• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాకీలు ఎగ్గొట్టిన...

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

| ప్రముఖ డ్రమ్స్ కళాకారుడు శివమణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన ఓ మ్యూజిక్ డైరెక్టర్ మూడేళ్లుగా మ్యూజిషియన్లకు పారితోషికాలు చెల్లించడం లేదని ఆరోపించారు. వారి బాకీలు ఇప్పించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. అయితే ఆ సంగీత దర్శకుడి పేరు వెల్లడించలేదు. మరోవైపు 'రామాయణ' సినిమాకు ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్‌తో కలిసి పనిచేసినట్లు చెప్పారు.

By - M Prashanth
Update: 2026-11-05 07:36 GMT

ప్రముఖ డ్రమ్స్ కళాకారుడు శివమణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు తిరుమలకు వచ్చినప్పుడు తమ సినిమాలు, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతుంటారు. కానీ శివమణి మాత్రం ఓ మ్యూజిక్ డైరెక్టర్‌పై స్వామివారికే కంప్లైంట్ ఇచ్చానని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. హైదరాబాద్‌కు చెందిన ఓ సంగీత దర్శకుడు మూడేళ్లుగా మ్యూజిషియన్లకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఆయన ఆరోపించారు.

తిరుమలలో మీడియాతో మాట్లాడిన శివమణి, సంగీత కళాకారుల కష్టాన్ని ప్రస్తావించారు. ఒక పాట కోసం ఎంతోమంది మ్యూజిషియన్లు పనిచేస్తారని, వాళ్లకు రావాల్సిన పారితోషికం నిలిపివేయడం సరికాదని అన్నారు. మూడేళ్లుగా బాకీలు చెల్లించని సదరు మ్యూజిక్ డైరెక్టర్ నుంచి డబ్బులు ఇప్పించాలని వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు చెప్పారు. అయితే ఆ సంగీత దర్శకుడి పేరును మాత్రం బయటపెట్టలేదు.

నార్మల్ గా ఒక పాట హిట్టయితే ఎక్కువగా సంగీత దర్శకుడికే పేరు వస్తుంది. కానీ దాని వెనుక వాయిద్య కళాకారులు, ఇతర టెక్నీషియన్ల కష్టం కూడా ఉంటుంది. అలాంటి వాళ్లకు మూడేళ్లుగా డబ్బులు అందలేదని శివమణి స్థాయి కళాకారుడు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు శివమణి ప్రస్తుతం 'కర్మ బర్న్' పేరుతో ప్రత్యేకమైన మ్యూజిక్ కాన్సర్ట్‌లు నిర్వహిస్తున్నారు. వీటిలో కేవలం భక్తి గీతాలనే ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే మూడు షోలు పూర్తి చేశామని, త్వరలో అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోనూ ప్రదర్శనలు ఇవ్వబోతున్నామని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వివరించారు. ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమా గురించి కూడా శివమణి రెస్పాండ్ అయ్యారు. ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మెర్‌తో కలిసి ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం వర్క్ చేసినట్లు చెప్పారు.

ఇక చిన్న వయసులోనే డ్రమ్మింగ్ మొదలుపెట్టి దేశంలోనే ప్రముఖ పర్కషన్ ఆర్టిస్టుల్లో ఒకరిగా ఎదిగారు శివమణి. ఏఆర్ రెహమాన్‌తో ఆయనకు దశాబ్దాల అనుబంధం ఉంది. రెహమాన్ సంగీతం అందించిన ఎన్నో సినిమాలతో పాటు దేశవిదేశాల్లో జరిగిన లైవ్ కాన్సర్ట్‌లలో శివమణి తన డ్రమ్మింగ్‌తో ఆకట్టుకున్నారు. హిందీ, తెలుగు, తమిళ సినిమాలకూ వర్క్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న సంగీత కళాకారులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చిన అనుభవం ఉంది.

Tags:    
  • sivamani 
  • musicians 
  • tollywood 
  • ramayana 
  • arrahman 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS