హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!
| తమిళనాడు సీఎం, నటుడు విజయ్ మరోసారి కెమెరా ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన త్వరలో ఓ ప్రభుత్వ ప్రకటన చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ఈ ప్రకటనకు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారని, షూటింగ్ కోసం విజయ్ రెండు రోజులు కేటాయించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలు పూర్తయ్యాక చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.
తమిళ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అక్కడ ఎన్నో మంచి పనులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ హీరో ఇకపై సినిమాల్లో నటించనని ఎలక్షన్స్ ప్రచారంలోనే చెప్పేశారు. ఈ క్రమంలో తన చివరి సినిమా జననాయగన్ విజయ్ సీఎం అయిన తర్వాత విడుదలై పర్వాలేదు అనిపించుకుంది. అయితే ఇప్పుడు ఆయన అభిమానులకు ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. విజయ్ మరోసారి కెమెరా ముందుకు రాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
విజయ్ నటించిన చివరి సినిమాగా జననాయగన్..తెలుగులో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
అయితే రాజకీయాల్లో మాత్రం విజయ్ తన సత్తా చాటుకున్నారు. ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకుని తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఒకవైపు అభిమానులు తమ అభిమాన హీరో సీఎం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్న.. మరోవైపు ఆయనను ఇకపై వెండితెరపై చూడలేమేమో అనే బాధ కూడా వారిలో ఉంది.
ఈ క్రమంలో విజయ్ అభిమానులకు ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ముఖ్యమంత్రి విజయ్ త్వరలో ఒక ప్రభుత్వ ప్రకటన చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. సాధారణంగా ప్రభుత్వ ప్రకటనలు తక్కువ బడ్జెట్‌తో రూపొందుతుంటాయి. కానీ ఈసారి విజయ్ నటించనున్న ప్రకటన చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రకటన చిత్రానికి ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ కూడా ఈ షూటింగ్ కోసం రెండు రోజుల సమయం కేటాయించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ ప్రకటన చిత్రానికి సంబంధించిన షూటింగ్ వెంటనే ప్రారంభం కాకపోవచ్చని తెలుస్తోంది. ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత చిత్రీకరణ మొదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
విజయ్ రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ ప్రకటన ద్వారా మరోసారి కెమెరా ముందుకు రావడం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. మొత్తానికి సినిమాతో కాకుండా ఒక ప్రచార ప్రకటనతో తమ ఫేవరెట్ హీరోని స్క్రీన్ పైన చూడనున్నారు విజయ అభిమానులు.