ ఫిట్ తోనే కాదు వాటి ధరలతో కూడా అందరిని ఆశ్చర్యపరిచింది.

Tags:    
  • kareenakapoor 
  • luxuryfashion 
  • celebritystyle 
  • designeroutfit 
  • goldjewellery 

Copyright @2026

Powered by Blink CMS